ఎట్టకేలకు మళ్ళీ తీశాను Ayn Rand రాసిన The Fountainhead పుస్తకాన్ని

ఎట్టకేలకు మళ్ళీ తీశాను Ayn Rand రాసిన The Fountainhead పుస్తకాన్ని.గతం లో ఓ సారి చెప్పాను గదా..నాకు చదవబుద్ది గాక మూసేసిన పుస్తకాల్లో ఇది ఒకటని...అయినా ఏదో ఒక చోట ..ఎవరో ఒకరు ఈమె పేరు నో,ఈ పుస్తకాన్నో ఉటంకిస్తూనే ఉన్నారు..ఎవరైన సోదాహరణ గా రాస్తారేమో చదువుదామని ఊరుకున్నా ..కానీ ఊహూ జరగడం లా! అందుకనే ఈ మధ్య ఖాళీ దొరికినపుడు దీన్ని తిసుకున్నాను.ఇది 1996 లో సిగ్నెట్ కంపెనీ వాళ్ళు వేసిన పేపర్ బ్యాక్. దీన్ లో ముందుగా ఆకర్షించినది ఈ పుస్తకం యొక్క 25 వ ఎడిషన్ కి  Ayn Rand రాసిన ముందు మాటలు,ఎప్పటివి 1968 లో రాసినవి.అసలు మొదట ముద్రితమయింది  మరి 1943 లో గదా. ఎంత కాలం గడిచింది..మరి ఇంకా ఇది జనాల్లో   నానుతూనే ఉంది గదా.సరే ముందుగా Ayn Rand ..ఆవిడ ఈ నవల రాయడానికి గల కారణాలు,అప్పటి అనుభవాలు ఇవన్నీ కొన్ని పేజీల్లో రాసి పెట్టింది.ముందు ఇక్కడ నుంచి బయలు దేరుదామని మొదలు పెట్టా,వాటిని సాధ్యమైనంతగా సంక్షిప్తంగా ఇక్కడ ఉంచుతాను.

" ఇరవై అయిదు ఏళ్ళు అయింది గదా The Fountainhead  రాసి,మీ ఫీలింగ్ ఏమిటి అని..? (సరే..ఇప్పటికి డబ్భై మూడేళ్ళు అయిందనుకోండి) కొంత మంది నన్ను అడుగుతుంటారు.ప్రత్య్యేకించి చెప్పడానికి ఏమి లేదు,సంతృప్తి కరం గానే ఉంది.రచన చేయడం లోని ఉద్దేశ్యం ని నా దృష్టి లో Victor Hugo బాగా చెప్పాడు," ఒక రచయిత తన కాలం కొరకు మాత్రమే రాయాలి అని ఎవరైన  అంటే,నేనైతే నా పెన్ను ని విరగ్గొట్టి అవతల పారేస్తా" అని..!

ఒక నెల నో ,ఏడాది నో నిలిచి వడిలి పోయే రచన చేయడం ఈ రోజుల్లో కనిపించే ఒక దీన విషయం.మన వర్తమానం లోని ముఖ్య విషయాన్ని రచన ప్రతిబింబించాలి,దానికి కొద్దిగా ఓ విషయాన్ని చేరుస్తాను.ప్రతి కాలం లోనూ అలాంటి పని జరుగుతూనే ఉన్నది.ఈ The Fountainhead నవల రాసే సమయం లో ఇంత కాలం నిలుస్తుందని ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదు.అయితే ఒకటి ఇది ఎప్పటికి నిలిచిపోతే బాగుండును అనిపించింది.పన్నెండు మంది పబ్లిషర్లు దీన్ని తిప్పి కొట్టారు.మరీ ఇంటలెక్చువల్ గాను,కాంట్రవర్సీ గాను ఉంది,దీన్ని చదివే వాళ్ళు ఎవరుంటారు అని కొందరు ప్రశ్నించారు.

అయితే ఇక్కడ ఒక మనిషి గూర్చి చెప్పితీరాలి.అతని పేరు Frank O'Connor.నా భర్త.1930 ల్లో నేను రాసిన ఓ డ్రామా లో కొన్ని లైన్లు ఇలా ఉంటాయి,ఎంత గొప్ప విజన్ తో కూడిన పని చేసే వారికైనా ఒక Fuel వంటి వ్యక్తి వెనుక ఉండాలి లేదా ఆ అగ్ని చల్లారి పోతుంది.అదిగో అలాంటి Fuel లాంటి వాడే ఈ మనిషి. ఈ నవలని ఎన్నో ఏళ్ళు నిరాశ ల మధ్య ,శ్రమల మధ్య పూర్తి చేశాను,ఒక దశ లో ఆపేద్దామని కూడా అనుకున్నాను.అతను నాతో అన్న కొన్ని వాక్యాల్ని కూడా నేను ఈ నవల్లో సందర్భానుసారంగా చేర్చాను.ప్రపంచం లో మనం చేసే పనులు వ్యతిరేకత ఎదురైనా ఎందుకని ఆపకూడదు అనేదాని మీద,మిగతా వాటి మీద అతను నాతో గంటల కొద్దీ సంభాషించేవాడు.సాధారణంగా నేను రాసిన వాటిని ఎవరికీ అంకితమివ్వను,కాని ఈ నవల్ని  మాత్రం Frank కి అంకితమిచ్చాను,ఎందుకంటే దీన్ని బతికించింది అతనే.

ఈ పాతికేళ్ళ లో మీ భావాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని కొంతమంది అడుగుతుంటారు.లేదు అనే చెపుతాను.అయితే జ్ఞానం లోను,దాన్ని అప్లయ్ చేసే విధానం లోను పరిణితి వచ్చింది.మూల భావం ఏమీ మారలేదు అని అంటాను.అప్పుడున్నంత గర్వం గానే ఇప్పుడూ ఉన్నాను.

ఈ నవల రాయడం వెనుక మీ ఉద్దేశ్యం ఏమిటి..అంటే నా ఫిలాసఫీ ని ప్రచారం చేయాలని కాదు అంటాను.The portrayal of a moral ideal,as my ultimate literary goal,as an end itself .....to which any didactic,intellectual or philosophical values contained in a novel are only the means.My purpose is not the philosophical enlightenment of my readers..  నా మొదటి లక్ష్యం ఒకటే Howard Roark ని చక్కగా చిత్రించడం.కధ లో ఎప్పుడైనా నేను చూసేది ఒకటే నిజ జీవితం లో ఇలాంటి పాత్ర ఉంటుందా,నిజ జీవిత అనుభవాలకు ఇది సరిపోతుందా అని.మనిషి చుట్టూ ఉండే వాతావరణం మనిషి ని తీర్చి దిద్దుతుంది.పనుల పట్ల ఉన్మిఖీకరణ చేస్దుంది.నా పాత్ర Ideal గా ఉండాలి,అదే సమయం లో చుట్టూ ఉన్న Social system ని సంభాళించుకు వచ్చే విధంగా ఉండాలి.నేల విడిచి సాము లా ఉండరాదు.హేతు బద్ధంగా ఉండాలి."
" ఇప్పుడు గనక ఈ నవల ని రాస్తే దాని లో ఏమైనా మార్చాలని అనిపిస్తుందా అంటే అటువంటిది ఏమీ చేయను గాని ఒక చిన్న పొరబాటు దాని లో దొర్లింది.దాన్ని మాత్రం సరిదిద్దుతాను.Howard Roark కోర్ట్  సీన్ లో మాట్లాడేప్పుడు డైలాగ్ అది.egoist అనే పదానికి బదులు egotist అనే పదం ని వాడాను,నిజం చెప్పాలంటే రెండవ పదమే అక్కడ సరిపోతుంది..!సరే అది పెద్ద గా పట్టించుకున్నట్లుగా లేదెవరు...!ఆ..ఇంకో వాక్యం కూడా..!From this simplest necessity to the highest religious abstraction ,from the wheel to the skyscrapper ,everything we are and everything we have comes from a single attribute of man- the function of his reasoning mind అని Roark చెప్పే మాట కూడా నేను Religious ideas ని ఎండార్స్ చేస్తున్నట్లుగా ధ్వనించిందేమో అని నాకు ఓ అనుమానం.కాని నా ఉద్దేశ్యం వేరే..అలా చిన్న చిన్న వి ఉన్నాయి.

నా ఉద్దేశ్యం Religious abstractions అనేవి కూడా మనిషి మెదడు తో ఆలోచిస్తేనే వచ్చాయి తప్ప అద్భుతం జరిగి ఎక్కడినుంచో రాలేదు అని..!అనేక శతాబ్దాలనుంచి తన యొక్క  ethics ద్వారా మనిషి కి సంబందించిన అన్ని విలువలని Religion మొనోపలైజ్ చేస్తున్నది.కొన్ని మాటల్ని చాలా జాగ్రత్త గా దీని లో అర్ధం చేసుకోవాలి.Hopton Stoddard అనే పాత్ర Roark తో ఇలా అంటుంది ఓ చోట.

" You 're a profoundly religious man ,Mr.Roark- in your own way. I can see THAT IN YOUR BUILDINGS"

" That's true"  అంటాడు Roark.

ఈ సందర్భం లో అక్కడ చెప్పబడినది Roark యొక్క అంకిత భావం ,నమ్మిన విలువల గురించి తప్ప మతపరంగా కాదు అని అర్ధం చేసుకోవాలి.జీవితం  లోని emotional meaning ని ఇంకా Connotations ని ,హేతుబద్ధ వైఖరిని వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఆ చోటకి Religion చొరబడి తనవైన ఎథిక్స్ ని ప్రయోగిస్తుంది.ఒక అత్యున్నత గౌరవం ఇవ్వాలని అనుకుంటే ఆ సుపీరియారిటి ఆ "పవిత్రుని" కే ఉంది తప్ప మనిషి కి ఎంతమాత్రం లేదు అని చెబుతుంది.మనిషి లోని emotional realm అది ఎంత గొప్పదైనా దానికి విలువే లేదా..!కాబట్టి sense of life is dramatized ..అదే ఈ నవల్లో జరిగింది...Man Worship
ఇంకో మాట లో చెప్పాలంటే...!

ప్రతి మనిషి లోను అది జరుగుతుంది.ఒక్కోసారి అంత తొందరగానూ ఆరిపోతుంది .కొంత మంది లో ఆ అగ్ని కాలం గడుస్తున్న కొద్దీ అణగారిపోతుంది.ఇదనే కాదు Collectivism ..అది కమ్మ్యూనిజం కాని ఫాసిజం కాని నాజీజం కాని అవి కూడా ఒక మతం స్థాయి ని సంతరించుకున్నాయి.అక్కడ ఆ కేంద్రం లో God కి బదులు Society ఉంటుంది అంతే తేడా..!ఒకచోట దేవుని కోసం  మనిషి ని త్యజించమంటే మరో చోటనేమో సొసైటీ కోసం త్యజించమంటారు.రెంటికి పెద్ద తేడా ఏముంది..!ఆరాధించదగిన మనిషిలోని గొప్పతనాన్ని  ఆరాదించరు,అలాంటి వ్యక్తి ఒక్కరు కూడా కనబడరా ...కాదు అలా అలవాటు పడిపోయారు..!నా దృష్టి లో మనిషి లోని Highest potentialiity ని దాని ద్వారా ఒక గొప్పదనం కోసం  కృషి చేసే వారిని Man worshippers గా భావిస్తాను.ఈ తరగతి కి చెందని వారు Man haters..! ఈ భూమి మీద మనుషుల్లో చాలామంది ఈ రెండు భావజాలాల మధ్య Struggle చేస్తుంటారు.అసలు ఈ నవలకి పై భాగం లో ఒక కొటేషన్ పెడదామనుకున్నాను.అయితే ఆ ఐడియాని మళ్ళీ ఉపసమ్హరించుకున్నాను.అది ఎవరిదంటే Friedrich Nietzsche ఒకసారి చెప్పిన మాట.ప్రధానంగా అతను  బైరన్ కి ఉన్న ఆలోచనలకి దగ్గరగా ఉంటాడు. అంతేకాక అతని భావాల్లో హింస,బలప్రయోగం వంటి evils కూడా తప్పు కావు,లేని పోనిది ఇది మరో రకంగా అర్ధం చేసుకునే ప్రమాదముందని దాన్ని పెట్టడం మానేశాను.

మనిషి జీవితం లో యవ్వనం ఎంత ప్రాముఖ్యమైనది.ఎన్నో గొప్ప కార్యాలను చేసే అవకాశం ఉంటుంది.కాని ఇప్పుడు ఏమి కనిపిస్తున్నది..మొదలు పెట్టడమే జీవితాన్ని నొప్పి తో,నిరాశ తో,వ్యక్తం చేయడానికి వీలుకాని బాధ తో మనిషి మొదలుపెడుతున్నాడు.నిజానికి ఇది మనిషి ప్రకృతి లో లేనిది.కొంతమంది ముందుకు వెళతారు,కొంతమంది అమ్ముడు పోతారు.కొంతమంది లో ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోతుందో వారికే తెలియదు. ఎవరు చెప్పారు వీరికి..తాము నమ్మిన  విలువల్ని వదులు కోవడం,కార్యాచరణని వదులుకోవడం,ఆత్మ గౌరవం ని వదులుకోవడం అదే పరిణితి అని..! Yet a few hold on and move on,knowing that the fire is not to be betrayed ,learning how to give it up shape ,purpose and reality.But whatever their future ,at the dawn of their lives,men seek a noble vision of man's nature and life's potential.There are very few guideposts to find.THE FOUNTAINHEAD is one of them..!

 ప్రతి జనరేషన్ లో ఏ కొంత మంది దీనిని అర్ధం చేసుకున్నా చాలు.మనిషి యొక్క విరాట్ స్వరూపాన్ని అర్ధం చేసుకున్న వారు ఆ కొద్దిమంది ప్రపంచాన్ని కదిలించగలరు. ఆ కొద్ది మంది కోసమే ఇది..మిగతా వారితో నాకు పని లేదు.
 -Murthy Kvvs 










"తల్లి భూదేవి" నవల చింగిజ్ ఐత్మతొవ్ యొక్క మరియొక బంగారు తునక

గతం లో గుర్తుండి ఉంటుంది.చింగిజ్ ఐత్మతోవ్ రాసిన జమీల్య ఇంకా తొలి ఉపాధ్యాయుడు గురుంచి రాసి ఉన్నాను.ఇప్పుడు ఇంకొక నవల "తల్లి భూదేవి"  గురుంచి చెప్పుకుందాము.ఈ చింగీజ్ ఎక్కడ పుట్టింది...కాని ఇక్కడ చదువుతుంటే హృదయం రసప్లవీతమవుతుంది.కన్నీరు కార్చకుండా ముగించలేము అతని రచనని..అదీ అనువాదం లో..మళ్ళీ ఇంగ్లీష్ ని మధ్య లో దాటుకుంటూ వచ్చి.అసలు ఆ ఒరిజినల్ లో ఎంత గాఢత ని పెట్టావయ్యా మహానుభావా అనిపించింది.తనని తాను ఆ మాటల్లో సంపూర్తి గా నింపుకోకపొయినట్లయితే అది సాధ్యమా..? రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో వచ్చిన నవల ఇది.ఒక కుగ్రామం లో ఒక కుటుంబం.అక్కడి  నుంచి ముగ్గురు కొడుకులు ,భర్త తప్పనిసరై యుద్ధ రంగం లోకి వెళ్ళడం ..వాళ్ళు చనిపోవడం..ఇంట్లో ..చివరకి ..అత్త ,కోడలే మిగలడం..వారి బాధలు...ఇంకా ఆ గ్రామం లో ..అలాంటి వారే ఇంకొందరు..అదీ స్థూలంగా కధ.కాని పేజి లో ఏదీ వృధాగా చెప్పినట్టుగా ఉండదు.అలాగే వాస్తవానికి దూరం గాను ఉండదు.

ఈ తెలుగు నవల చదివేప్పుడు ఆసక్తి కలిగి ఇంగ్లీష్ ప్రతిని కూడా పక్క నే పెట్టుకుని చదివాను.నిజంగా ఉప్పల లక్షమణ రావు గారికి జోహార్లు అర్పించాను.అంత రమ్యంగా,అర్ధవంతంగా అనువదించారు.అనువాదకుడు అంటే ఏదో మక్కీ కి మక్కీ అనువదించడం కాదు, ఆ సమాజం గూర్చిన లోపలి పొరల్ని అర్ధం చేసుకుని ఉండాలి,అప్పుడే అది పండుతుంది. తొల్గొనాయ్  అనే ముసలామె పొలం దగ్గరకి వచ్చి గడిచిపొయిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది.. ఆ భూమి కూడా జవాబిస్తూ ఉంటుంది.ఎలా తను తన భర్తని కలిసింది..ఆ పొలం లో పని చేస్తూ గడిపింది..ముగ్గురు కుమారులని కనడం...వారి తో జీవితం ..తరువాత యుద్ధానికి పిలుపు రావడం ..వెళ్ళడం..వారు మరణించడం..కోడలు ఇంకొక వ్యక్తి ద్వారా గర్భవతి కావడం..ఆమె చనిపోవడం..మనవడు బ్రతకడం...వాడికి ఈ కధ అంతా చెబుదామా లేదా అని తటపటాయించడం ...ఇలా కధ సాగి పోతుంది.

చింగీజ్ నవలలు అన్నీ ఒక మోస్తరు పెద్ద కధలు వంటివి.ఇది అలాంటిదే.చింగీజ్ ఐత్మతోవ్ చెప్పే విధానం కడు రమ్యమైనది నాకు తెలిసినంత లో ..గుండె మీద దెబ్బ మీద దెబ్బ వేస్తూ ముందుకు సాగే ఆ శైలి ని ఎంత అనుకరించాలన్నా అది కుదరని పని.ఎందుకంటే అది గంగోత్రి నుంచి గంగ ఎలా ప్రవహిస్తుందో అంత సహజంగా,సాధికారికంగా ప్రవహిస్తుంది.సంభాషణలు చెప్పే విధానం లో ..ఎంత సహజత్వం..వర్ణన కోసం వర్ణించినట్లుగా ఉండదు. ఆ పర్వతాలు..ఆ గడ్డి మైదానాలు..రకరకాల కాలాలలో ..ఆ మధ్య ఆసియా లోని పల్లెల శోభలు...నిజంగా అక్కడికి వెళ్ళిపొయిన అనుభూతి కలుగుతుంది.కూసే భరద్వాజ పక్షిని ని సైతం ఒక పాత్రని చేయడం..!నిజంగ కోడలిని అంతగా ప్రేమించే  అత్తగా ఎవరైనా ఉంటారా అనిపిస్తుంది.యుద్ధం లో కుమారుడు ఖాసిం మరణిస్తాడు,అది విని కోడలు దిగాలు చెందడం, నీవైనా మళ్ళీ పెళ్ళాడి  సుఖంగా బ్రతుకు అని అత్త కోరుకోవడం, ఓ గొర్రెల కాపరి వల్ల గర్భవతి కావడం,తను మొహం చాటేయడం..పిల్లాణ్ణి కంటూ ఆ అమ్మాయి అలినాయ్ మరణించడం..పుట్టిన ఆ మనవడి తో కాలం గడుపుతూ ...పొయే లోపు ..అతని జన్మ రహస్యం చెప్పాలా ..లేదా అని యోచిస్తూండడం..అలా ముగుస్తుంది కధ.

ఈ కధ లో రచయిత రెండవ ప్రపంచ యుద్ధాన్ని ,దాని వల్ల రష్యా లో కలిగిన పరిణామాల్ని ,త్యాగాల్ని ,సమిష్టి వ్యవసాయ  క్షేత్రాల్లో స్త్రీలు సైతం కష్టించి యుద్ధ రంగానికి ఎలా తిండి గింజలు పంపారు...ఎలాంటి బాధల్ని ఎదుర్కున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు.అనుబంధాలు అనే మాటకి అర్ధం ఈ నవల లో అర్ధం తెలుసుకోవచ్చును..!అంత హాయిగా చద్వుకోవచ్చును..ఎక్కడా పిసరంత బోరు కొట్టదు.

"నిజంగా ఈ రోజు నడిచి వచ్చిన దారి నా జీవితం లో అత్యంత కఠినమైన దారి..."  బహుశా ఇలాంటి   మాట ఆ బాష లో  ని ఒక వ్యక్త పదబంధమనుకుంటాను, ఇదే తొలి ఉపాధ్యాయుడు లో కూడా తారస పడుతుంది.ఇంగ్లీష్ లో ఇలా ఉంది " THE ROAD I TRAVELLED THAT MORNING WAS THE HARDEST ROAD OF MY LIFE" .

గ్రామం నుంచి ఆ రాత్రి పూట అలిమోన్(కోడలు)  ని  ఆసుపత్రికి పక్క ఊరికి తీసుకు వెళుతుండగా మధ్యలో ఆమె ఆ బండి లోనే మరణిస్తుంది.శిశువు పుడతాడు.ఆమె (అత్త) ఇలా రోదిస్తుంది. How unfortunate you are..Your very first cry was your farewell to your mother....!Then ,from some far away place came the thought : " But life has not died off completely,a little shoot has been left." Then another thought replaced it:" How can he ever survive if he hasn't even tasted his mother's milk? No,he won't last long." .......!!!!!



ఇలంటి యూరోపియన్ క్లాసిక్స్ ని ఆంగ్లం అనే మాధ్యమం లో చదవగలిగినందుకు ఆనందమనిపించింది.అలాగే ఉప్పల లక్ష్మణ రావు గారికి తెలుగు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. Murthy KVVS





The Sicilian గురిచి రెండు ముక్కలు..!

ఈ రోజు ఎందుకనో చెగువేరా ఫోటోస్ ఫేస్బుక్ లో చూసిన తర్వాత ఇది రాయాలనిపించింది.ఎప్పటినుంచో అనుకున్నా కుదరలేదు.అది మరో సంగతి.Che యొక్క జీవితానికి Mario Puzo రాసిన మరో క్లాసిక్ Sicilian లోని హీరోకి దగ్గర పోలికలున్నట్లు అంపిస్తాయి.అతని పేరు Guiliano.సిసిలీ లో జన్మించి బందిపోటు గా మారి పేదవారి పాలిట రాబిన్ హుడ్ గా ప్రసిద్ది చెందిన ఒక యువకుని కధ అది.ఆ నవల్లో హీరో కి విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది.చరిత్ర,తత్వ శాస్త్రం ,కవిత్వం ..ఒకటేమిటి అన్నీ చదువుతుంటాడు.గాడ్ ఫాదర్ లాంటి ప్రొఫెసర్ ఒకతను ఉంటాడు.అతని పేరు Hector Adonis.గుట్టల్లోకి వెళ్ళి మరీ అతనికి పుస్తకాలు ఇచ్చి వస్తుంటాడు.హీరోకి ఒక మంచి మిత్రుడు ఉంటాడు(Aspanu Pisciotta).అసలు చివరిదాకా అతన్ని కేరక్టర్ ని అంచనా వేయలేము.విచిత్రంగా హీరో చావుకి అతను కారణమవుతాడు.అనేకసార్లు హీరోని ఎంతగానో కాపాడతాడు.చాలా చిన్న కారణం..హీరోకి పెరిగే పాపులారిటి కి అసూయ చెంది శత్రువుల కి ఉప్పందించి అతని చావుకి కారణమవుతాడు.Guiliano పాత్ర యావత్తు ఎందుకనో చే కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.విచిత్రంగా చే కూడా బాగా నమ్మిన ఒక వ్యక్తికారణంగానే శత్రువుకి చిక్కి చంపబడతాడు.ఈ హీరోకి మల్లేనే చే కి కూడా విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు.చే లాగానే అతనూ యవ్వన ప్రాయం లోనే చంపబడతాడు.అదనే కాదు ఇంకా చాలా విషయాలు కలుస్తాయి.Mario Puzo సిసిలీ లో జన్మించిన ఆ రాబిన్ హుడ్ ని అడ్డుపెట్టి ఇది రాశాడా అనిపిస్తుంది.

Michael Corleone సిసిలీ కి ప్రవాసం వెళతాడు గదా.. ఆ రెండు హత్యలు చేసిన తర్వాత.మన ఈ గాడ్ ఫాదర్ లోని కేరక్టర్ మళ్ళీ సిసిలియన్ నవల లో కూడా ప్రస్తావింపబడతాడు.ఆ హీరో Guiliano ని తనతో పాటు అమెరికా తీసుకువెళ్ళాలని ఒప్పందం కూడా కుదురుతుంది.అయితే అతను నమ్మిన మిత్రుడే వంచన చేస్తాడు.దానితో ఒక్కడే Michael అమెరికా కి తిరిగి వచ్చేస్తాడు.అయితే సిసిలియన్ నవల లోని  పాత్రలు ఏవీ గాడ్ ఫాదర్ లో కనిపించవు.అందుకనే సిసిలియన్ నవలని చదివిన వాళ్ళుMichael పాత్ర ని చూసి గాడ్ ఫాదర్ కి సీక్వెల్ అనుకుంటారు. కాని కాదు.ఒక గమ్మత్తు కోసం అలా స్టోరిని కలుపుతాడంతే.ఇదనే కాదు The Last Don చదివిన వాళ్ళు కూడా గాడ్ ఫాదర్ కి సీక్వెల్ అనుకుంటారు.కాని కాదు.కాకపోతే Don Corleone పాత్ర ఇంకొన్ని పాత్రలు గాడ్ ఫాదర్ లో నుంచి దీనిలోకి వచ్చి ఉంటాయి.ఒక అంతస్సూత్రం చేత Mario Puzo వాటినన్నిటిని అలా గుదిగుచ్చాడు.ఇది ఇలా ఉండగా ఇంకొంతమది మహానుభావులు గాడ్ ఫాదర్ కి వచ్చిన పాపులారిటిని చూసి తమ స్వంత ఆలోచనల్ని ఆ పాత్రలకి ఆపాదించి రాసేశారు.అదో గందరగోళం.అందుకనే చాలామంది గాడ్ ఫాదర్ సినిమా కి మల్లే గాడ్ ఫాదర్ నవల కూడా రెండుమూడు భాగాలుగా ఉంది అని చెప్పి అనుకొంటుంటారు.




సిడ్నీ షెల్డన్ రాసిన The other side of midnight నవల్లోంచి ఇంకొన్ని సన్నివేశాలు



గతంలో కొన్ని విషయాలు చర్చించుకున్నాము గదా.ప్రధాన పాత్ర Noelle Page ..ఆమె ఫ్రాన్స్ లోని స్వప్రదేశం మార్సైల్స్ నుంచి మోడల్ గా రాణించడానికి పారిస్ రావడం..అక్కడ విశాల అనుభవాలు పొందడమూ అవన్నీ..!పారిస్ నగరం ..దాని రాజసము,సౌందర్యం చూసిన ఆమెకు అనిపిస్తుంది తన వంటి తెలివైన ,అందమైన వ్యక్తులు నివసించవలసిన అసలైన ప్రదేశం అదేనని.ఏది ఏమైనా ఇక్కడనే తాను తన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకోవాలని నిశ్చయించుకుంటుంది.దాని కొరకు ఆమె ఒక ప్రణాళిక ప్రకారం వివిధ వ్యక్తులతో పరిచయం పెంచుకుంటుంది.అయితే Larry Douglas అనే ఒక అమెరికన్ పైలట్ తో ఆమె ఉన్నప్పుడు అతడిని ఎంతో ప్రేమిస్తుంది..అయితే రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ సమయం లో అతను చెప్పపెట్టకుండా వెళ్ళిపోవలసివస్తుంది.ఆ విధంగా ఆమె అతని పై కక్ష పెంచుకుంటుంది..అతని వల్ల కలగబోయే బిడ్డని అబార్షన్ ద్వారా తొలగించుకుంటుంది.అప్పుడు ఆమెకి కలిగిన అనారోగ్య సమస్యల నుంచి Israel Katz అనే డాక్టర్ బయటపడవేసి ఆమె కి ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు.దానితో ఆమె మళ్ళీ కొత్త మనిషి అవుతుంది.ఈ రెండు పాత్రల మధ్య ఉండే బాంధవ్యం గమ్మత్తుగా ఉంటుంది.జర్మన్లు పారిస్ ని ఆక్రమించి యూదుల బ్రతుకుల్ని దుర్భరం చేసినప్పుడు ఆమె యూదుడైన ఈ డాక్టర్ ని రక్షించడానికి అతడిని పారిస్ నగరం దాటించడానికి జర్మన్ సైన్యాధికారితో సంబంధం పెట్టుకుంటుంది.ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని,ధనాన్ని సంపాదిస్తుంది.అయినప్పటికి Israel Katz చేసిన సాయాన్ని మర్చిపోకుండా సహాయం చేస్తుంది.విచిత్రంగా వీరిరువురి నడుమ ఎలాంటి సెక్స్ సంబంధం కూడా ఉండదు.కాని తాను సంబంధం పెట్టుకున్న పురుషులందరి కంటే ఆమె ఇతడిని ఎక్కువగా అభిమానిస్తుంది.

నవలంతా రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయల్లో జరుగుతూ మిలిటరీ మనుషులకి,మామూలు సివిలియన్లకి ఉండే తేడాని చూపుతూంటుంది.జర్మన్ సైనికాధికారులలోని కళాదృష్టి కూడా అక్కడక్కడ మెరుస్తూంటుంది.కొన్ని  జోకులు గూడా గమ్మత్తుగా అనిపిస్తాయి.నోయెల్ జర్మన్ సైనికాధికారిని బ్రిటిష్ వారి గురించి అడిగినపుడు ఇలా అంటాడు" బ్రిటిష్ వాళ్ళని శాంతి యుతం గా ఉన్నప్పుడు భరించలేము..వాళ్ళకెప్పుడూ ఏదో పనిలో ఉండటమే ఇష్టం..ఒక బ్రిటిష్ నావికుడు ఎప్పుడు ఆనందం గా ఉంటాడో తెలుసా ..అతని ఓడ మునిగిపోతున్నప్పుడు మాత్రమే"





Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.


Other side of the midnight డబ్భైవ దశకం లో సిడ్నీ షెల్డన్ రాసిన ఒక మంచి థ్రిల్లర్.ఏమీ తోచనప్పుడల్లా అలా చదివిన వాటినే తిరగేస్తుంటా...దాని వల్ల రెండు లాభాలు.ఒకటి మనకి కాలం తో పెరిగిన తెలివిడి వల్ల కొత్త కోణం లో కొన్ని విషయాలు అగుపిస్తాయి.మరొకటి కాలక్షేపం..టివి ని పెద్దగా చూడను కాబట్టి ..!

ఆ విధంగా తిరగేస్తున్నప్పుడు ఆ నవల్లోని ఇద్దరు ప్రధాన పాత్రలు Noelle Page,Catherine Alexander లు మళ్ళీ చాలా ఆలోచనలు పుట్టించారు నాలో..!ఇదొక ముక్కోణ ప్రేమ కధ ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యం లో జరిగే ఒక రివెంజ్ స్టోరీ కూడా..!ఆ ఇద్దరివి చాలా స్ట్రాంగ్ కేరక్టర్స్.Noelle Page ది ఇంకానూ ...ఫ్రాన్స్ లోని మర్సైల్స్ లో జన్మించిన ఆమె కి మోడల్ అయి ,బాగా సంపాదించి ప్రపంచం లో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది.

దీనికి బీజం ఆమె తండ్రి నుంచి పడుతుంది.బాగా అందం గా ఉండి అందర్నీ ఆకర్షణ కి గురి చేసే ఆమె ని Auguste  అనే ధనికుడైన వ్యాపారస్తునికి తార్చుతాడతను.ఆమె ఒక కుర్రవాణ్ణి ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న తండ్రి అంటాడు...నీ అందం తో నీకు గల ఆకర్షణలతో ఇంకా పైకి ఎదగాలి అని.అట్లా ఈ Auguste తో శయనిస్తుందామె.. అప్పుడామె తెలుసుకుంటుంది పురుషుడు ధనము,పశుబలం ద్వారా లోకాన్ని వశపరుచుకుంటే  పురుషుని రంజింప జేయడం వల్ల స్త్రీ లోకాన్నే శాసించగలదు అని చెప్పి.ఇహ అప్పటినుంచి పురుషుని శరీరానికి ఎన్ని రకాలైన హాయిలని కలిగించవచ్చునో ప్రాక్టికల్ గా నేర్చుకుంటుంది.అలా ఆమె ఇంటి నుంచి కూడా పారి పోయి పారిస్ కి చేరుతుంది.చిన్న మోసాలకి గురయినా పెద్ద ఆపదలకి ఏమీ గురవదు గాని వాటిల్ నుంచి నేర్చుకుంటుంది.ఆమె కి సహాయపడగలరు అనుకున్న అయిదుగురు కి పడక సుఖం అందించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.అలా టాప్ మోడల్ గా ,నటి గా రాణిస్తుంది.అవతల వాళ్ళకి గాని,ఇవతల వాళ్ళకి గాని ఇదంతా ఓ బిజినెస్ డీల్ లా జరుగుతుంది తప్ప ఒక పాప కార్యం లానో ఇంకో ఫీలింగ్ తోనో జరగపోవడం లోనే జీవితాన్ని చూసే విధానం లో ఒక్కో దేశానికి ఎంత తేడా ఉంది అనిపిస్తుంది.Israel Katz అని ఒక డాక్టర్ ఉంటాడు ..అతను ఫ్రాన్స్ లో ఉండే ఒక యూదు జాతీయుడు.Noelle కి ఒక పైలట్  ద్వారా గర్భం వచ్చినప్పుడు ఆమె కి చికిత్స పరంగా చాలా సహాయం చేస్తాడతను. ఉద్యోగం కూడా ఇప్పిస్తాడు.మళ్ళీ కొన్ని ఏళ్ళు పోయినాక ఆమె ని మంచి నటి గా కుదురుకున్న సందర్భం లో అతను కలుస్తాడు.అప్పటికే హిట్లర్ సైన్యాలు ఫ్రాన్స్ ని ఆక్రమించి ఉంటాయి.యూదులంటే మండిపడే నాజీ ల హయాం లో ఆ డాక్టర్ తన ఉనికిని కోల్పోయి ఒక కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు.అప్పుడు మనసు చివుక్కుమంటుంది.చాలా ఆలోచనలు ముసురుకున్నాయి.అసలు హిట్లర్ కి ఈ యూదులంటే ఎందుకంత ద్వేషం ..ఏదో బలమైన కారణాలే ఉండాలి...లేకుంటే ఎక్కడ అడుగుపెడితే అక్కడ పోలాండ్ ,ఆస్ట్రియా ,రష్యా,ఫ్రాన్స్ ఇంకా జర్మనీ లోను 60 లక్షల మంది యూదులను కుక్కల్ని చంపినట్లు చంపి పారేశాడు. ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్ద గా ఉంది..ఆ జోలికి పోవడం లేదు.అలనాటి జీసస్,మోసెస్ ల దగ్గర్నుంచి ఈనాటి అల్బ్బర్ట్ ఐన్స్టీన్,సిగ్మండ్ ఫ్రాయిడ్ ,లెనిన్,మార్క్స్,ఇసాక్ అసిమోవ్,స్పీల్ బెర్గ్ ,మర్డోచ్ దాకా ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన ఆ జాతి పై అతనికి ఎందుకు అంత ద్వేషం అని చాలాసేపు యోచించా..!గూగూల్ లో కి కూడా వెళ్ళి సెర్చ్ చేశా....ఏవేవో డొంక తిరుకుడు సమాచారం బోల్డంత ఉంది గాని నాకైతే సంథృప్తి కలగలేదు. సరే ఇంకో కేరక్టర్ గురించి మరోసారి చెప్పుకుందాము.Click here






సిడ్నీ షెల్డన్ "The Sands of Time" నవల నుంచి గుర్తుకొచ్చిన కొన్ని విషయాలు 



స్పెయిన్ లో జరిగిన అంతర్యుద్ధం (Spanish Inquisition)గురించి మనం ఎక్కడో ఓ చోట చదివే ఉంటాము.దాన్ని ఆలంబన గా చేసుకొని సిడ్నీ షెల్డన్ ఒక మంచి రసవత్తరమైన నవల రాశాడు.అదే The sands of time.ప్రారంభం గమ్మత్తుగా మొదలవుతుంది.Pamplona అనే స్పానిష్ పట్టణం నుంచి కధ మొదలవుతుంది.హీరో పేరు Jaime Miro. బాస్క్ జాతీయుల తరపున స్పానిష్ ప్రభుత్వం పై  పోరాడే విప్లవ యోధుడు.ఆ పట్టణం లో జరిగే Bull fights గురించి బాగా వర్ణిస్తాడు.రకరకాల దేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊరిలో ..మన తిరునాళ్ళ లో మాదిరిగా కాలక్షేపం చేయడం ..ఆ సంఘటన ని ఉపయోగించుకొని జైల్లో ఉన్న అనుచరులను హీరో విడిపించడం జరుగుతుంది.ఎద్దులు ఉరికే సన్నివేశాన్ని ..ఆ సన్నటి వీధుల్లో ఔత్సాహికులు  పరుగెట్టే విధానాన్ని చాలా భీభత్సంగా వర్ణిస్తాడు రచయిత. మన కోళ్ళ పందేలు,ఎద్దుల పందేలు హింస ని ప్రేరేపిస్తాయని  అంతర్జాతీయ సంఘాలు ఓ గోల పెడుతుంటాయి గాని ఈ దేశం లోని బుల్ ఫైట్స్ మరి అలా సాగిపోతూనే ఉంటాయి.ఇట్లాంటి విషయాల్లో వారి తత్వమే వేరు.ఒక తాత,మనవడు ఆ వీధిలో వెళుతూ ఉండగా బుల్ ఫైట్  గూర్చి వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి.

" Look at them!" the old man exclaimed 'Magnifico'

The little boy shuddered ."Temgo miedo,Abuelo.I am afraid"

The old man put his arm around him."Si,Manuelo .It is frightening but wonderful too.I once ran with the bulls.There is nothing like it.You test yourself against death,and it makes you feel like a man".

చిన్నప్పటినుంచి వారి యొక్క Virtues ని అలా అలవాటు చేసినప్పుడు ఎంత తేడా ఉంటుంది.మరి స్పెయిన్ జాతీయులు దక్షిణ అమెరికా లో Incas యొక్క సంస్కృత్ని నాశనం చేసి సగం మంది జనాభాని నాశనం చేశారంటే ఆశ్చర్యం ఏముంది.

ఈ నవల్లో నన్ లు గా మారిన వారి జీవన శైలి నవ్వు అదే సమయం లో ఆశ్చర్యమూ కలిగిస్తాయి.నిజానికి హీరో పాత్ర కంటే నన్ లు గా మారిన నలుగురు స్త్రీల పాత్రలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి కధలో. కొన్ని వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆ కాన్వెంట్ లో మన నలుగురు స్త్రీ పాత్రలు పూర్తిగా భక్తి చేత గాక వారికి ఎదురైన కొన్ని తప్పని సరి పరిస్థితుల వల్ల దానిలో చేరతారు.డబ్భై ఏళ్ళు పై బడిన రెవెరండ్ మదర్ బెనిటో దాని కి పెద్ద.ప్రతి రోజు ఆరుసార్లు ప్రార్ధన చేయాలి.దాని కారణాలు కూడా వేరు గా ఉంటాయి.ఏ ఒక్క నన్ ఇంకొక నన్ కళ్ళ లోకి చూడ్డం గాని ,మాట్లాడ్డం గాని చేయరాదు.ఒకరి గది లోకి ఒకరు వెళ్ళరాదు.మాట్లాడరాదు. పరమ నిశ్శబ్దాన్ని పాటించాలి.Lucia,Terasa,Graciela,Megan వీళ్ళు నలుగురూ ఒక్కో కారణం వల్ల ఇక్కడ చేరి కాలం గడుపుతుంటారు.


అలాంటి చోటికి ఒక రాత్రి కల్నల్ అకోక నాయకత్వం లో పోలీస్ బృందాలు రైడ్ చేస్తారు.కారణం ఇక్కడ బాస్క్ తీవ్రవాదులున్నారనే అనుమానంతో.దానితో వీళ్ళు నలుగురు పారిపోతారు.ఇక ఆతర్వాత ఒక్కొక్కరి వృత్తాంతం ఒక్కో సెపరేట్ చాప్టర్ గా చెప్పుకుంటూపోతాడు రచయిత. స్పానిష్ విప్లవ కాలం లోని సంగతులు బోరు కొట్టకుండా కధతో మమేకం చేసి చెపుతాడు..ఆ విధంగా కొంత చరిత్ర కూడా తెలుస్తుంది.ఎప్పుడైనా వీలైతే చదవండి...!Click here





సిడ్నీ షెల్డన్ మరో నవల Master of the Game గూర్చికొన్ని విషయాలు..!



థ్రిల్లర్స్ విషయం లో సిడ్నీ షెల్డన్ యొక్క ప్రత్యేకతే వేరు.గతం లో కొన్ని నవలలు పరిచయం చేశానుగదా..!ఈ సారి Master of the Game అని చెప్పి దాని గురించి చర్చించుకుందాము.ఈ నవల పూర్తయిన తరవాత అనిపించింది.అసలు సెంటిమెంట్ రాయాలన్నా కూడా ఘటికులే వీళ్ళు.అయితే వ్యక్తీకరణ రూపం లో తేడా అనిపిస్తుంది.అది నిజజీవిత వాతావరణానికి దగ్గరగా ఉంటుంది.సంపద కోసం చేసే పోరులో పడే కష్టం లో రాక్షసంగా పోతుంటారు.ఈ నవల దక్షిణాఫ్రికా భూమికగా జరుగుతూంటుంది.అక్కడ గల వజ్రాల గనుల్లోకి లోకి వచ్చి సంపన్నులుగా కావాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.18 శతాబ్దం తో కధ ఆరంభం అవుతుంది.

ఈ నవలని సిడ్నీ షెల్డన్ అతని సోదరునికి అంకితమిచ్చాడు.ముందు పేజీలో రెండే రెండు వాక్యాల్లో ఎంత పవర్ఫుల్ గా అంటాడొ ఆ మాటల్ని." For my brother,Richard-The lion hearted" ( సిమ్హ హృదయుడైన నా సోదరుడు రిచర్డ్ కోసం) ..!

ప్రొలోగ్,ఆంగ్ల నవల్లో ఇది ఓ షరా మామూలు.. 1982 లో సాగుతూంటుంది.Kate Blackwell తన తొంభైవ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటూ ఉంటుంది.ప్రపంచం లోని గొప్ప పారిశ్రామికవేత్తల లో ఆమె ఒకరు.స్కాటిష్,డచ్ తల్లి దండ్రుల సంతానం ఆమె.ఎంతోమంది ఆ వేడుకలో ఫాల్గొంటున్నప్పటికీ ఆమె అది పరికిస్తూ గత కాలపు జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఉంటుంది.అదిగో అలా స్వాతిముత్యం లో కమల్ హాసన్ మాదిరిగా తన గతం గూర్చి యోచిస్తూండగా ఇహ మన అసలు కధ 1883 నుంచి మొదలు అవుతుంది.అన్నట్లు ఆ వేడుక లో ఆమె ముని మనవడు ఎనిమిది ఏళ్ళ  రాబర్ట్ కూడా ఫాల్గొని పియానో కచేరి చేస్తాడు.ఆమె ఎంతో సంతోషించి తన వ్యాపార బాధ్యతల్ని అప్పగించేందుకు ఒక వారసుడు దొరికినందుకు ఆహ్లాదంగా ఫీలవుతుంది.

తన తండ్రి ఎన్ని కష్టాలు పడి ఈ క్రగర్ అండ్ బ్రెట్ కంపెనీ ని స్థాపించాడు.ఆయన పోయిన తరువాత తల్లి ఎలా నడిపించుకుంటూ వచ్చింది.ఆ వజ్రాల కంపెనీ ని తాను వివిధ రంగాల్లోకి ఎలా నడిపించి వివిధ దేశాల్లో విస్తరించింది..ఇదంతా చేసి ఏ సమర్ధత లేని అనామకుల చేతిలో ఈ సంస్థల్ని పెట్టదలచుకోలేదు.ఆమె కి కలిగిన ఇద్దరి కుమార్తెల్లో ఏ ఒక్కరికీ కట్టబెట్టలేకపోయింది.ఆ కధంతా ముందు వస్తుంది.

సరే....ప్రొలోగ్ నుంచి మొదటి చాప్టర్ లోకి వద్దాము.Jamie McGregar (1883-1906) స్కాట్ లాండ్ లోని ఒక చిన్న ఊరి లో ఉండే పద్దెనిమిది ఏళ్ళ యువకుడు.దక్షిణాఫ్రికా లోని వజ్రాల గనుల గూర్చి విని ,ఎలాగైనా అక్కడకి పోయి బాగా సంపాదించాలని ఆశించి తల్లి దండ్రుల్ని ఒప్పించి బయలుదేరుతాడు.అయితే అక్కడిదాకా ఓడలో వెళ్ళాలంటే సరిపడా డబ్బులుండవు.కేవలం 50 పౌండ్లు మాత్రం ఉంటాయి.ఎలాగా అని చెప్పి లండన్ కి దగ్గర్ లోని ఎడింబర్గ్ అనే టవున్ కి వెళతాడు.అక్కడ ఒక హోటల్ సప్లయర్ గా చేరి పని చేస్తూ మరో 50 పౌండ్లు కూడబెడతాడు.ఆ పిమ్మట లండన్ కి చేరుకుంటాడు.ఎందుకంటే ఓడలు అక్కడినుంచే బయల్దేరుతుంటాయి.ఒక మహా నగరాన్ని దాని శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు.వారానికి 10 షిల్లింగులు ఖర్చయ్యే ఓ చవకైన లాడ్జి లోదిగి డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ మొత్తానికి ఒక ఓడలో స్టీవార్డ్ గా పనిలోకి కుదురుతాడు.అలా కేప్ టవున్ కి చేరుకుంటాడు.దక్షిణాఫ్రికా లోని ఓ గ్రామానికి చేరుకుని KLIPDRIFT అనే ఏరియాలో ఉండటం మంచిదని నిర్ణయించుకుంటాడు.అదో చిన్న కేంప్ లాంటిది.అనేక జాతుల వాళ్ళతో,గుడారాలతో,చిన్న దుకాణాలు ఇట్లాంటి వాటితో నానా చికాగుగా ఉంటుందది.దానిమీదట విపరీతమైన దోమలు రాత్రి పూట.పారిశుధ్యం కూడా అంతంత మాత్రం.

అక్కడ ఓ డచ్ దుకాణదారుడు పరిచయం అయి వజ్రాల వేటలో సహకరిస్తానని చెప్పి తవ్వడానికి సరంజామాని ,అడివి లోకి వెళ్ళడానికి ఓ గాడిదని ఇస్తాడు.దొరికిన వజ్రాల్లో సగం సగం తీసుకుందామని కాంట్రాక్ట్ రాసుకుంటారు.ఈ డచ్ వ్యాపారి పేరు Soloman Van Der Merwe.కుక్క కష్టాలు పడి మొత్తానికి ఎలానో కొన్ని వజ్రాలు తవ్వి తీసుకురాగా ,ఈ డచ్ వ్యాపారి మోసం చేసి మొత్తం వజ్రాల్ని కొట్టేస్తాడు.అంతేగాక Jamie ని చంపించాలని చూస్తాడు.కొన ఊపిరి తో బయటబడిన అతనికి Banda అనే నల్లజాతి వ్యక్తి కలుస్తాడు.డచ్ వ్యాపారి చేతి లో ఇతనూ దెబ్బతిని ఉంటాడు.అతని కుటుంబం కూడా.అతను Jamie తో ఆ Soloman బ్యాక్ గ్రవుండ్ అంతా చెపుతాడు.ఇక్కడకొచ్చే వాళ్ళనంతా అతగాడు అలాగే మోసం చేస్తూ ఉంటాడని ,నిజానికి బాగా వజ్రాలు ఉన్న ప్రాంతాన్ని వాడు ఆక్రమించి అక్కడ ఓ ఫ్యాక్టరీ ని సైతం నడుపుతుంటాడని వెల్లడిస్తాడు.

అయితే ఇతగాడికి గుణపాఠం చెప్పకుండా వదలరాదని నిర్ణయించుకుంటాడు Jamie.చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ వజ్రాల గని వద్దకి పోయి ఇద్దరు బస్తాల కొద్దీ దొంగిలించుకు వచ్చేస్తారు.అక్కడ విపరీతమైన సెక్యూరిటి ఉంటుంది.అయినప్పటికి ఒక అర్ధరాత్రి పూట ఇద్దరు సెక్యూరిటి గార్డుల అజాగ్రత్త వీళ్ళిద్దరికి కలిసివస్తుంది.అందుకే గమ్మత్తుగా క్రగర్ అండ్ బ్రెంట్ అనే వాళ్ళ పేర్ల తోనే ఈ Jamie ఓ వజ్రాల కంపెని ని స్థాపిస్తాడు. ఆ తర్వాత క్రమ పద్ధతిలో డచ్ వ్యాపారిని చావుదెబ్బ తీస్తాడు.అదంతా చదువుతేనే ఆహ్లాదంగా ఉంటుంది.అతని కుమార్తె మార్గరెట్ ద్వారా ఒక మగబిడ్డ కి తండ్రి అవుతాడు.అయితే వీళ్ళిద్దర్నీ ఇంట్లో ఎలాగో ఉంచుకున్నా మామ కి తగిన పరిహారం చేయాలనే ఉద్దేశ్యం తో భార్యని ఒక పనిమనిషి గా ట్రీట్ చేస్తూ పెద్దగా పట్టించుకోడు.వ్యాపారం లో బాగా పైకి వచ్చి ఆ ఊరి ప్రముఖునిగా మారతాడు Jamie.ఇక్కడ ఒక సెంట్ మెంట్ సీను గమ్మత్తుగా తెలుగు సినిమా ని గుర్తుకు తెస్తుంది.ఒక అర్ధరాత్రి పూట కొడుకు ఊయల్లో  ఏడుస్తూంటాడు.అప్పటికి మార్గరెట్ ఇంట్లొకి రాదు. ఆ పిల్లాణ్ణి ఇంట్లో చూసుకుంటూ ఉండే గవర్నెస్ ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది.ఎందుకబ్బా అనుకుంటు ఆ రూం లోకి వస్తాడితను.అతణ్ణి చూడగానే ఊయల్లో ఏడ్చే ఆ పసివాడు వెంటనే ఏడ్పు ఆపి చిరునవ్వులు చిందిస్తుంటాడు.దగ్గరకి వెళ్ళి ఆ పసి వాని చెయ్యి పట్టుకోగానే ,అతను దృఢంగా ఆ చిన్న వేళ్ళతో తండ్రి చేతిని పట్టుకుంటాడు.వెంటనే Jamie ఒక సర్జ్ ని ఫీలవుతాడు.అవును..ఇది నా యొక్క రక్తమే ...ఈ పసి వాడే తన అన్నిటికి కూడా కొనసాగింపు.ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఇవ్వడానికి వారసులు లేకపోతే అది ఎలాంటి జీవితం..!అనిపిస్తుంది..ఇక అప్పటినుంచి ఆ కుర్రవాణ్ణి తన ఇంటిలోపలనే ఉంచి పెంచుతుంటాడు.రాత్రుళ్ళు అడవుల్లోకి వెళ్ళి అక్కడ కుమారునితో పాటు Camping చేస్తుంటాడు.విశాలమైన, చుక్కలతో మెరుస్తూ ఉండే ఆకాశం వేపు చూస్తూ ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాడు. భావి జీవితం గూర్చి శిక్షణ ఇస్తూంటాడు.ఐతే దురదృష్టవశాత్తు అక్కడి నల్లవారితో జరిగిన ఘ్రషణల్లో (వజ్రాల గని) భాగంగా ఈ కుర్రవాడు చనిపోతాడు.ఆ తరువాత పుట్టిన కుమార్తె పేరు Kate.మరి ఈమె గూర్చి వచ్చే భాగం లో తెలుసుకుండాము.








సిడ్నీ షెల్డన్ మరో నవల "Master of the Game" గూర్చి కొన్ని సంగతులు (రెండవ భాగం)


గత భాగం లో Jamie McGregar గూర్చి,అతను వజ్రాల వేటలో విజయం సాధించి క్రగర్ అండ్ బ్రెంట్ అనే కంపెనీ స్థాపించడం గూర్చి తెలుసుకున్నాం గదా..!ఈ Jamie ఏదో భార్య తో ఇంట్లో ఉంటూ ఉంటాడు గాని హృదయకపూర్వకమైన సంబంధాలు ఉండవు.ఎప్పుడైనా అవసరమైతే తప్ప అదీ ఏమైనా ప్రశ్న అడిగితే జవాబు చెబుతాడు అంతే.కొడుకు మీద ప్రేమ కలిగి మంచి గా పెంచుతున్న తరుణం లోనే కంపెనీ లో జరిగిన సమ్మె పెద్దదై జాతి పోరాటాలకు దారి తీసి ఆ కుర్రాడు మరణిస్తాడు.Jamie కూడా ఆ తర్వాత పక్షవాతానికి గురయి కొన్ని రోజుల్లోనే చనిపోతాడు.అయితే తలవని తలంపుగా ఒకరోజు భార్య మార్గరెట్ తో జామీ కలుస్తాడు.దానివల్ల అతను చనిపోయిన తరువాత Kate అనే అమ్మాయి పుడుతుంది.ఆ విధంగా ఎంతో విలువైన సంస్థల్ని భార్యకి విడిచిపెట్టి చనిపోతాడతను.

ఇంత పెద్ద సంస్థల్ని ఎలా నడపాలా అని యోచిస్తున్న మార్గరెట్ కి అదృష్టవశాత్తు David Blackwell అనే తమ కంపెని లోని మేనేజర్ బాగా సహకరిస్తాడు.అతను ఒక అమెరికన్. చాలా ముందు చూపుతో ఇలాంటి విశ్వాసపాత్రుడైన ఒక వ్యక్తిని తన ఆంతరంగికుని గా ఎన్నుకున్నందుకు భర్త ని ఆమె లోలోపలే అభినందిస్తుంది.ఇక Kate గూర్చి చెప్పుకుందాము.తండ్రి లోని కార్యదక్షత ,ధైర్యం పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంటుంది.కాని స్కూల్ లో చదువు కంటే అల్లరి బాగా చేస్తూ ఉంటుంది.ఈమె కి పద్ధతులు తెలవడానికి గాను బ్రిటన్ లోని ఒక మంచి పాఠశాలకి పంపిస్తారు.అక్కడా ఇంతే ..గుర్రాలు మైథునం చేస్తుంటే చూడటం ఒక ఆసక్తి ఈమెకి.ఇక్కడనుంచి ఆ పాఠశాల వాళ్ళు పంపించివేస్తారు.ఆ తర్వాత జోహెన్స్బర్గ్ లో బిజినెస్ కాలేజి లో చేరి మమ అనిపిస్తుంది.కొంచెం ఈడు రాగానే బిజినెస్ పగ్గాలు అప్పగించబడతాయి.ప్రపంచం లోని అనేక దేశాల్లోకి కంపెనీలని విస్తరిస్తుంది.ఆ విషయం లో ఆమెకి విపరీతమైన ఆసక్తి.

తమ ఫేమిలీ బిజినెస్ లో చేదోడు వాదోడు గా ఉండే David Blackwell ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది.నిజానికి David తనకన్నా ఇరవై ఏళ్ళు పెద్దవాడు.అంచేత ముందు అతను సుముఖుత చూపించడు.ఇంకో అమెరికన్ యువతి ని చేసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి పోవాలని ప్రయత్నిస్తాడు.అయితే ఆ సంబంధాన్ని మాయోపాయం చేత చెడగొడుతుంది Kate.తన బిజినెస్ కి సహాయకారిగా ఉండగల సమర్ధత అతనికి ఉంది.కాబట్టి అతను భర్త గా ఉంటే తన సంస్థలకి కూడా మంచి అభివృద్ది ఉంటుందని ఆమె ఆలోచన.

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం లో కూడా ఆయుధాల వ్యాపారం లో కి వెళ్ళి పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతుంది. David వాటిని ఆమోదించడు.ఎందుకు అనవసరమైన కొత్తరంగాల్లోకి అంటాడు.దక్షిణాఫ్రికా నుంచి తమ కార్పోరేట్ల హెడ్ క్వార్టర్ ని న్యూయార్క్ కి మార్చుతుంది. కొన్ని ఏళ్ళ తర్వాత Antony అనే కొడుకు పుడతాడు.అతన్నే Tony అని పిలుస్తారు.ఇతణ్ణి బిజినెస్ లో ఆసక్తిపరునిగా తీర్చిదిద్దాలని తపన పడుతుంది Kay.అయితే అతనికి మాత్రం కళా పిపాస ఎక్కువ.ప్రపంచం లోని గొప్ప చిత్రకారుల్లో ఒకనిగా పేరుతెచ్చుకోవాలని తపిస్తుంటాడు.ఆ బిజినెస్ లు అవీ ఏమైనా కానీ నాకనవసరం...నేను పేయింటర్ గా మాత్రమే జీవిస్తాను..అదే నా కిష్టం అని మొండిగా తల్లిని వ్యతిరేకించి పారిస్ కి వెళ్ళి తనకి బాగా నచ్చిన Ecole des Beaux Arts అనే చిత్ర కళాశాలలో చేరుతాడు.

సరే.. ఇ లోపులో భర్త David ఒక గని ప్రమాదం లో మరణిస్తాడు.ఇక వ్యాపార సంస్థల్ని అన్నిటిని ఈమె ఒక్కతె బాగా నిర్వహిస్తుంది.Kate Blackwell పాత్రని వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దాడు రచయిత.తనకి కావాలసిన పని కోసం ఎంత దూరమైన వెళుతుంది ఈమె.జనరల్ మేనేజర్ ర్యాంక్ లో తన సంస్థ లో నే పని చేసే Brad Rogers తన విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని తెలుసుకున్న ఆమె అతని కార్యకలాపాల్ని అన్నిటిని పరిశీలిస్తుంది.బాగా ఆలోచించి చివరకి ఒక ఎత్తుగడ వేస్తుంది.ఒకసారి ఉన్నట్టుండి వచ్చి నాతో పడుకో అని అతన్ని ఆజ్ఞాపిస్తుంది.ఆ పని అంతా అయిపోయిన తరువాత అంటుంది..ఎందుకు ఎవరో ఒక ఆడదాని కోసం చింతిస్తూ బిజినెస్ కార్యకలాపాల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు..అంతా చేసి దీనికోసమేనా ..మంచిగా కష్టపడితే అందరకీ అన్నీ సమకూరుతాయి  అని అడుగుతుంది..!ఇక అప్పటినుంచి అతను కుక్క మాదిరిగా సంస్థ లో విశ్వాసంగా చివరి దాకా పనిచేస్తుంటాడు.అయితే Kate మళ్ళీ చాన్స్ ఇస్తుందేమోనని ఇతగాడు చూస్తాడు గాని ఇహ జీవితం లో చస్తే ఇవ్వదు.అలా ఒక మైండ్ గేం తో ఎవరిని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటూ ప్రపంచం లో ఒక ఆసక్తిదాయకమైన  బిలియనీర్ గా  పేర్తెచ్చుకుంటుంది..!

సరే..అటు పారిస్ లో Tony చాలా సామాన్యమైన జీవితం గడుపుతుంటాడు.చిన్న కిచెన్,చిన్న బెడ్ రూం ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకుంటాడు.తన తిండిని తానే వండుకుంటూ అంట్లు కడుక్కుంటూ ఆర్ట్స్ స్కూల్ కి వెళుతూ ఒక సాదా జీవితం గడుపుతుంటాడు.ఖాళీగా ఉన్నప్పుడు పారిస్ వీధుల్లో చక్కెర్లు కొడుతూ ఆనందం గా తనకి నచ్చిన జీవితాన్ని గడుపుతుంటాడు.ఒక్కొసారి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినపుడు పాబ్లో పికాసో కాఫీ తాగుతూ కనిపించేవాడు.అలాగే మార్క్స్ ఎర్నెస్ట్ రోడ్డు వారగా ఉన్న కేఫ్ లోని కుర్చి లో కూర్చుని మిత్రులతో మాట్లాడుతూ కనిపించేవాడు.ఓసారి అల్బర్టో జియాకొమెట్టి తనతో పాటు రోడ్డు దాటుతూ కనిపించాడు.ప్రపంచం ఆరాధించే ఇటువంటి గొప్ప చిత్రకారులున్న ఈ ప్రదేశం లో నేను నివసిస్తున్నా గదా అని గర్వంగా అనిపించేది Tony కి. పారిస్ రెండు పార్శాల్ని కలిగి ఉన్నట్లు అనిపించేది.ఒకటి కళాకారుల నగరం రెండవది మిగతా ప్రజలకి చెందినట్టిది.హిట్లర్ లాంటి వాడు కూడా పారిస్ ని ఆక్రమించినా దాని అందాన్ని చెడగొట్టే పని ఒక్కటి కూడా చేయలేదు అందుకేనేమో.

ఇక్కడి చిత్రకళ లో నిష్ణాతుడని పేరుతెచ్చుకున్నవారికి ప్రపంచం అంతా నీరాజనాలర్పిస్తుంది.మానవ శరీర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన తరువాతనే అక్కడ ఆర్ట్స్ స్కూల్ లో పాఠాలు మొదలెడతారు.కనీసం ఐదు ఏళ్ళు గురువు శిక్షణ లో ఉండాలని భావిస్తారు వాళ్ళు.Tony కి ఒక గురువు ఉంటాడు అతని పేరు Maitre Cantal. మీ అమెరికన్ లు ఇన్నేసి ఏళ్ళు ఆర్ట్స్ మీద ఉండటానికి ఇష్టపడరు.నువ్వు తేడా గా ఉన్నావే అంటాడితను ఓసారి Tony..! కాలం గడుస్తున్న కొద్దీ మిగతా విద్యార్తులు అందరి కంటే మిన్నగా రాణిస్తుంటాడు ..అది చూసి ఒక సారి గురువు అంటాడు..Tony గీసిన బొమ్మ నిజం గానే ఊపిరి పీలుస్తున్నంత గొప్ప గా ఉందని మిగతావారికి చెపుతుంటాడు.

ఇదిలా ఉండగా ఆ స్కూల్ లోనే మోడల్ గా కొత్త గా వచ్చిన Dominique అనే యువతి Tony అభిమానిగా మారి అతనితో ప్రేమలో పడుతుంది.ఒకరోజు ఆమె అడుగుతుంది నీ బొమ్మలు అన్నిటిని గ్యాలరీ లో ప్రదర్శనకి పెట్టమని.దానికి అతను అంగీకరించడు ఈ పారిస్ నగరం గొప్ప కళాకారులకి పుట్టినిల్లు.నావి ఎంత అంటాడు.లేదు నీవు కూడా అంతటి గొప్ప వాడివే అంటుంది ఆమె.సరే అని ఒక గ్యాలరి లో ప్రదర్శన కి పెడతాడు.దానికి ప్రముఖులంతా వస్తారు.ముఖ్యంగా ఆండ్రీ అనే విమర్శకుడు దాన్ని తూర్పార పడతాడు.పేపర్లలో కూడా చులకనగా రాస్తాడు.దానితో Tony కి మనసు విరిగిపోతుంది.ఇంత మంచి చిత్రాల్ని కాదని అన్నప్పుడు నేనిక్కడ ఎందుకు ఉండాలి అని కోపం తెచ్చుకొని తల్లి దగ్గరకి న్యూయార్క్ కి వచ్చేస్తాడు.తల్లి చెప్పినట్లే విని బిజినెస్ కార్యకలాపాల్లో మునిగిపోతాడు.ఉన్నట్లుండి ఒక రోజున అనుకోకుండా Dominique అనే యువతి(పారిస్ లో కలిసినావిడ)  తమ సంస్థ లోని ఉద్యొగిని అని తెలిసి ఆశ్చర్యపడి నిజం చెప్పమని బెదిరిస్తాడు. తనని ఆ చిత్ర కళ నుంచి దూరం చేయడానికే తన తల్లి Dominique ని రంగం లోకి దింపిందని ,ఆ విమర్శకునికి డబ్బిచ్చి అలా రాయించిందని తెలుసుకుని ..ఇంటికొచ్చి తల్లి Kate ని బాగాతిట్టి ..అసలు ఈ ఇంట్లో నివసించను చెప్పి దూరం గా వెళ్ళిపోతాడు.ఆ తర్వాత అతనికి మతి భ్రమిస్తుంది.అయితే అప్పటికే అతని  భార్య గర్భవతి.ఇద్దరు కవలల్ని (ఆడపిల్లల్ని) ప్రసవించి మరణిస్తుంది.వాళ్ళిద్దరి పేర్లే Eve,Alexandra లు.వీళ్ళు కధని ఇంకో మలుపు తిప్పుతారు.వచ్చే భాగం లో అదంతా చివరికంటా స్పీడుగా లాగించేద్దాము.లేకపోతే ఎంత చెప్పినా తరిగేది కాదు.Click here


                                 





సిడ్నీ షెల్డన్ నవల Master of the Game మూడవ మరియు చివరి భాగం


Eve,Alexandra లు ఇద్దరు కవల పిల్లలు.ఈ అమ్మాయిలిద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు.వీళ్ళు Tony యొక్క కుమార్తెలు.Kate Blackwell కి మనవరాళ్ళు.చిత్ర కళనుంచి అతని గమ్యాన్ని కుతంత్రం తో ఫేమిలీ బిజినెస్ వేపు మళ్ళించడం తో తను మానసికంగా దెబ్బ తిని  అలాంటి వారికి కేటాయింపబడిన  ఒక షెల్టర్ లో ఉంటూ ఉంటాడు.ఈ అమ్మాయిల్ని మాత్రం Kate తన వద్దనే ఉంచి పెంచుతూంటుంది.ఏ మాటకి ఆ మాట ఈ Tony పాత్ర చాల సహజత్వానికి దగ్గర గా ఉండే పాత్ర.ఇతనికి చిన్నప్పటి నుంచి నత్తి ఉంటుంది.దాన్ని మాంపడానికి Kate రకరకాల డాక్టర్లని సంప్రదిస్తుంది కాని వీలవదు.దాని వల్ల ఇతను ఒక రకంగా అంతర్ముఖుడై చిత్రకళ వైపు ఆసకి పెంచుకుంటాడు.డైరక్ట్ గా ఎక్కడా చెప్పడు గాని ఏదో ఒక శారీరక వక్రత లేదా లోపం అనేది మనిషిని కళల వేపు తీసుకు వెళుతుంది అన్నట్లుగా అంతర్లీనంగా చెపుతాడు.

సరే... Eve అనే ఈ అమ్మాయి బాగా దుందుడుకు.అంత తనకే కావాలనే రకం చిన్నప్పటినుంచి కూడా తన సోదరి Alexandra ని అడ్డు తొలగించుకోవాలని తద్వారా ఆస్తి మొత్తం తనే కొట్టేయాలని యత్నిస్తూంటుంది.ఎన్నో మంచి స్కూళ్ళ లో చదివించి మార్చాలని చూస్తుంది Kate. కాని ఫలితం శూన్యం.Alexandra అనే అమ్మాయి మాత్రం కొంచెం మెతక,అందరిని ప్రేమించే సౌమ్యురాలు.ఎప్పటికైనా ప్రమాదమని కనిపెట్టి Eve ని బయటకి పంపేస్తుంది Kate.కొన్ని నిభందనలు కూడా పెడుతుంది ..తన ప్రవర్తన మార్చుకొని మంచిగా ఉందని అనిపిస్తేనే మళ్ళీ ఇంట్లోకి రానిస్తానని లేదా నెలకింతా అని డబ్బులు ఇస్తుంటా దానితో బ్రతుకు అని చెప్పి మనవరాల్ని బయటకి పంపంచి వేస్తుంది.

Eve బయటకి వెళ్ళి ఒక అద్దె అపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటుంది.విలాసపరురాలు గదా.ఎక్కువ డబ్బులు అవసరం కాబట్టి మంచి ధనికులైనవారిని వల లో వేసుకుని జీవితాన్ని కావలసిన రీతి లో ఎంజాయ్ చేస్తూంటుంది.ఒక సారి అలాటి క్రమం లోనే George Mellis అనే గ్రీకు యువకుడు పరిచయమవుతాడు.ఇతను కుటుంబం గ్రీస్ లో ఉండే ఒక ధనిక వ్యాపార కుటుంబం.అయితే అతని తండ్రి ఇతని చేష్టలు గిట్టక ఇంట్లోంచి వెళ్ళగొడితే వచ్చి న్యూయార్క్ లో ఒక కంపెనీ లో పని చేస్తూంటాడు.Eve ఇతగాడి తో ఒక రాత్రి గడుపుతుంది.అప్పుడు అర్ధం అవుతుంది..ఇతను  సెక్స్ వల్ విషయాల్లో ఒక గొప్ప పర్వెర్ట్ అని. సెక్స్ లో ఫాల్గొనేటప్పుడు ఎదుటి మనిషిని విపరీతంగా కొట్టి వాళ్ళు నిస్సహాయ స్థితి లో ఉండగా ఆ పని చేయడం ఈ George కి ఒక ఆసక్తి.ఆ క్రమం లో Eve ఒళ్ళు అంతా హూణం చేసి ,మొహం అంతా పచ్చడి పచ్చడి గా కొడతాడు.ఆ పిమ్మట ఆనల్ సెక్స్ చేస్తాడు.దానితో ఈమె వీడెవడో పనికొచ్చే యవ్వారం లా ఉందని  ఇతని పూర్వపరాల్ని విచారిస్తే అతనిది కూడా ఇంచు మించు తన లాంటి కధే అని తేలుతుంది.అంటే ధనిక కుటుంబం నుంచి వచ్చినా కొన్ని కారణాల చేత ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టారని గ్రహిస్తుంది.ఇతగాడిని తన ప్లాన్ లో ఉపయొగించుకుని Alexandra ని మర్డర్ చేసి ఆస్తి అంతా దక్కించుకోవాలని యోచన చేస్తుంది.ఒక్కసారి ధనం మొత్తం తన చేతిలో పడ్డాక ఈ George గాడిని ఇంతకింతా చేసి తన కక్ష తీర్చుకోవచ్చునని తలపోస్తుంది.

అప్పుడు ఒకసారి George కి తన ప్లాన్ చెప్తుంది,నువ్వు గనక నే చెప్పినట్లు చేస్తే  నాకు పెద్ద ఎత్తున ఆస్తి కలిసి వస్తుంది.మా సోదరిని Alex ని నువు ప్రేమించి పెళ్ళాడు..దానికి కావాలసింత సాయం నేను చేస్తా.ఒక మంచి రోజున నే చెప్పినఫ్ఫుడు దాన్ని చంపే పని కానివ్వు.ఇహ ఆస్తి అంతా అప్పుడు మన ఇద్దరిదే.అలా అంటుంది.సరేనని ఒప్పుకుంటాడు.

ఆ రాత్రి George గుద్దిన గుద్దుడుకి మొహం అంతా పగిలినట్లయిపోతుంది.Eve తమ ఫేమిలీ డాక్టర్ చేత బాగు చేయించుకోవడానికి వెళుతుంది.అతను Keith Webster అనే మంచి నిపుణుడైన డాక్టర్ చేత వైద్యం చేయించి యధాప్రకారం ఆమె మొహం బాగుపడేలా చేస్తాడు.అది బామ్మ Kate Blackwell కి తెలియకుండా జాగ్రత్త పడుతుంది.

George Mellis అనే అతని గూర్చి కొద్దిగా తెలుసుకోవాలి ఇక్కడ.గ్రీస్ లో చదువుకునే సమయం నుంచే హోమో సెక్స్ కి అలవాటు పడతాడు.పదమూడు పడ్నాలుగేళ్ళు పిల గాళ్ళకి డబ్బులు అవీ ఆశ చూపించి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి చచ్చిపోయే స్థిథిలో వాళ్ళతో ఆనల్ సెక్స్ చేసి వదిలిపారేస్తాడు.అలాగే అమ్మాయిల్ని కూడా.ఎక్కువ గా వేశ్యల్ని ఎంచుకుని ఆ విధంగా  చేస్తుంటాడు.ఆ తెల్లారి పొద్దున ఈ బాధితుల గురుంచి పేపర్ లలో రావడం కామన్ గా జరుగుతూంటుంది.తను ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి ఒక న్యూస్ ఆయా రోజుల్లో రావలసిందే.తన పేరు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.

ఒక సారి ఇంట్లో ఇలాంటి కార్యక్రమమే చేస్తుండగా తండ్రి ఇతడిని చూసి ..ఎర్రగా కాలుతున్న చుట్టని ఇతని శిశ్నానికి అంటించుతాడు.అలా చేయడమేగాక ఇంట్లోనుంచి బయటకి గెంటివేస్తాడు.దానితో ఈ George అమెరికా వచ్చేస్తాడు.అయితే తన పద్ధతుల్ని మాత్రం ఏ మాత్రం మార్చుకోడు..పైగా రెట్టించిన క్రౌర్యం తో తన కార్యకలాపాల్ని చేస్తుంటాడు.

సరే..కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ George కి Alex కి పెళ్ళవుతుంది.అయితే ఈమె దగ్గర తన శాడిస్టిక్ గుణాన్ని చూపించడు..ఎందుకంటే కాలక్రమం లో ఏ అనుమానం రాకుండా ఈమె ని లేపెయ్యాలిగదా అంచేత. వీళ్ళ హనీమూన్ ని ఒక సముద్రపు పడవ లో ఏర్పాటు చేస్తారు.ఇదీ Eve యొక్క ప్లాన్ లో భాగమే.అట్లా George ఈ పడవ లోకి రాగానే చీకట్లో ఓ మూల నక్కి ఓ కత్తి తో Eve ఇతగాడిని హత్య చేస్తుంది.శవాన్ని సముద్రం లో తోసేస్తుంది.ఇది పోలీస్ శాఖ వారి దగ్గర మిస్సింగ్ కేసు లా నమోదు అవుతుంది.ఎన్ని విధాలుగా వెతికినా మర్డర్ చేసిన వారి ఆచూకి తెలియకుండాపోతుంది.

అయితే Eve కి ..అదే మొహానికి ఆపరేషన్ అదీ చేసి కాపాడిన డాక్టర్ Keith Webster  మాత్రం కొన్ని బలమైన ఆధారాలతో Eve ఏ ఈ హత్య చేసిందని అనుమానించి ఆమె ని అడుగుతాడు.ఆమె తత్తరపడటం తో నన్ను పెళ్ళి చేసుకుంటే ఈ రహస్యాన్ని పోలీస్ శాఖ వారికి చెప్పనని అంటాడు.ఆస్తి అంతా చేతికి వస్తున్న తరుణం లో ఇతగాడేమిటి నాకు అనుకొని..సరే అని ఒప్పుకుంటుంది.ఈ డాక్టర్ ని మానసికంగా హింసించాలని Eve అతని ముందే ఇంకొకళ్ళతో అఫైర్స్ పెట్టుకొని తిరుగుతూంటుంది. ఈ డాక్టర్ కూడా చాలా మర్యాదగా తగిన సమయం వచ్చినప్పుడు చూసుకుంటాలే అన్నట్లుగా మెలుగుతూ ఉంటాడు.ఒక రోజు ఆ సమయం వస్తుంది.తన కంటి కింద ఏర్పడిన ఒక లైన్ ని ఆపరేషన్ ద్వారా తీసేయమని అడుగుతుంది.సరే..అని చెప్పి ఆపరేషన్ చేస్తాడు...కొన్ని రోజులు పోయిన తర్వాత చూసుకుంటే ఆమె మొహం అంతా వికృతంగా అయిపోయి ఉంటుంది.నన్ను మళ్ళీ యధా స్థితి కి తీసుకు రా అని అడగ్గా..నేనే గాదు..ప్రపంచం లో ఎవ్వరూ నిన్ను ఇక అందం గా తయారు చేయలేరు అంటాడు ఆ డాక్టర్ భర్త.ఇక చేసేది ఏమీ లేక ఈ మొహం చూసి ఎవరు తనదగ్గరకొస్తారు..కనీసం ఈ డాక్టర్ తోనే మంచి గా ఉంటూ ఇలా గడిపేద్దాము అనుకుంటుంది Eve.

బామ్మ Kate Blackwell కి ఇది తెలిసినా ఆమె చేసిన దుశ్చర్యలకి తగిన శిక్ష పడిందిలే అనుకొంటుంది.Alex కాలక్రమం లో Dr.Peter Templeton ని పెళ్ళి చేసుకొని Robert అనే అబ్బాయిని కంటుంది.ఇదిగో ..తన ఈ తొంభై య పుట్టినరోజునాడు Kate Blackwell పార్టీ లో పియానో ని వాయిస్తున్నది ఎనిమిది ఏళ్ళ ఈ కుర్రాడే.ఈమె కి ముని మనవడు.నీ భవిష్యత్ లో ఏం కావాలనుకుంటున్నావు..అని ఈమె ముని మనవడిని అడగ్గా పియానిస్ట్ కావాలని ఉందని చెబుతాడు.అయితే నీకు గొప్ప కళాకారులందరి తో పరిచయం చేయిస్తానులే అంటుంది Kate.వెంటనే మనకి ఆమె కొడుకు Tony కధ మనసులో మెదులుతుంది.

అంతే...నవల ముగుస్తుంది..!Click here


                        -- Murthy Kvvs





The 3 mistakes of my life ..చేతన్ భగత్ రాసిన నవల 


The 3 mistakes of my life ..చేతన్ భగత్ రాసిన నవల ఇటీవలనే చదివాను.ఇంచుమించు 35 వయసు లో ఉండి ,పంజాబీ కుటుంబానికి చెంది ,ఢిల్లీ IIT లో ఇంజనీరింగ్ చేసిన ఇతని నవల అదీ ఆంగ్లం లో రాసినది గమ్మత్తుగా ఉంది.ఇతను ఇంగ్లీష్ లో రాయకపోతే నేను చదవగలిగేవాడినా..ఏ హిందీ లో అయినా..పంజాబీ లో అయినా..ఇప్పటికీ ఇంగ్లీష్ ప్రాధాన్యత అలా ఉన్నది అది అంతే..!ఇప్పటికీ దేశాన్ని ఐక్యత వేపు తీసుకెళ్ళేది ఆంగ్లమే.నచ్చినా నచ్చక పోయినా..! మొత్తం మీద అనిపించినది ఏమంటే ఆంగ్లం లో రాసేటప్పుడు ఎవరికైనా స్థానిక ప్రభావం పడితీరుతుంది..వాక్య నిర్మాణం లో గాని...ఇంకో దానిలో గాని.అదేమీ అంత తప్పు కాదు.ఎవరైనా ఆ భిన్నత ని ఆస్వాదిస్తారు..!గ్రామర్ పరంగా తప్పులు వెదకదలుచుకున్న వారికి కోకొల్లలుగా దొరుకుతాయి.కాని కధ చెప్పే విధానం లో మమేకమై అలా వెళ్ళిపోతాము.అసలు ఇంగ్లీష్ అంత Flexible భాష మరొకటి లేదు.ఫ్రాంజ్ కాఫ్కా ని జర్మన్ లోనుంచి గాని ,డోస్తోవిస్కీ ని రషయన్ లో నుంచి గాని,పావ్లో కొయ్లో ని పోర్చుగీస్ లోనుంచి గాని మన అందరకి దగ్గరకి చేర్చింది ఇంగ్లీష్ కాదు...?ఎన్ని రకాలైనా వారివైన వ్యక్తీకరణలు..? కాని గుండెకి తాకే చెమ్మదనం..అది ఏ రసం గాని.


సరే..చేతన్ భగత్ రాసిన ఈ నవల కి వాద్దాము. కధ అంతా గుజరాత్ నేపధ్యం లో సాగుతుంది.అదీ అహ్మదాబాద్.ఆనంద్ పటేల్  అనే యువకుడు తాను సూసైడ్ చేసుకోబోతున్నట్లు రచయిత   కి ఒక ఈమెయిల్ పెడతాడు.మొత్తానికి తన తెలివి తో ఆ వ్యక్తి ని ఓ ఆసుపత్రి లో కలుసుకుంటాడు.ఇహ అతను తన కధ అంతా చెబుతాడు.తనకి గల స్నేహితులు Ish,Omi  ఇంకా ఇతరులతో గల సంబంధాలు.అదే నవల మొత్తం యొక్క సారాంశం. Anand Patel అనే తను అహ్మదాబాద్ లో తల్లి తో జీవిస్తుంటాడు.తండ్రి మరణిస్తాడు.అతని స్కూల్ ఫ్రెండ్స్  Omi,Ish ల తో కలిసి చిన్న బిజినెస్ ప్రారంభిస్తాడు.Omi మామ హిందూ  పార్టి లో పనిచేస్తుంటాడు. Anand ట్యూషన్స్ కూడా చెబుతుంటాడు.ఆ క్రమం లో అతను Ish సోదరిని ప్రేమిస్తాడు.వీరి కి ముస్లిం కుర్రాడు దొరుకుతాడు..అతని పేరు  ali..!  Ish   క్రికెట్ లవర్ కాబట్టి అతని లోని టాలెంట్ ని గుర్తించి బాగా పైకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తాడు.ఆ క్రమం లో అక్రమ మార్గం లో ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ని సైతం మీట్  అవుతాడు.అయితే ఆలీ మాత్రం తాను ఇండియన్ ని గనక ఇండియా తరపునే ఆడతానంటాడు. దానితో చాన్స్ మిస్ అవుతుంది.


అదలా ఉండగా గోధ్రా అల్లర్లు సమీపిస్తాయి.Omi మామ యొక్క కొడుకు ఇంకా ఇతరులు ఆ రైలు లో చనిపోవడం తో కనబడిన ముస్లింస్ నల్లా చంపడాకి ఇతను జనాల్ని వేసుకుని బయలుదేరుతాడు.ఆ క్రమం లో ఆలి ని తనకి వదిలి పెట్టమని అన్నా,ఈ ముగ్గురు కలిసి అతన్ని రక్షిస్తారు.ఆ క్రమం లో ఒకరు మరణిస్తారు.అతను Omi అని చెప్పి అతని మేనల్లుడు.చివరకి తాను ప్రేమించిన స్నేహితుని సోదరి విద్య కూడా ముంబాయి వెళ్ళిపోవడం తో నిరాశ కి గురయి ఆనంద్ సూసైడ్ కి ప్రయత్నిస్తాడు.


చివరకి రచయిత కి తన గాధ అంతా రాయడానికి ఒప్పుకుంటాడు.అట్లా ఎపిలోగ్ ముగుస్తుంది.ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇది ప్రధానంగా గోధ్రా అల్లర్లు నేపధ్యాన్ని భూమిక గా తీసుకుని సాగుతుంది.దానికి ముగ్గురు స్నేహితుల కధని పై పూత గా అద్దాడు అని చెప్పాలి.నా మటికి నాకు చెప్పాలంటే చేత భగత్ లో కధని తెలివి గా నడిపించే చాక చక్యం ఉంది గాని లోతైన ఇంగ్లీష్ భాషా జ్ఞానమేమి లేదు.ఆర్.కె.నారాయణ్ గాని మనోజ్ దాస్ గాని ఇలాంటి పాత తరం ఇండో ఆంగ్లికన్ రచయితలతో పోలిస్తే బోలుగా అనిపిస్తుంది కొన్ని చోట్ల.అయినా దీన్ని నిరుత్సాహ పరచను..ఇలాంటివి ఇండియన్ మొజాయిక్ నుంచి ఎన్నో రావాలి...   ఆ విధంగానే భిన్నత్వం లో ఏకత్వం సిద్దిస్తుంది.Click here








Paths of Glory నవల గురించి కొన్ని విషయాలు..

కొందరు ఉంటారు..వారికి కొన్ని గొప్ప కలలు ఉంటాయి..వాటిని ఎంతో కష్టించి పరి పూర్తి చేస్తారు..దురదృస్టం వెన్నాడుతున్నదా అన్నట్లు ..వారికి రావాలసిన గుర్తింపు మాత్రం రాదు.ప్రపంచం ఎప్పుడో వారిని ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత గుర్తించవచ్చు.ఈలోగా వారు ఈ ప్రపంచం నుంచే నిష్కృమించవచ్చు. అదిగో అలాంటి ఒక నిజమైన వ్యక్తి యొక్క జీవితం ని ఆధారం గా చేసుకొని రాసిన నవలయే ఈ Paths of Glory అనేది, రచయిత మరెవరో కాదు ప్రముఖ బ్రిటిష్ నవలాకారుడు Jeffry Archer .దీనిలోని హీరో George  Mallory.1924 లో ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచం లో మొట్ట మొదటి సారి గా అధిరోహించిన పర్వతారోహకుడు.అయితే దాని ఆనవాలు 1999 వరకు బయటకి తెలియరాలేదు.దానికి కారణం ఆయన శవం ఎవరెస్ట్ కి దిగువన 600 మీటర్ల కిందన దొరికింది.శిఖరం అధిరొహించిన పిమ్మట ఆక్సిజన్ అందక కిందకి దొర్లి పడి చనిపోయి ఉండవచ్చునని కొన్ని ఆధారాలు లభించాయి.

1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన సర్ ఎడ్మండ్ హిల్లరి ,ఇంకా టెంజింగ్ నార్గే లు ఆ తర్వాత వారే నని ఈ నవలలో చెప్పడానికి ప్రయత్నించారు.1999 లో ఒక పరిశోధక బృందం ఆ శిఖరానికి చేరుకొని Geoge Mallory శవాన్ని ఆ మంచులో కనిపెడతారు.పర్వతం నుంచి  జారిపడినప్పుడు  అతని శరీరం లోని కాళ్ళు చేతులు దారుణంగా విరిగినట్లుగా అగపడతాయి.శవం కి  ఉన్న ఆ దుస్తులు పేలికలై ఉంటాయి.రోలెక్స్ వాచ్ చేతికి ఉన్నది.నడుముకి ఉన్న రోప్ తెగిపోయి ఉంది.27000 అడుగుల  ఆ ఎత్తులో ,ఆ మంచులో దిక్కుమాలిన ప్రేతం లా ఉన్న ఆ శవం ఒకప్పుడు కేంబ్రిడ్జ్ లో ఆంగ్ల సాహిత్యం అభ్యసించిన మనిషి అంటే ఎవరూ నమ్మరేమో.

ఈ దిగిన పరిశోధక బృందం లో  కూడా ఈ ఖ్యాతి లేటు గా ఎక్కిన ఆ ఎడ్మండ్ హిల్లరి కే దక్కాలని దురాలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు.నర్మ గర్భంగా  కొన్ని డైలాగులు నడుస్తాయి.శవం జేబు లో వెతుకుతారు..దానిలో ఒక కర్చీఫ్ దొరుకుతుంది ..దానిమీద Ruth అనే పేరు ఎంబ్రాయిడరి ఉంటుంది.ఆమె George యొక్క భార్య.ఆ పేరు ని అలా ఎంబ్రాయిడరి చేసి అతనికి ఇస్తుంది..!అయితే ఆమె ఫోటొ మాత్రం ఆ దుస్తుల్లో కనబడదు.అంటే ఈ లెక్కన ఎవరెస్ట్ ని అతను ఎక్కినట్లు వాళ్ళు భావిస్తారు.ఎందుకంటే ఆమె ఫోటో ని ఆ శిఖరం మీద తన గుర్తుగా ఉంచుతానని చెబుతాడు.ఇవన్నీ అతని డైరీ ని చదివి తెలుసుకుంటారు.

George Mallory కధని ..ఈ చావు  కి ముందు అతని జీవితం ఎలా గడిచింది ..అతని బాల్యం,చదువు,ప్రేమ,ఉద్యోగం ఇంకా సకల వ్యవహారాలు ముఖ్యంగా పర్వతారోహణ పై అతని కి గల మక్కువ..యూరపు లోని వివిధ పర్వతాల్ని  ఎక్కడం ..దాని లోని పట్లు అన్నీ హృద్యంగా రచయిత వర్ణిస్తాడు.లండన్ వాసి అయిన హీరో చదువుకునే సమయం లో డబ్బులు ఆదా చేసుకునే తీరు ..ప్రేయసి రూథ్ టర్నర్   కోసం వెనిస్ వెళ్ళి కొన్ని సాహసాలు చేయడం ఆహ్లాదం గా ఉంటుంది.George కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజులు అక్కడి సిస్టం ని వివరిస్తాయి.

1953 లో ఎవరెస్ట్ ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరి ఆ శిఖరం పైకి ఎక్కి 15 నిమిషాలు ఉంటాడు నార్గే తో కలిసి.కాని ఎందుకనో గాని ఫోటో అక్కడ ఉండి తీయించుకోడానికి ఇష్టపడలేదని అందుకనే ఆ చిన్న మంచు ని నరికే గొడ్డలిని తాను ఒక్కడ్నే ఫోటో దిగానని టెంజింగ్ నార్గే చెప్పారు ఒక ఇంటర్వ్యూ లో.బహుశా అతని అంతరంగం లో  ఆ క్రెడిట్ పొందిన మొదటి శ్వేత జాతీయుడు George Mallory అని తెలుసునేమో..!






చింగిజ్ ఐత్మతొవ్ "జమీలియ" నవల గురించి


1958 ప్రాంతం లో మొదట కిర్గిజ్ భాష లో రాయబడిన చిన్ని నవలని ఈ రోజునే తెలుగు లో చదివాను.తెలుగు సేత ఉప్పల లక్ష్మణ రావు గారని చెప్పనక్కర లేదు అనుకుంటా.కిర్గిజ్ స్తాన్ లోని ఒక గ్రామం లో జరిగే ప్రేమ కధ ఇది.ఒకే విడత లో పుస్తకం దించకుండా ఇటీవల నే చదివిన పుస్తకం ఇదే.యుద్ధ నేపధ్యం లో సాగుతుంది.ఒక చిన్న గ్రామం లోని సంఘటనల్ని ఎంత నేర్పు గా ,లోపలికి అంటా వెళ్ళి ఎలాంటి బోరు లేకుండా కధ నడిపిస్తాడో...ముఖ్యంగా కిర్గిజ్ ల గుర్రాల పోషణ,వ్యవసాయ విధానం,ఆ గోధుమల్ని బస్తాల్లో వేసుకొని ఆ స్టెప్పి ల వెంట ...కనుమల వెంట ప్రయాణించడం,ముఖ్యంగా ప్రకృతి వర్ణన లు చదువుతుంటే ఆ దరి దాపుల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి ..అంత హృద్యమైన ...నిజానికి దగ్గరగా ఉండే ఆ వర్ణనలు ఏ  రచయిత చేశాడు ..అనిపించాయి.అక్కడ పెరిగే ప్రతి మొక్క ,చెట్టు ,ఇంకా వాతావరణ మార్పులు వీటన్నిటిని ఎంత నిశితం గా పరిశీలించాడో ..!

జమీల్య ..ఆమె అత్త ..యుద్ధ భుమి లో ఉండి ఉత్తరాల ద్వారా మాత్రమే పలకరించే జమీల్య భర్త,ఆమె మరిది సెయిత్ ,ఇంకా ఒస్మాన్,కరీం,జమీల్యా తో ప్రేమ లో ఉన్న ధానియార్ ,ఈ కధ అంతటిని తన ద్వారా వినిపించే చిత్రకారుడైన  సెయిత్ ..అలా చదివిన తర్వాత మనతో ఆ పాత్రలు మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి.చిన్న కధే..ఇలాంటివి మన పల్లె ల్లో కూడా జరిగినవే గాని ఇంత శిల్ప మాధుర్యం గా ఎవరైనా చెప్పారా అనిపించక మానదు.అయితే యుద్ధం లో గాయపడి పల్లె కి వచ్చిన అనాధ యువకుని(ధనియార్)  తో ప్రేమలో పడే జమీల్యా ది ఆకర్షణ మాత్రం గానే తోస్తుంది.ఉత్తరం ద్వారా పలకరించే భర్త తన విద్యుక్త ధర్మం లో భాగం గానే యుద్ధం కి వెళతాడు తప్ప భార్య పై ప్రేమ లేక కాదు కదా ..!Click

ఏది ఏమైనా చింగిజ్ ఐత్మతోవ్ కధనం ఎన్నదగినది.ప్రతి చిన్న కదలిక ని భలే గమనించాడే అనిపిస్తుంది. మనుషుల ,పరిసరాల భాషణల్ని ఏ మాత్రం చిరాకు పుట్టించకుండా చెప్పడం అది ఒక అభ్యాసమే.దానిలో చింగీజ్ అగ్రగణ్యుడని అనవచ్చు.వంద పేజీలు కూడ దాటని ఈ నవల లో ఎంత బరువు ని నింపాడు అని చివరి పేజీ లోకి వచ్చేసరికి తోస్తుంది.  దీన్ని కిర్గిజ్ భాష లో నే ఆయన రాయగా ఇంగ్లీష్ లోకి జేంస్ రియోర్డన్ అనువాదం చేశాడు.అయితే 1960 నుంచి చింగిజ్ కిర్గిజ్ లో కాక రష్యన్ భాష లో రాయడం మొదలు పెట్టాడు.రెండు భాష ల్లోను చింగీజ్ రాయగలిగే వాడు.రష్యా తరపున యూరోపియన్ యూనియన్ కి ,యునెస్కో వంటి వాటికి రాయబారిగా పనిచేసిన చింగీజ్ 2008 లో జర్మనీ లో కన్నుమూశాడు.అయితే అతని శవాన్ని ఆయన కోరిక మేరకు కిర్గిజ్ స్థాన్ లోని అతని స్వగ్రామం లో ఖననం చేయడం జరిగింది.





చింగీజ్ ఐత్మతోవ్ దే మరియొక నవల "తొలి ఉపాధ్యాయుడు" గురించి....


ఈ సారి చింగిజ్ ఐత్మతోవ్  దే ఇంకొక నవల గురుంచి మాట్లాడుకుందాము.అది తొలి ఉపాధ్యాయుడు.ఎంతో సాదా సీదా గా సాగిపోయే గ్రామీణ జీవితాల్లోని వేదనని ,శోధనని,విజయాన్ని ఇంకా అనేక కోణాల్ని అత్యంత ప్రతిభావంతం గా చిత్రించిన రచన ఇది.విద్యా నేపధ్యం లో ఇంత కరుణ రసం తో కూడుకున్న నవల మరియొకటి లేదు అంటే  అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.మనకి తెలియకుండానే అలా కుర్కురేవ్ గ్రామ ప్రాంతం లోకి వెళ్ళిపోతాము..ఆ కొండ దిగువనున్న విశాల పీఠభూమి ,కనుమల్లోనుంచి ప్రవహించే సెలయేళ్ళు,నల్లని కొండల వరుసలు,మనుషుల మనసుల్లోని వివిధ భావాల్ని పలికిస్తున్నవా అన్నట్లు రకరకాల ధ్వనులు రకరకాల వేళల్లో చేసే ఆ పోప్లార్ మహావృక్షాల అలికిడులు..చదూతున్నంతసేపు ఒక ధ్యానమ్మ్ లోకి వెళ్ళిపోతాము.

ఒక అనాధ బాలిక,ఒక ఉపాధ్యాయుని నడుమ పెనవేసుకొని మహాలత మాదిరిగా భాసించే అనుభవాల హారమే ఈ సున్నిత మైన నవల.అల్తినాయ్ సులైమానోవ్న అనే తత్వ శాస్త్ర అకడమీషియన్ ఒకావిడ మాస్కో యూనివర్సిటీ నుంచి తమ గ్రామం కి వస్తుంది..వాళ్ళ ఊరి లో కొత్త గా నిర్మించిన ఓ పాఠశాలకి ప్రారంభోత్సవం చేయడానికి..ముఖ్యంగా ఆ ఊరి ప్రజల కోరిక మేరకు..! అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా వెంటనే వెనక్కి పయనమవుతుంది..అప్పుడు ఆ ఊరిలో ఒకతను అంటాడు..' ఏమండీ..మీ అనుభవం లో ఎన్నో గొప్ప సన్మానాలు అందుకొని ఉండవచ్చును...ఎన్నో సమావేశాల్లో ఫాల్గొని ఉండవచ్చును..కాని మీరు చిన్నప్పుడు చదివిన  ఈ పాఠశాల  కోసం ఒక్క రొజు ఉండలేరా 'అని అంటాడు.

ఆ తర్వాత ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఒక సవివరమైన ఒక లేఖ అందుతుంది. దానిలో తన బాల్యం లోని అనుభవాలు,ఆ గ్రామం లోని పాఠశాల తో తనకి గల అనుబంధం అన్నీ సవివరంగా రాస్తుంది.ఈ నవల మొత్తం కూడా ఆ లేఖ మూలంగా సాగిపోతూంటుంది.ఒక్కసారిగా 1920 ప్రాంతం లోకి వెళ్ళిపోతాము.అది సోవియట్ నిర్మాణం జరుగుతున్న రోజులు.

సంచార జీవితాలు గడిపే కొందరు రైతులు ఆ ప్రాంతం లో ఒక గ్రామాన్ని నిర్మించుకుంటారు.దాని పేరే కుర్కురేవ్.ఇళ్ళు అక్కడక్కడ ఉంటాయి.వీధులేమీ ఉండవు.అలాంటి గ్రామం లో అల్తినాయ్ అనే అనాధ బాలిక ఉంటుంది.పిన తండ్రి వద్ద పెరుగుతూంటుంది.పిన తల్లి రాచి రంపాన పెడుతూంటుంది.ఆ గ్రామం లోకి డ్యూషేన్ అనే నడికారు వ్యక్తి వస్తాడు.తాను కోంసామోల్ సభ్యుడినని ,ఈ గ్రామం లో బడి పెట్టడానికి వచ్చానని చెబుతాడు.గ్రామస్తులు మొదట వ్యతిరేకించినా తర్వాత సరేనని అంటారు.ఇహ అతను అక్కడి పాడైపొయిన గుర్రపు శాలని చెమట ఓడ్చి ఒక చిన్న బడి లా చేస్తాడు.పార,పలుగు,కొడవలి చేతబట్టి పనిచేసే అతని దగ్గరకి పిల్లలంతా వస్తుంటారు.వాళ్ళు అక్కడి బయలు లోని పేడ పిడకలు అవీ ఏరుకోవడానికి వస్తూంటారు. దానిలో ఒక పిల్ల అయిన అల్తినాయ్ కి చదువు అంటే బాగా ఇష్టం.ఈ మేష్టారు కి తాను ఏరుకునే పిడకల్లో చాలా భాగం ఇచ్చి వేస్తుంటుంది..వంట కి దానికి వాడుకోమని.డ్యూషేన్ కూడా ఎంతో ప్రేమ తో తనకి వచ్చిన ఎన్నో కధలు అవీ చెబుతూ వాళ్ళకి రాయడం చదవడం నేర్పుతుంటాడు.అల్తినాయ్ కి బడికి వెళ్ళడం అంటే పండగ లా ఉంటుంది.ఎందుకంటే ఇంట్లో తల్లి దండ్రులు ఉండరు..ఇంకా లాలించే పెద్దలూ ఎవరూ ఉండరు..కాబట్టి ఆ బడి లో ఆ మేష్టారు చెప్పే ఆ పాఠాలు,ఇంకా బయటి ప్రపంచం గురుంచి చెప్పే మాటలు ఆమెని ఎంతో అలరిస్తూంటాయి.ఎప్పుడు తెలవారుతుందా ..ఎప్పుడు బడికి ఉరకాలా అని ఉంటుంది ఆ పిల్లకి..!

డ్యూషేన్ కూడా తాను చెప్పే ప్రతి అంశాన్ని ఎంతో ఘాడంగా,లీనమై చెబుతాడు..టీచర్ కి ఉండే సంప్రదాయ శిక్షణలు ఏమీ అతనికి లేవు.అలాంటివి ఉంటాయని కూడా తనకి తెలియదు.తన లక్ష్యం ఒకటే ఇక్కడున్న పిల్లలకి విద్యా గంధం అంటాలి..!వాళు చేతనైనంత పైకి ఎదగాలి.తాను ఒకప్పుడుసైన్యంలో పని చేసిన ఇంకొకటి చేసినా ఈ మాత్రం చదువు తెలియబట్టే గదా..!అతను చిన్నప్పుడే ఇంటినుంచి పారిపొయి ఎన్నో పనులు జీవిక కోసం చేసి ఇదిగో మళ్ళీ ఈ స్వగ్రామం చేరాడు..తనకి తెలిసిన నాలుగు ముక్కల్ని మళ్ళీ ఇక్కడి పిల్లలకి చెబుదామని వచ్చాడు.

ఒకసారి డ్యూషేన్ లెనిన్ గురుంచి చెప్పడం  మొదలు పెట్టాడు ..ఆ పిల్లలంతా తన్మయులై వినసాగారు.అతను చెప్పే విధానం లో ఆ పిల్లలంతా ఎంత మునిగిపోయారంటే ..ఒక పిల్ల అమాయకంగా లేచి..అడిగింది ఎంతో గౌరవం తో..!" మేష్టారండి ..మీరు లెనిన్ గారి తో ఎప్పుడైనా మాట్లాడారాండి" అని..! ఎంతో బాధపడిన వాడిలా చెప్పాడతను" లేదర్రా...నేను మాట్లాడలేదు " అంటూ.

అల్తినాయ్ కి మాత్రం ఆ బడి గోడకి ఉన్న ఒకే ఒక పటం ..ఆ లెనిన్ ది..ఆ వ్యక్తి సాక్షాత్తు మరెవరో కాదు ఈ డ్యూషేన్ మేష్టారే ..!దానికి ఓ కారణం ఉంది..ఆమె పిన తల్లి బడి మాంపించాలనే ఉద్దేశ్యం తో ఈమెని పని లో పెట్టింది.బడి మొహం చూడరాదని శాసించింది.ఓ రోజు మేష్టారే వీళ్ళ ఇంటికొచ్చి ఆ అమ్మాయిని బడికి పంపించమని కోరగా ఆమె బండ బూతులు తిడుతుంది.చివరకి పిన తండ్రి కల్పించుకొని వెళ్ళడానికి అనుమతిస్తాడు. (మిగతాది తరువాయి భాగం లో చూద్దాము)









చింగిజ్ ఐత్మతోవ్ దే మరియొక నవల "తొలి ఉపాధ్యాయుడు" గురుంచి (రెండవ మరియు చివరి భాగం)


సరే..గతం లో ఎందాకా వచ్చాము..అల్తినాయ్ అనే ఆ అమ్మాయి కుర్కురేవ్ గ్రామం లో పాఠశాల లో చదువూతూంటుంది గదా.అలా కాల క్రమం లో ఆ పదిహేనేళ్ళు వస్తాయి.ఈ అమ్మాయిని అప్పటికే బహూ భార్యలున్న ఓ వ్యక్తి కి అమ్మేసి తన బరువు తీర్చుకోవాలని పిన తల్లి ప్రణాళిక వేస్తుంది.ఆ విధంగా చిన్న వయసులో పిల్లల్ని చదువుకి పంపకుండ పెళ్ళి చేయడం ప్రభుత్వ శాసనానికి విరుద్ధమని డ్యూషేన్ మేష్టారు చెబుతాడు.అయినా ఆ పిన తల్లి లక్ష్య పెట్టకుండా కొంత మంది రౌతుల తో  వచ్చి దుడ్డు కర్ర ల తో దాడి చేసి ఆ పిల్లని బళ్ళోనుంచి తీసుకెళ్ళిపోతుంది.డ్యూషేన్ కి వళ్ళంతా రక్త సిక్తమవుతుంది ఆ దాడిని ప్రతిఘటించడం తో..!

అంతకు ముందే అతను చెబుతాడు అల్తినాయ్ కి" నేను పట్నం లో అక్కడి సంబందీకుల తో మాట్లాడాను.చక్కగా నువు అక్కడి కి వెళ్ళి చదువుకో..నిన్ను ఆటంకపరిచే వారు ఎవరూ ఉండరు లే " అని.

దానితో ఆ అమ్మాయికి పట్నం ఎలా ఉంటుందో తెలియకపోయినా  ఆ జీవితాన్ని ఊహించుకోడానికి డ్యూషేన్ మాటలు  చాలినాయి.మర్నాడు ఒకటే ఆలోచన.పట్నం లో ఎలా ఉంటానో ,ఎవరింట్లో ఉంటానో ..అని..!ఎవరైనా సరే నన్ను వారింట్లో ఉండనిచ్చితే చాలు..వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తా ..పొయ్యి లోకి పుల్లలు చీరతా,నీళ్ళు మోస్తా ,గుడ్డలు ఉతుకుతా,ఏ చాకిరి చేయమన్నా చేస్తా..." ఇలా ఊహించుకుంటూ బళ్ళో కూచునుండగానే గుర్రపు డెక్కల శబ్దం హఠాత్తుగా ప్రతి ధ్వనించింది.ఆమె పిన తల్లి మరో ఇద్దరు వ్యక్తులు మేష్టారి పై  దాడి చేసి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోయారు.

కొన్ని రోజుల్లోని ఆశ పెట్టిన వ్యక్తి తో ఆమె కి మొదటి రాత్రి జరిపించింది.నలుగురు భార్యల్లో ఒకరి గా రోజులు భారంగా గడప సాగింది.ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వాత తలకి తగిలిన గాయాలకి కట్లు కట్టుకొని డ్యూషేన్  ఇద్దరు మిలీషియా జవాన్ లతో ఊళ్ళోకి వచ్చాడు.ఆమె ని ఆ కసాయి నుంచి విడిపించి రైలు స్టేషన్ దాకా  తీసుకొచ్చాడు." అల్తినాయ్ ..నిన్ను ఆ రోజు రక్షించలేకపోయాను..క్షమించు " అన్నాడు డ్యూషేన్.ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది.

"సంభాళించుకో అల్తినాయ్ ...నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను పట్నం  లో...ఇక ముందర ఉన్న భవిష్యత్ అంతా నీదే..మరి ఇదే నీకు వీడ్కోలు..శుభం..క్షేమంగా వెళ్ళిరా ,నా తల్లీ ..నా ఉజ్వల తార..ఏం భయపడకు..ధైర్యం వహించు"  అంటూ అనునయించాడు.

అల్తినాయ్ ని ఎక్కించుకొని రైలు సాగిపోతూన్నది.కనుమరుగు అయ్యేదాకా అలా చూస్తూనే ఉన్నారు ఇరువురు.ఒక టన్నెల్ గుండా రైలు ప్రవేశించిది.ఇప్పుడు తన గ్రామం మొత్తం కనుమరుగైంది..కజాహ్ సైప్ మైదానాల వెంట ఆమెని నూతన జీవితానికి కొని పోయింది.

" మేస్టారు...మీ కిదే వీడ్కోలు,నా తొలి పాఠశాల నీకిదే వీడ్కోలు,నా లోనే దాచుకున్నా నా తొలి వలపా నీ కిదే వీడ్కోలు "  ఆమె హృదయం లో అనుకున్నది.

*  *  *
ఆ తర్వాత అల్తినాయ్ డ్యూషేన్ కలలు గన్న విశాల గవాక్షాలు గల విద్యాలయాల్లో చదువుకున్నది. కార్మిక ఫేకల్టీ గా పని చేసింది.మాస్కో యూనివర్శిటి నుంచి తత్వ శాస్త్రం లో డాక్టరేట్ పొంది ..అకడమీషియన్ గా ఎన్నో పత్రాల్ని వివిధ విశ్వ విద్యాలయంలలో సమర్పించింది.

ఆ తర్వాత కొన్ని ఏళ్ళకి తన స్వగ్రామం వస్తుంది..ఊరి రూపు రేఖలు అన్నీ మారిపోయి ఉంటాయి.వీధులు కొత్తవి వెలుస్తాయి.మనుషులు అంతా కొత్తగానే ఉన్నారు.ఎవరో కొంతమంది తప్ప.అప్పటి పాఠశాల వద్దకి వెళ్ళింది..ఆ రోజుల్లో డ్యూషేన్ మేష్టారు తో కలిసి నాటిన ఆ పోప్లార్ మొక్కలు ఈ రోజున మహా వృక్షాలు అయిపోయినాయి.కాల ప్రవాహం లో అక్కడ ఎంత నీరు పారిందో గదా అనుకున్నది అల్తినాయ్.డ్యూషేన్ గురుంచి ఆ ఊరి లో తారసపడిన ప్రజల్ని అడగ్గా అలాంటి వ్యక్తి తామెవరికి తెలియదని సమాధానమిస్తారు.

ఆ తర్వాత మాస్కో కి వచ్చేస్తుంది.పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని హాయిగా జీవితం గడుపుతున్నది.అయితే మరో సందర్భం లో  ఆ ఊరి లోని పునర్నిర్మాణపు  పాఠశాల కి అథితి గా హాజరైనపుడు పోస్ట్ మేన్ రూపం లో వృద్ధుని గా డ్యూషేన్ మేష్టారు దర్శనమిస్తాడు.ఆ చివరన ఏం జరిగింది..అదంతా ఎవరికి వారు చదివితేనే బాగుంటుంది.ఉప్పల గారి తెలుగు అనువాదం  చాలా హాయిగా సాగిపోతుంది.ఇంగ్లీష్ నుంచే వారు తెనిగించి ఉండవచ్చును..ఇంగ్లీష్ లో ది మక్కీ కి మక్కీ కాకుండా ఆ భావ సౌందర్యానికి అతి దగ్గరగా  ఉండేలా రాశారు.వారి కృషికి వందనాలు. చక్కటి పదాలు ఎంతో తూచి మూల రచయిత యొక్క ఆత్మకి న్యాయం చేశారు.దీని ఆంగ్ల అనువాదం ,తెలుగు అనువాదం రెండూచదివే అవకాశం నాకు కలిగింది.






కిర్గిజ్ స్తాన్.. ఒక రచయిత వల్ల ఆ ప్రాంతం కి,ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఇంకా గుర్తింపు 


కిర్గిజ్ స్తాన్.. ఒక రచయిత వల్ల ఆ ప్రాంతం కి,ఆ సంస్కృతికి కలిగిన మర్యాద ఇంకా గుర్తింపు అది అలా కొనసాగుతూనే ఉన్నది.ఈపాటికి అది ఎవరో కాదు చింగీజ్ ఐత్మతోవ్ అని గుర్తించి ఉంటారు.చంగీజ్ ఖాన్ మీద గల అనురక్తి తోనే ఆయన తల్లి దండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టడం జరిగింది.తల్లి కిర్గీజ్ తెగ కి తండ్రి తార్తార్ తెగ కి చెందిన వారు.ఈ రెండు తెగల యొక్క ఉత్తమ లక్షణాలు చింగీజ్ ద్వారా పురి విప్పుకున్నవని చెప్పవచ్చు.

ఆయన రచనల్లో కనిపించే కుర్కురేవ్ గ్రామం,ఆ వొడ్డునే ప్రవహించే నది,పర్వతమయమైన ప్రాంతాలు,స్టెప్పీలు,అక్కడి ఆచారాలు ,జానపద గాధలు ,సంచార జీవనం లోని ఒడిదుడుకులు ఇలా అవన్నీ స్వయంగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి చెందినవే..తొలి ఉపాధ్యాయుడు ,జమీల్య లో కనిపించే ఆ కుర్కురేవ్ లోనే ఆయన తండ్రి జన్మించింది.1928 లో సేకార్ అనే కిర్గీజ్ గ్రామం లో చింగిజ్ జన్మించినా చిన్నతనం నుంచి సంచార తెగ ఆనవాయితీ ప్రకారం అనేక ఊళ్ళు పట్టుకు తిరిగాడు కుటుంబం తో..!

ఆయన తన తొమ్మిదవ యేటనే అతని తండ్రి ఉరి తీయబడ్డాడు.కిర్గిజ్ తెగ లోని వారికి  స్వ ప్రాంతం పై  ఆపేక్ష చింగీజ్ నవలల్లో అంతటా కనిప్స్తుంది.ప్రతి చిన్న పాటని,అక్కడ పెరిగే ప్రతి మొక్కని అతను ఎరుగును అనిచెప్పవచ్చు.అంతే కాదు జంతువుల పట్ల మమకారం కూడా..అలాగే కనిపిస్తుంది.ఒక గుర్రం,ఒక మనిషి మాత్రమే పాత్రలు గా పెట్టి ఆయన ఒక నవల రాశాడు.

తొలి ఉపాధ్యాయుడు లో ఒక సన్నివేశం ఉంటుంది.ఒక రాత్రి ..మంచు వర్షం పడుతున్న చీకటి లో అడవి దారి గుండా డ్యూషేన్  ..ఓ గుర్రం మీద వస్తుండగా ..  రాత్రి లో ఉన్నట్టుండి తోడేళ్ళు గుంపు అతని వెంబడించి గుర్రాన్ని చంపడమూ..ఆ శబ్దాల్ని ..ఇంట్లో పడుకున్న చిన్న పిల్ల వింటూ ..భయం తో మునగదీసుకొని పడుకొని ఏడుస్తూండటం... అంతలోనే డ్యూషేన్ తప్పించుకొని గుడిసె లోకి వచ్చి రైఫిల్ ఉంటే ఇమ్మని అడగడమూ...ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా కళ్ళకి కట్టినట్లు రాస్తాడు.అలాంటి కఠినమైన జీవన ధార నుంచి వచ్చిన మనిషి మాత్రమే అంత చక్కగా రాయగలడు.

చింగీజ్ యొక్క రచన లో ఒక కవితాత్మ అంతర్లీనంగా కనిపిస్తుంది.అయితే అది వాస్తవానికి చాలా సమీపంగా ఉంటుంది.స్వతహాగా కమ్యునిష్ట్ అయినప్పటికి సోవియట్ లోని కొన్ని చేదు నిజాల్ని వెల్లడించడం లో వెనుకడుగు వేయలేదు.The Scuffold (1988) లో డ్రగ్ ప్రేరిత  నేర ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.The first teacher,Farewell Gulsary,The white ship,The dreams of a she-wolf  ఇలా ఎన్ని నవలలు ,ఇంకా అనేక కధలు రాసినా Jamila తోనే ఆయనకి విశ్వ ఖ్యాతి వచ్చింది.ప్రపంచం లోని ప్రేమ కధల్లో అత్యుత్తమమైనది అని ప్రశంసలు పొందింది.సినిమాలు గా కూడా ఆయన రచనలు రూపు దాల్చాయి.

కిర్గిజ్ భాషలోను, రష్యన్ లోను సమానమైన ప్రతిభ తో రాయగలిగేవాడు.మొదట్లో కిర్గిజ్ లో రాసినా ఆ తర్వాత రష్యన్ భాషలో రాయడం మొదలు పెట్టాడు.సైన్స్,తాత్విక ధోరణుల తో కూడిన The day lasts more than a hundred years ని ఆయనే సినిమా గా రూపొందించాడు.టర్కీ ప్రభుత్వం తమ భాషనుంచి చింగీజ్ ఐత్మతోవ్ ని నోబెల్ బహుమతికి సిఫారసు చేసింది.యూరోపియన్ యూనియన్ కి,యునెస్కో కి,నెదెర్లాండ్స్ కి,బెల్జియం కి కిర్గిజ్ స్తాన్ తరపున రాయబారిగా పనిచేశాడు.గ్రామ కార్యదర్శికి సహాయకునిగా,గోధుమ క్షేత్రం లో రైతుగా, పశువుల ఆసుపత్రి లో ఉద్యోగి గా,పశువుల కాపరి గా ,ప్రావ్దా పత్రిక కి విలేకరి గా ఇలా ఎన్నో పనుల్ని తన జీవిక కోసం చేసిన ఆయన వాటన్నిటి ద్వారా ఆయా జీవిత అనుభవాలు పొంది పరి పూర్ణ రచయిత గా ఆవిర్భవించి ప్రపంచం లోని ఎన్నో హృదయాల్ని ఇప్పటికి అలరిస్తూనేఉన్నాడు.జర్మనీ లో చనిపోయినప్పటికి అతని అంతిమ కోరిక మేరకు కిర్గిజ్జ్ స్తాన్ లోని స్వంత గ్రామం లో ఆయన తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.పరవస్తు పరమేశ్వర్ గారు తన సిల్క్ రూట్  యాత్ర పుస్తకం లో ఈ సమాధుల్ని దర్శించుకున్నట్లు రాశారు. ఆయన రచన ల్లో కనిపించే ఆ పోప్లార్ చెట్లు ఆ చుట్టు పక్కల మొత్తం ఉన్నట్లు రాశారు.Click here







మనోజ్ దాస్ నిజంగా సవ్యసాచి అనే చెప్పవచ్చు.



మనోజ్ దాస్ నిజంగా సవ్యసాచి అనే చెప్పవచ్చు.ఒరిస్సా రాష్ట్రానికి చెందిన  ఆయన ఇటు మాతృభాష ఒడియా లోను,అటు ఇంగ్లీష్ లోనూ సమానంగా రచనలు చేసి అంతర్జాతీయంగా తన సృజనకి ఒక అరుదైన గౌరవాన్ని కల్పించుకున్నారు.దక్షిణాది లో ప్రముఖ  ఇండో ఆంగ్లికన్ రచయిత గా పేరు తెచ్చుకున్న ఆర్.కె.నారాయణ్ తన మాతృ భాష తమిళం లో రాసినట్లు గా నాకు అయితే తెలియదు.కాని ఇద్దరూ స్వాతంత్ర్యానికి ముందు జన్మించిన వారే.ఇంగ్లీష్ వారి వద్దనో లేదా వారి వద్ద అభ్యసించిన వారి వద్దనో చదువు నేర్చుకున్నవారే అని చెప్పవచ్చు.ఒక మనిషి తన మాతృ భాష లో రచన చేస్తూనే ఇంగ్లీష్ లో కూడా రచన చేస్తూ ఎన్నిక కావడం మనోజ్ దాస్ వల్లనే అయింది అని చెప్ప వచ్చు.ఆ తరువాత ఆయన ఒరవడి లో అనేక మంది ప్రయత్నించినా మనోజ్ దాస్ గారి నడత ఏ  వేరు.విశేసించి ఆయన ఉదాహరణ వల్ల నో ఏమో గాని ఆ భాష లో అనేకమంది ఇండో ఆంగ్లోకన్  రచయితలు ఉద్భవించారు.ఒక సీతా కాంత్ మహా పాత్ర,సరోజినీ సాహూ,ఇట్లా అనేకమందిని చెప్పవచ్చు.


ప్రముఖ భారతీయ ఇండో ఆంగ్లికన్ రచయితల్లో మొదటి ఫంక్తి లో వినబడేది మనోజ్ దాస్ పేరు అని చెప్పవచ్చు.ఒరిస్సా లోని బాలాసోర్ జిల్లా  లో శాంఖరి అనే గ్రామం లో 1934 లో  ఆయన జన్మించారు. తాను చదువుకునే రోజుల్లోనే దిగంతిక అనే పత్రికని వెలువరించారు.మొత్తం మీద 80 గ్రంధాల్ని వెలువరించారు.ఆయన రచనలు ంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి.పద్మశ్రీ  నుంచి సరస్వతి సమ్మాన్ దాకా ఆయన అందుకున్న పురస్కారాలకి లెక్క లేదు.ఒరియా వాసులకి ప్రియ పుత్రుడు.

మనకి గురజాడ లో కూడా అలా ఇంగ్లీష్ లోనూ,తెలుగు లోనూ రాయగల ఒక ఈజ్ కనిపిస్తుంది..ఆయన మొట్ట మొదట ఆంగ్లం లో రాసిన పద్యాలనూ,ప్రోజ్ ని చూసినప్పుడు..ఎందుకనో ఆ తర్వాత ఆయన తెలుగు కే పరిమితమయినారు.ఆయనే గనక రెండు భాష ల్లో ముందుకు పోయినట్లయితే మనకి తెలుగు గడ్డల మీద ఈ ద్విభాషల్లో పేరెన్నిక గన్న రచయితలు ఉండేవారు.ఒక సంప్రదాయం అలా కొనసాగేది.

సరే...మనోజ్ దాస్ రాసిన కొన్ని కధల్ని ఇక్కడ ముచ్చటిస్తాను.భారతీయ ఉద్వేగాల్ని ఇంగ్లీష్ లో పండించటం లో దాస్ యొక్క రీతి ఏ వేరు.ఒరియాలో ఉంటే చదవడం నా తరమా..?ఆయన రాసిన ఓ కధ Farewell to a Ghost గురుంచి ముచ్చటిస్తాను.ఒరిస్సా రాష్ట్రం లోని ఒక గ్రామం లో ఈ కధ జరుగుతూంటుంది.ఉత్తమ పురుష లో కధ సాగుతూంటుంది.It was on moonlit nights that deserted villa looked particularly fascinating...అంటూ కధ మొదలవుతూంది.ఆ గ్రామం లో ఒక పెద్ద పాత భవంతి..ఎప్పుడో ఫిరంగులు కట్టి వదిలేసింది..మా చిన్నప్పుడు దాని గురుంచి ఎన్నో కధలు చెప్పుకుంటూ ఆటలాడుకునేవాళ్ళం.దానిలో ఓ ఆడ దయ్యం ఉంటుందని..ఒకానొక సమయంలో ఒక యువకుడు దాన్ని చూడాలని వెళ్ళి బలి అయ్యాడని...ఇట్లా.ఉన్నట్లుండి దాన్ని తీసి వేయాలని వేరే నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.అప్పుడు ఎలా శాంతిచేస్తారు..ఎలా ఆ దయ్యానికి పునరావాసం కల్పిస్తారు..కాల గమనం లో ఆ ఊరి పిల్లలు ఆ సంఘటనని ఎలా మరిచి పోతారు..ఇలా సాగి పోతుంది కధ.మనోజ్ దాస్ యొక్క శైలి సరళంగా ఉంటుంది.తిక మక ఉండదు.కధ చదివిన తర్వాత ఆ గ్రామం లోనే మనం ఉన్నట్లు అనిపిస్తుంది.వర్ణన అంత హాయిగా ఉంటుంది.


ఆ తర్వాత The General అనే కధ.ఒక చిన్న పట్టణం లో స్థిరపడిన ఓ మిలటరి అధికారి నాటకాల ధ్యాస లో పడి ఎలా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరణిస్తాడో వ్యంగ ధోరణి లో చెబుతాడు.గమ్మత్తు గా నూ ,విచారం గానూ అనిపించే కధ ఇది.దాస్ తన పాత్రలు అన్నిటిని మనకి నిత్య జీవితం లో కనిపించే సంఘటనల నుంచే తీసుకుంటాడు.అందుకనే ఆ పాత్రల భాషణల్ని సైతం మనం అనుభూతించుతాము. అసలు నిజంగా ఆలోచిస్తే స్థానిక భారతీయ భాషలకి పోటీ గా నిలిచేది..హింది లేదా దక్కనీ ఉర్దూ నే..కానీ అవి దేశీయం అనే నెపం తో వాటిని సహిస్తాము..భారతీయుల సైకాలజీ గమ్మత్తు గా ఉంటుంది కొన్ని విషయాల్లో...మళ్ళీ వచ్చే దాని లో ఇంకా కొన్ని కధల్ని ముచ్చటించుకుందాము.






దోస్తొవిస్కి రాసిన నవల "Crime and Punishment" 

దోస్తొవిస్కి రాసిన నవల "Crime and Punishment" చదువుతూ ఓ రెండు వందల పేజీలు చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.ప్రసిద్ధ రష్యన్ రచయితల్ని చదవడం నేను కొద్ది గా లేటు గానే మొదలెట్టాను.ఈ రష్యన్ నవలని మొత్తానికి ఇప్పటి దాకా ఆరుగురు అనువాదకులు ఇంగ్లీష్ లోకి అనువదించారు.నేను కొన్న ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు.అనువాదకుల పేరు కనబడలేదు..గాని ధనంజయ సింగ్ అనే ప్రొఫెసర్ ముందు మాట రాశారు. రిచర్డ్ పెవియర్ ఇంకా లారిస్సా వొల్ఖొస్కి అనే వారి లో ఏ ఒక్కరిదైనా అనువాదం  అయి ఉండవచ్చు.ఈ పుస్తక ఇంగ్లీష్ అనువాదం ఎక్కడా మనల్ని ఆపదు...తీసుకొని అలా ముందుకు తోసుకుంటూ పోతుంది.కొన్ని చోట్ల రష్యన్ భాషలోని పలుకుబళ్ళు,ఊత పదాలు,భాషలోని వ్యక్తిత్వం లీలగా అవుపడుతుంది.

సరళమైన ,అందమైన భావ స్ఫోరకమైన ఇలాంటి పద్దతి లో మన తెలుగు నవలలు ,కధలు తెలుగేతర పాఠకుల కోసం అనువాదం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది.రష్యన్ల యొక్క ఆ పేర్లు మాత్రం కొంత గట్టిగానే గుర్తు పెట్టుకోవాలి.లేదా గందరగోళమే..!హీరో పేరు ని ఓ చోట Rodya అని,Rodian అని Roskolnikov అని వస్తూంటుంది.ఆయన పూర్తి పేరు Rodion Romanovich Roskolnikov అన్నమాట. 1866 ప్రాంతం లో రాయబడ్డ ఈ నవలని కొద్దిగా ఓపిక తోనే చదవాలి.పీటర్స్ బర్గ్ లో  లా చదువుతున్న హీరోకి అతని తల్లి రాసిన ఉత్తరం రమారమి అయిదు పేజీలు ఉంటుంది.అంతా మన సమాజం లోని మధ్య తరగతి కుటుంబం మాదిరిగానే ఉంటుంది..." My dear Rodya..It's two months since I last had a talk with you by letter which has distressed me and kept me awake at night...you know how I love you..you are all we have to look to,...our one hope..our one stay..how could I help you out of my hundred and twenty roubles a year pension.. అంటూ ఆమె కుదువబెట్టిన వస్తువుల సంగతి కూతురు ని ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోబోఏ  సంగతి...ఆమె పనికి వెళ్ళిన చోట కలిగిన చేదు అనుభవాలు...అలా చెప్పుతూ పోతుంది.ఆ ఉత్తరం చదివి హీరో పాత్రకి బాగా కోపం వస్తుంది.ఒకప్పుడు తమని చులకన చేసిన ఆ లూషన్ అనే వ్యక్తిని చెల్లెలు పెళ్ళి చేసుకుంటూందని..కాని ఏం చేయగలడు..తను ఇక్కడ  ఉంటూ చదివేదే వాళ్ళ సహాయం తో..అలాగని ఊరికినే ఉండలేడు..అక్కడ ఆ సంఘర్షణని రచయిత బాగా వర్ణిస్తాడు.

ఒక Tavern లోకి పోయినప్పుడు Marmeladov అనే త్రాగుబోతు పరిచయం అవుతాడు.అతను తన గాధని అంతా హీరోకి బలవంతం గా వినిపిస్తాడు.చాలా దీనంగా ఉంటుంది..ఆ చెప్పే విధానం.ఈ పాత్ర గుర్రాల తొక్కిడివల్ల ఓ రోడ్డు మీద మరణిస్తుంది.హీరో అతన్ని ఇంటికి చివరి క్షణాల్లో తీసుకు వెళతాడు.  ఆ భార్య Katerina Ivanova ..మొదడి భర్త పోవడం తో ఇతణ్ణి చేసుకుంటుంది.ఒక ఇంట్లో ఉన్న ప్పటికి సరైన అనుబంధం ఉండదు.అది ఒక ఎపిసోడ్.

హీరో Roskolnikov కి ధనవంతులై వడ్డీ వ్యాపారం  చేస్తూ  అందరి వస్తువుల్ని తాకట్టు పెట్టుకునే  ఇద్దరు సోదరీమణుల్ని  హత్య చేయాలనిపించి ఒక గొడ్డలిని కోటు లో దాచుకుని వెళ్ళి హత్య చేస్తాడు. ఆ తర్వాత అతను మానసికంగా చాలా వ్యధ చెందుతూంటాడు.హత్య దగ్గర కొంత డబ్బు దస్కం తీసుకుని వచ్చేస్తాడు..కాని ఖర్చు పెట్టుకునే సుఖం కూడా ఉండదు..చివరికి కొంత చనిపోయిన తాగుబోతు కుటుంబానికి ఇస్తాడు.పులి మీద పుట్ర లా ఇతణ్ణి అనుమానించే వారు కొందరు.పిచ్చి ఎక్కి పోయి న స్థితి లోకి నెట్టబడతాడు.అలా సాగుతూన్నది ప్రస్తుతం.

డైలాగులు కోసం డైలాగులు రాసినట్లుగా ఉండదు ఎక్కడ....కధ ని నడపడం లో దొస్తోవిస్కి తీరు ప్రత్యేకమైనది. అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అమోఘం.లియో టాల్స్ టాయ్,నీషే,సార్త్రే,చెకోవ్ హెమింగ్ వే లాంటి ఎందరో రచయితల్ని ఇన్స్ పైర్ చేసిన దోస్తొవిస్కి  పోకడ లో ఒక విశిష్టత ఉన్నది. రష్యన్ రచయితలు గావచ్చు..ఇతర యూరపు దిగ్గజ రచయితలు కావచ్చు..వారి జీవితాల్లో ఉన్న గొప్ప వైవిధ్యాలు  వారి రచనల్లో తొంగిచూసినవా అన్నట్లుగా ఉంటాయి.ఏదో ఒక కారణంగా రాజ్యం యొక్క ఆగ్రహానికి గురయి జైలు శిక్ష అనుభవించడం గాని..లేదా యుద్ధాలలో  ప్రత్యక్షంగా ఫాల్గొనడం గాని...తీవ్రమైన వ్యసనాలకి లోబడి పైకి తేలిన వారు గాని, ఇట్లా నలగగొట్టబడిన వారు ఎక్కువగా కనిపిస్తారు.అందుకనేనేమో పాత్రలు జీవం పోసుకుని ఉన్నట్లుగా ..నిజంగా మనం ఎక్కడో చూసిన వాళ్ళ లాగా ఉంటాయి.

దీనిలో ఒక తాగుబోతు పాత్ర ఉంటుంది...ఒక మనిషి తీవ్రమైన డిప్రెషన్ లో ఉండి తాగి నప్పుడు మాట్లాడే విధానం  ..ఒక్క వాక్యం కూడా కృతృమత్వం గా  ఉండదు..ఎంత నిశిత పరిశీలన..అనిపిస్తుంది.అలానే మిగతావి.170 భాషల్లోకి దోస్తొవిస్కీ అనువదింపబడినాడు.





Albert Camus-ఆయన చేసిన యోచనలు


ఈ మానవుని అస్తిత్వానికి ఏమైనా అర్ధం ఉన్నదా,జీవుల చర్యల్ని పరిపాలించే అత్యున్నత వ్యవస్త ఏదైనా ఉందా,అంతిమ తీర్పు వంటిది ఏమైనా ఉందా ..ఇట్లా అనేక ప్రశ్నల ద్వారా లొలోపల మధనపడి తనదైన పద్ధతి లో రచనలు చేసిన Albert Camus కొన్ని భావ పరంపల్ని ప్రపంచం ముందు ఉంచి వెళ్ళాడు.మనిషి జీవితం కొనసాగుతున్నది రేపు ఉన్నది అనే ఆశ మీదనే..ఆయితే ఆ రేపు అనేది ఒక రకంగా తనకి శత్రువు కూడా ..ఎందుకంటే దాని లోనే అతని మరణం కూడా ఉంటుంది.అయితే మనిషి కి తన మరణం గురించి  సరైన ఎరుక ఉండదు..హేతు బద్దత గాని సైన్స్ గాని ఈ ప్రపంచం అనే చిక్కుముడిని విప్పవు.అలా ప్రయత్నించడం కూడా వృధా ప్రయాస.

ఈ విధంగా  The Myth of Sisyphus అనే వ్యాసం లో ఆయన చేసిన యోచనలు Absurdism అనే దారికి సాహిత్య లోకం లో స్థానం కల్పించాయి.ఒక గ్రీక్ పౌరాణిక పాత్ర తో ఇది సాగుతుంది.అసలు Absurdism అంటే ఏమిటి...ఏ అర్ధమూ లేని ఓ గందర గోళ ప్రపంచం లో మనిషి జీవితం వ్యక్త పరచబడి ఉన్నది అని నమ్మే ఒక దారి. సాత్రె యొక్క Individual existence  అనే యోచన గాని,Kierkegaard అనే మతపరమైన కొన్ని నమ్మకాలు సత్యాన్ని దూరం చేస్తున్నవని అనే యోచన గాని Albert Camus చేసిన యోచనకి కొద్ది తేడాలతో ఒకే లా ఉంటాయి.అత్యంత సూక్ష్మ పరిశీలన,అనుభూతి అవసరం ఇక్కడ..!

1913 నుంచి 1960 మధ్య కాలం లో జీవించిన ఫ్రెంచ్ రచయిత Albert Camus  ప్రపంచం లో అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందిన వ్యక్తి..44 వ ఏట ఈయన దానిని పొందగా Rudyard Kipling 42 వ ఏట పొందాడు.వ్యాసాలు,కధలు,లేఖలు,నవలికలు వీటన్నిటి ద్వారా Albert Camus తన భావ జాలాన్ని పరిచి వెళ్ళాడు. A Happy death,The Stranger  వంటి రచనలు బాగా ప్రసిద్ది పొందాయి.The First Man అనేది ఆయన ఆత్మకధ.

కొద్దిగా The Stranger గూర్చి చెప్పుకుందాము.ఇంచుమించు 77 పేజీలు ఉంటుందిది.Meursault ప్రధాన పాత్రధారి.అతను అల్జీర్స్ లో ఓ కంపెని లో ఉద్యోగం చేస్తూంటాడు.తల్లి మరణించినట్లు ఒక రోజు తంతి వస్తుంది.ఊరికి బయలు దేరుతాడు.బస్సు లో ఎక్కి కూర్చుని నిద్రలో జోగుతున్న  ఇతణ్ణి చూసి పక్కనే ఉన్న సైనికుడు అడుగుతాడు.ఏమిటి విషయం..దూరం నుంచి వస్తున్నావా..అని.!తల్లి పోయిన సంగతి..తంతి విషయం చెబుతామని అనుకుని ఆగిపోయి ..ఊ ..అని చెప్పి నవ్వి ఊరుకుంటాడు.ఆమె ఒక వృద్ధాశ్రమం లో పోయింది గదా ...అక్కడికి వెళతాడు..చివరి సారి శవం ని చూస్తారా ..కాఫిన్ మూత తీయనా అని చెప్పి అక్కడి వాళ్ళు అడగ్గా ..వద్దు అంటాడు.అలాగే నిశబ్దం గా కూర్చుంటాడు.సిగరెట్ కాల్చుకుంటూ.అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండవు..ఆమె మీద...ప్రేమ లేదా ద్వేషం ఏదీ వ్యక్తపరచడు.ఏ మనిషి అయినా పోవలసిందే గదా దానికి ఎవరూ ఎవరికోసం చింతించనవసరం లేదు అని అతని భావన.ఆ హోం లోనే కొంతమంది వ్యక్తులు పరిచయమవుతారు.వాళ్ళంతా అతని తల్లి గూర్చి మంచిగా చెబుతారు.దానిలో అతని తల్లి యొక్క యొక్క ప్రేమికుడు ఉంటాడు.సెలవు తీసుకుని  బయలు దేరుతాడు..యజమాని అడుగుతాడు..ఏమిటి ఇంత త్వరగా వచ్చావు..ఆమె వయసు యెంత ..అని.బహుశా అరవై అలా ఉండవచ్చు అని తన పనిలో మునిగిపోతాడు.ఆ తెల్లారి అతని ప్రియురాలు తో ఆనందం గా గడుపుతాడు.ఇట్లా జీవితానికి ఎక్కువ అర్ధం వెదకకుండా జీవిస్తుంటాడు అతను.కిటికి పక్కనే నిలబడి కిందన వస్తూ పోయే మనుషుల్ని గమనిస్తూ ఒక సాక్షి లా ఉండటాన్ని కొన్ని పేజీల్లో వర్ణిస్తాడు.చివరికి ఇతను ఒక అరబ్ ని చంపిన కేసు లో జైల్లో వేస్తారు.చావు కోసం ఎదురు చూస్తూండగా కధ అయిపోతుంది.ఈ రచన లో వివిధ సంకేతపరమైన పద్దతి లో అంశాలన్నీ నడుస్తూంటాయి. సంభాషణలు గాని,పాత్రల నడవడిక గాని ఒక లోతైన తాత్వికతని ఒక చిన్న తేనె పోసిన కధ ద్వారా చెబుతాడు.




ఎర్నెస్ట్ హెమింగ్వే నవల The old man and the sea...గురించి కొన్ని మాటలు !


మహోన్నతంగా నిలిచిపొయిన అనేక రచనలు చూసినట్లయితే దాని వెనుక ఆ రచయితల యొక్క జీవిత అనుభవాలు లీల గా తొంగి చూస్తుంటాయి.కొన్ని పాత్రల ద్వారా మరీను..ప్రవర్తనలు,వారి ఆదర్శాలు,ప్రభావాలు అన్నీ కలగలిసి కొన్ని కొత్త లోకాలకు మనల్ని తీసుకుపోతుంటాయి.అవి ఆ తర్వాత ఎంతోమందికి స్పూర్తి నిచ్చి మరింత ముందుకు కొనిపోతాయి. అమెరికన్ రచయితల్లో తనదైన ముద్ర తో పాఠకుల్ని అలరించిన ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన నవలల్లో చాలా ప్రత్యేకమైనది The old man and the sea.1954 లో ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చేటప్పుడు దీని ప్రాశస్త్యాన్ని కమిటీ వారు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది.ఇంతకీ ఏమున్నది దీని లో..ఇప్పుడు కొద్దిగా చూద్దాము.మనిషికి ప్రకృతికి మధ్య  జరిగే పోరాటాన్ని సింబాలిక్ గా చెప్పడం జరిగింది.అదీ చాలా తక్కువ పాత్రలతో.నిజానికి ఒక్క పాత్ర నే బాగా కనిపిస్తుంది.

Santiago  అనే ముదుసలి వ్యక్తి ..అతను క్యూబా కి వచ్చి అక్కడి సముద్ర తీరం లోని ఓ గ్రామం లో నివసిస్తూ చేపలు పడుతూంటాడు.దాని లో మంచి ప్రావీణ్యం ఉన్న వాడు.అతనే ఈ నవలని అంతా నడిపించే హీరో.Manolin ఓ చిన్న కుర్రాడు    చేపలు పట్టే కళ లో పట్లు నేర్చుకుండానికి  Santiago దగ్గర చేరుతాడు.అంటే ఇతని తల్లిదండ్రులు చేర్చుతారు.వీళ్ళిద్దరకి మధ్య వయసు తేడా బాగా ఉన్నప్పటికి మంచి మిత్రులు అవుతారు.అదేమి దురదృష్టమో గాని ఇద్దరూ కలిసి 84 రోజులు వేటకి వెళ్ళినా ఒక్క చేపా పడదు.దానితో Manolin తల్లిదండ్రులు అక్కడినుంచి పని మానిపించి వేరే అతని దగ్గరకి పంపిస్తారు.ముసలాయన బాధ పడతాడు..ఒక రోజు ఆ కుర్రాడితో ఈ 85 వ రోజున నేను సముద్రం మీదికి వెళుతున్నాను..చాలా లోపలికంటా వెళతాను ఈసారి  అని చెపుతాడు.ఆ కుర్రాడు అతని పడవలోకి కావలసిన అన్ని సామాన్లు అంటే..మోకులు,కత్తి,హార్పున్లు ఇలాంటివి అన్ని చేర్చి ఆ ముదుసలికి వీడ్కోలు చెపుతాడు సముద్రం లోకి వెళ్ళడానికి..!

ఇహ ఆ తర్వాత నుంచి కధ ప్రారంభం అవుతుంది.ఆ కుర్రాడి పాత్ర మొదటి రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది.మళ్ళీ కొద్దిగా చివరి లో..!ఆ ముదుసలి సముద్రం లో ప్రయాణించే తీరు,అతని బాల్యం,యవ్వనం అన్నీ మనకి సందర్భోచితంగా కధ ముందుకు పోతున్న కొద్ది తెలుస్తుంటాయి.అతను ఒక్కడే ఆ సముద్రం లో అత్యంత దూరం వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.అతను తన దగ్గర పని చేసిన ఆ కుర్రాణ్ణి తలుచుకున్నప్పుడు తన బాల్యమూ,ఇంకా శారీరక బలము ఇలా గుర్తుకు వస్తుంటాయి.ఇప్పుడు తను ముదుసలి అయినప్పటికి  ఆ రోజుల్లో తాను చేసిన సాహస కృత్యాలు గుర్తుకు వచ్చి తాను ఎప్పటి పోరాటశీలినే అని  సమర్ధించుకుంటాడు.

అలా పోగా పోగా  ..మొత్తానికి ఒక పెద్ద చేప కనిపిస్తుంది.దానికీ పేరుంది.Marlin అన్నమాట.గేలం వేస్తాడు..దానికి చిక్కుతుంది.అది ఊరుకుంటుందా తప్పించుకుండానికి తెగ ప్రయత్నిస్తుంది.పైగా దాని మొత్తం రూపం అప్పుడప్పుడు పైకి ఎగిసినప్పుడల్లా కనిపించి ఆ ముదుసలి ఆశ్చర్యపోతాడు.తన జీవితం లో ఇంత పెద్ద చేపని చూడలేదు.తన పడవకంటే కూడా పొడవుంది.అది తన పట్టుకి చిక్కినట్లే చిక్కి తెగ ఆరాటపెడుతోంది.తన పడవని కూడా అతలా కుతలం చేస్తున్నది. కాని తాను అంత తొందరగా వదులుతాడా..?అలా ఆ చేప ఆ ముదుసలి రెండు రోజుల పాటు ఆ సముద్రం మీదనే ఒకరిని ఒకరు చంపుకోవాలని ప్రయత్నిస్తుంటారు.తను నిద్ర పోయినప్పుడల్లా ఒక్క కుదుపు తో చిక్కాకు చేస్తుందది..ముదుసలి కూడా తన అనుభవాన్ని అంతా రంగరించి కత్తి తోను,మోకులు తోను ఆలంబంగా చేసుకొని పోరాడుతున్నాడు. అతని కంటికి ,చేతికి కూడా  గాయాలయ్యాయి..ఆ చేప విసిరే మొప్పల దెబ్బలకి..! ఆ ముదుసలికి నివ్వెరమనిపించిది..ఆహా సృష్టి లో ప్రతి ప్రాణికి ఎంత సమర శీలత..అని అబ్బురమనిపించింది.నీ చేతి లో చావడం కూడా నాకు గౌరవమే..మన ఇద్దరి లో ఎవరో ఒకరు మాత్రమే ఈ రోజు..మిగలాలి..రా అనుకున్నాడు.చాలా ఆయాసంగా ఉంది..ఆ కుర్రవాణ్ణి కూడా రమ్మని అంటే బాగుండేది అనుకున్నాడు.వయసు మళ్ళిన వానికి అనుభవం ఉంటుంది..వయసు లో ఉన్న వానికి బలం ఉంటుంది.. ఈ రెండు ఒక్క మనిషి లో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు.మళ్ళీ అనుకుంటాడు..లేదు..లేదు..నేను బలహీనుడిని కాను..దీన్ని ఎట్టి స్థితి లోనూ నేను జయించుతాను..లేదా ఆ క్రమం లో ప్రాణం విడుస్తాను.మనిషి ఎప్పుడూ ఓడిపోడు..కాకపోతే మరణించవచ్చునేమో..!

మొత్తానికి అలా పోరాడి..చివరకి దానిని కత్తి తో కావలసిన చోట గాయపరచి ..తన పడవకి కట్టేసుకొని తీరం సాగిపోతుంటాడు.బాగా అలసిపోయాడేమో వెంటనే నిద్ర పట్టింది.ఇంతలో ఆ చేప రక్తాన్ని పసి కట్టిన షార్క్ లు ఈ పడవ వెంటపడతాయి.ఆ ముదుసలి మేలుకొని మళ్ళీ  పోరాటం మొదలుపెడతాడు. ఈ షార్క్ లు ఇంకా తెలివి గలవి..ఒకటి పైకి ఎగబడుతుంటే ..మరొకటి చేప మాంసాన్ని తినడం మొదలు పెడుతున్నాయి.ముదుసలి బాగాడస్సిపోయాడు..ఎలాగో తీరం చేరుకునేసరికల్లా ..అతనికి చేప యొక్క అస్థిపంజరం మాత్రం కనిపించింది.నీరసించి వచ్చి ఒక పాక లో పడిపోయి ఆదమరిచి నిద్రపోతాడు. ఆ చిన్న కుర్రాడు మళ్ళీ చివరిలో ఆ ముదుసలి వద్దకి వచ్చి చెబుతాడు..చేప తల మాత్రం  ఉందని..తినడానికి పనికివస్తుందని..! దాన్ని పట్టుకెళ్ళి ఆ కాఫీ  షాపు లో ఇచ్చెయ్యి.. ఆ అన్నట్టు వచ్చేప్పుడు పేపర్ కూడా తీసుకురా అని చెప్పి ..అలసట తో ..గాఢ నిద్ర లోకి జారుకుంటాడు.ఒక కల వస్తూ ఉంటుంది ఆ కలలో అతనికి ..ఆఫ్రికా వెళ్ళినట్లు ,అక్కడి సిం హాల్ని  వేటాడుతున్నట్లు ..అలా వస్తూ ఉండగా ..కధ సమాప్తమవుతుంది.

ఈ నవల మొత్తం 124 పేజీలు ఉంటుంది.మనిషి యొక్క సంకల్ప బలం ముందు ఏదీ సరితూగదని సింబాలిక్ గా దీనిలో రచయిత చెపుతాడు.కధలో గమ్మత్తు ఏమిటంటే ముదుసలి ఆ చేప తో మాట్లాడుతుంటాడు..మళ్ళీ తన లో తాను మాట్లాడుకుంటూంటాడు.అట్లా సంభాషణలు నడుస్తూ ఇతివృత్తం పురోగమిస్తూ ఉంటుంది.Descriptive పద్ధతి లో చెపితే బోరు కొడుతుందని హెమింగ్వే అనుసరించి ఉంటాడు.ఎక్కడా బోరు కొట్టదు..ఒక్క పాత్ర ఉన్నప్పటికి..అదీ సముద్రం లో..ఆ పెను చేప తో పోరాటం లో.


నిజ జీవితం లో కూడా హెమింగ్వే  ఇటువంటి సాహసికుడేనని చెప్పాలి.రెండవ ప్రపంచ యుద్ధం లో ఫాల్గొన్నప్పుడు శరీరానికి గాయాలు అయినాయి.ఒక కన్ను కూడా దెబ్బ తిన్నది.ఫిషింగ్ అంటే కూడా ఇష్టం ..క్యూబా కి వెళ్ళి చేపలు పడుతూ ఆనందించేవాడు.స్పెయిన్ అంతర్యుద్ధం లో ఆ దేశం తరపున స్వచ్చందం గా యుద్ధ భూమి లో ఫాల్గొన్నాడు.కారణం ఆ దేశం పట్ల ప్రేమ కాదు...కేవలము రక్త ,భీభత్సాలు  చూడటం..చేయడం అతనికి ఒక అలవాటు.దానిలో ఆనందించే వాడు.వీటినే For whom the bell tolls లో చిత్రించాడు.







The Last Labyrinth నవల గురించి కొన్ని మాటలు.....

నేను ఇపుడు ఒక నవలని పరిచయం చేస్తాను.దాని పేరు ఎలాగు పైన చూశారు గదు...రచయిత ఎవరు అంటే అరుణ్ జోషి ..వారణాసి లో జన్మించి అమెరికా లో చదువుకుని భారత దేశం వచ్చి కార్పోరేట్ ప్రపంచం లో ఎన్నో అంచులు చూసి చివరకి తన ఆత్మ ఎక్కడ ఉంది అని అన్వేషించి నవలా రంగం లోకి అడుగు పెట్టి న ఒక మనిషి రాసిన కధ అది.నాకు పేరు వస్తుందా..లేదా ధనం వస్తుందా అని యోచించ కుండా ముందుకు వెళ్ళిన ఆయన భావజాలాన్ని నాకు తోచిన మేరకు పరిచయం చేస్తాను.అసలు లాబిరింథ్ అంటే దాని లోనే సగం అర్ధం అవుతుంది.ఇది ఒక తిక మక కధ అని.నిజానికి జీవితం కూడా ఒక తికమకనే మనం బాగా గమనిస్తే. అయితే అంత తొందరగా అంగీకరిస్తే మనం మనుషులం ఎలా అవుతాము .

నా దృష్టి లో  భారతీయుని గా జన్మించి ఆంగ్లం లో తనదైనశై లి లో రాయగలిగిన కొద్ది మంది రచయిత ల లో ఆయన ఒకరు.ఈ రోజున ఇంగ్లీష్ అనేది గ్లోబల్ భాష ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా..దాన్ని మార్చే దమ్ము ఎవరికి లేదు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా...

ఎందుకంటే మన Elite  ఏదైనా ఆ సమాజం తో కలిసి పనిచేయవలసిందే..బయటకి ఎన్ని కబుర్లు చెప్పినా  ...లేదా వీరి బిజినెస్ ద్వారాలు మూసుకుపోతాయి బయటి ప్రపంచం తో...!సరే..కధలోకి వద్దాము..! నిజంగా ఆంగ్ల భాష లోని variation  ని అర్ధం చేసుకోవాలంటే ఈ నవలని చదవమని తెలుగు పాఠకుల్ని అర్ధిస్తున్నాను.ఎందుకంటే...ఒక భారతీయుడు తనదైన అదిభౌతిక వాద ప్రపంచాన్ని కేవలం ఇంగ్లీష్ వాళ్ళ లానే కాదు ఆ భాష నేర్చిన భారతీయునిలా ఎలా వ్యక్తం చేయవచ్చునో  దీని నుంచి గ్రహించవచ్చును.సంభాషణలు కావచ్చును..వివిధ సన్నివేశాల్లో వ్యక్తీకరణ కావచ్చును..ఒక మాదిరిని ఏర్పరిచాడు.గతం లో ఆర్. కె.నారాయణ్ వంటి భారతీయాంగ్ల రచయితలనుంచి  ఆహా ఎంత  పురోగమించింది ఈ ప్రపంచం అనిపించక మానదు...!అదే ఈ Indo Anglican రచనా ప్రపంచం.

సరే....స్థూలంగా కధ చిన్నదే.Som Bhaskar అనబడే హీరో...అలానే అనుకుందాం.ముంబాయి అతనిది.ఒక స్టార్ హోటల్ లో Aftab అనే వ్యాపారవేత్తని కలుస్తాడు.అతను ఎవరు..ఒక పురాతన చరిత్ర ఉంటుంది ... వారణాశి అతనిది..! ! అతని పూర్వికులు మొగలుల ఆస్థానం లో పనిచేసిన వారు.స్థితిమంతుడు..అనేక పురాతన భవనాలకి అధిపతి.జీవితాన్ని మధువు వలె ఆస్వాదించే వ్యక్తి. అతని కి భార్య వంటి వ్యక్తి అనురాధ.గతం లో ఒక సినిమా నటి.ఎన్నో చేదు,తీపి జీవితానుభవాలు గల స్త్రీ.ఆమె Aftab తో కలిసి ఉంటుంది...అది ఒక గమ్మత్తైన అనుబంధం.ఆమె కి ఏ రకంగాను అతను ఆటంకంగా ఉండడు.అలాగని ఆమె కూడ విలువరహితం గా చూడటం ఉండదు.అలాంటి ప్రపంచం లోకి ఈ Bhaskar వస్తాడు.దేనికి..Aftab కి చెందిన ఒక కంపెని ని టేక్ ఒవర్ చేయడానికి.అతను ఈమె పట్ల క్రమేణా ఆకర్షితుడవుతాడు.ఎన్నో రకాల సన్నివేశాలు ఈ మధ్య లో జరుగుతాయి.కంపెని షేర్లు ఒక హిమాలయాల్లోని గ్రామీణ వ్యక్తి దగ్గర న్నాయని తెలిసి అక్కడకి బయలుదేరుతాడు.అదంతా ఒక ఊహించనలవిగాని సన్నివేశాలతో సాగుతుంది.


అసలు మనం ఇలాంటి వాటితో ఒక కధని నిర్మించవచ్చునా అనిపిస్తుంది.జీవితం యొక్క అంతర్ అర్ధాన్ని  మనకి బోరు అనిపించకుండా చెపుతాడు రచయిత.ముఖ్యంగా వారణాశీ ని దగ్గర గా చూసిన అనుభూతి కలుగుతుంది.ఆ ఇరుకు వీధులు.ఆ నేర ప్రపంచం..ఆ వీధులు ల లోని నా నా చండాలం..అదే సమయం లో..దానికి దగ్గర లోనే ఋషిపుంగవుల వంటి వ్యక్తులు..వారిని..ముస్లిం లు..హిందువులు అనే తేడా లేకుండా గౌరవించడం...ఇలా అనేక రంగులు..మన కళ్ళ ముందు మెదులుతాయి.మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా చదవండి. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ సైతం వచ్చింది.అరుణ్ జోషి లో నాకు నచ్చిన అంశం ఏమంటే అతని ఇంగ్లీష్ మన భారతీయ భాష లానే అనిపిస్తుంది.అదే సమయం లో అతని వ్యక్త భావం ఎక్కడో లోతు గా పోయి తగులుతుంది...!ఈ నవల లో దక్షిణాది మరియు ఉత్తరాది  బ్రాహ్మణులకు ఉన్న వ్యత్యాసం కూడా బాగా తెలుస్తుంది.Murthy Kvvs






రహస్య భారతం లో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకం పై నా రివ్యూ..!




పాల్ బ్రంటన్ అనేపేరు తెలుగు పాఠకులకుసుపరిచితమే!1934 లో ఆయన వెలువరించిన A Search in secret India అనే గ్రంధానికి అనువాదమే ఇది.పాల్ బ్రంటన్ అసలు పేరు Raphel Harst .చాలా వరకు రచనలన్నీ ఆయన వివిధ కలం పేర్లతోనే రాశారు.శోధించి తెలుసుకోవడం ,మానవ ప్రయత్నానికి అగ్రస్థానం ఇవ్వడం యూరోపిఎన్లకు బాగా ఇష్టమైన పనులు అని చెప్పాలి.తదేకంగా ఒకేపనిమీద కొన్ని రోజులు,అవసరమైతే కొన్ని ఏళ్ళు కూర్చోవడానికి కూడా వెనుదీయని ఈ పాశ్చాత్యుల ధీర గుణం వల్లనే మనకి అనేక దేశాలకి సంబంధించిన అనేక శాస్త్రాలు అందుబాటులోకి వచ్చినవి.

భారతీయ జీవనంలో యోగులకి గల స్థానం పరమ పూజనీయమైనది.చివరకి చిన్నపాటి ఇంద్రజాలం చేసి అలరించి ఆకట్టుకునే మాయ యోగులకి కూడా మన సమాజం ఎంతో కొంత విలువనిస్తుంది.భౌతిక శాస్త్ర ప్రమాణాలరీత్యా నిజమైన యోగిని కనుగొనడం అసాధ్యం.దీని మాటున నకిలీలు కూడా అలా చెల్లుబాటు అయిపోతుంటారు.

మరి ఇలాంటి విషయంలో పరిశోధనకు గాను ఒక బ్రిటీష్ రచయిత పాల్ బ్రంటన్ ఇక్కడికి కొన్ని దశాబ్దాల క్రితమే విచ్చేసి తన అన్వేషణ సాగించడం అద్భుత విషయమే.ఉత్తర భారతం లో ఆయన కలిసిన మెహెర్ బాబా,ఈజిప్ట్ కి చెందిన ఇంద్రజాలికుడు ఆయనలో ఒక ఆసక్తిని కలిగిస్తారు.బాహ్య ఆడంబరాలకి,పూజలకి,తంతులకి ప్రాధాన్యమిచ్చే వారిని ఆయన కలుసుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు.

అంతర్ముఖీన యోగశక్తి పనిచేయడం కాదు..అది బాహ్యప్రపంచానికి సంబంధించి ఏవైనా ప్రభావం చూపగలుగుతుందా..ఒక వేళ సాధ్యమైతే అవి ఎలాంటివి అంటూ ఒక నిర్ణీత పద్ధతిలో తన పరిశోధనని కొనసాగించారు.కేవలం తనని మొత్తం అర్పించుకోవడానికి ఆయన ఇక్కడికి రాలేదు అని మనం గ్రహించాలి.ఒక సన్నని దారం అంత ఎడం ని బ్రంటన్ పాటించారు.పాశ్చ్యాత్యులకి సహజమైన భౌతిక సాక్ష్యం ఉంటే తప్ప నమ్మననే తత్వాన్ని మూలాధారంగా చేసుకుంటూ తన పని చేసుకుపోయారు.

తమిళనాడు లోని బ్రమ అనే యోగి వద్ద హఠ యోగం మానసిక తలాలపై కూడా ఎలా పనిచేస్తుందో బ్రంటన్ అవగాహన చేసుకున్నారు.పరిణితి సాధించిన యోగి లో గల శక్తులను తులనాత్మకంగా అంచనా వేశారు.

అనువాదకులు జొన్నలగడ్డ పతంజలి అనువాద శైలి రమ్యంగా,చదువరిని ఇబ్బంది పెట్టని రీతిలో సాగింది.ఇటువంటి వస్తువు తో కూడిన గ్రంధాన్ని తెలుగు చేయడం అంత సులువు కాదు.

రాధాస్వామి అనుయాయుల భౌతిక దృక్పధం,దానితో పాటు వారి ధ్యాన పద్ధతులు బ్రంటన్ ని అలరించినవి.రామకృష్ణ పరమహంస యొక్క ప్రత్యక్ష శిష్యులు మాస్టర్ మహాశయులను ఆయన కలిశారు.రమణ మహర్షి ని అందరిలోకి ప్రత్యేకమైన యోగిగా భావించి వారి ఆశ్రమం లోనే కొన్ని రోజులు ఉన్నారు.ఆయన భోదన మౌనంగా ఉన్న సమయం లోనే ఉంటుందని ...కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల అర్ధం అవ్వవని బ్రంటన్ భావిస్తారు.ఆశ్రమం లో తెలుగు వారైన రామయ్య యోగి శక్తి ని ఉగ్గడిస్తారు.

పాల్ బ్రంటన్ వ్యక్తీకరించే విధానం అది ఏ విషయమైనా గాని పూర్తిగా ఎటువైపు మొగ్గకుండా సునిశిత పరిశీలనని నింపుకొని ఉంటుంది.అది ఒక శోభని కలిగి పఠితని తనని తాను ఆలోచించుకోమంటుంది.పాశ్చ్యాత్యులు ఏ పనిని ఊరికే చేయరు.నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే వుండాలి.దాని నుంచి తమ భౌతిక ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే యోచన చేస్తారు.

 పాల్ బ్రంటన్ ఈ గ్రంధానికి పెట్టిన పేరు A search in secret India .కాని తెలుగు అనువాదంలో "ఆధ్యాత్మిక" అనే పదాన్ని కూడా అదనంగా కొంత స్వేచ్ఛ తీసుకొని చేర్చినట్లున్నది.బ్రంటన్ యోగులను మీరు అని సంభోధించినట్లుగా,యోగులు బ్రంటన్ ని నీవు అని సంభోధినించినట్లుగా సంభాషణలు సాగుతాయి.నిజానికి పాల్ భారతీయ శిష్యుల మాదిరిగా స్వేచ్ఛని కోల్పోయే విధేయతని ప్రకటించినట్లుగా పుస్తకం లో మనకి కనబడదు.

Western tone లో నుంచి వచ్చే  కొన్ని కొన్ని మాటల్ని అర్ధం చేసుకోవడం లో మనకి కొత తర్ఫీదు అవసరం.ఒక్కోసారి వారి వ్యంగ్యాన్ని కూడా పొగడ్త గా స్వీకరిస్తుంటాము.కొన్ని pre- conceived thoughts ని లోపల పెట్టుకొని ఏ వైపు తన conclusion ని ఇచ్చినట్టు కనబడదు.తారసపడిన సంఘటనలని ఒక ఆసక్తి కరమైన డాక్యుమెంట్ లా రికార్డ్ చేశాడాయన.Click here

                                                       --By KVVS Murthy






Paulo Coelho రాసిన "అలీఫ్" పుస్తకం పై నా రివ్యూ



పావ్లో కోయిలో పేరుని నేను ఇదివరకు విని ఉన్నాను..ఆయన Alchemist  కూడా బాగాపేరుపొందినది.చాలామంది బాగుందని చదవమని చెప్పారు.కాని నాకున్న ఇతరేతర వ్యాపకాల వల్ల పడలేదు.ఈ మద్య ప్రయాణాల్లో ఓ చోట ఆయన పుస్తకం Aleph కనబడితే కొన్నాను.బ్రెజిల్ లో జన్మించిన పావ్లో మాతృభాష పోర్చుగీస్ .ఆ భాషలోనే ఆయన రచనలు చేశాడు.ఆ తరువాత అవి అనువాదం అవుతుంటాయి ఇతర భాషల్లోకి.నిజం గా ఎంత సౌకర్యం.

ఫ్రెంచ్ గాని,స్పానిష్ గాని,జర్మన్ గాని, స్వీడిష్ గాని, పోర్చుగీస్ గాని ఇంకా ఏ ప్రధాన యూరోపియన్ భాషగాని వాళ్ళ దేశాలు చిన్నవైనా వారి పెద్దలు చేసిన సాహసాల వల్ల అనేక వలస దేశాలు ఏర్పడి ఆయా భాషలకి విస్తృతి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. లేకపోతే ఎక్కడి దక్షిణ అమెరికా ఖండం లోని బ్రెజిల్ అక్కడికి పోర్చుగీస్ భాష వెళ్ళడమేమిటి..?

సరే... రచయిత ఈ అలీఫ్ అనే పేరుని ప్రఖ్యాత బ్రెజిల్ కధకుడు Jorge Luis Borges నుంచి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ప్రత్యేకమైన ఇతివృత్తం అంటూ ఏమీ లేదు.తనలోకి తాను ప్రయాణించడమే ఈ పుస్తకం లోని సారం.అయితే ఈ  ప్రయాణాన్ని తన రైలు ప్రయాణం తో ముడివేసి చెప్పుకో పోతుంటాడు.ఆఫ్రికా లో నుంచి..అలా యూరపు దేశాల లోకొచ్చి..ఇహ అక్కడినుంచి ట్రాన్స్ సైబీరియా మండలం చివరిదాకా ఎడతెగని రైలు ప్రయాణ అనుభవాలు మననం చేసుకుంటూ మనకి చెబుతాడు.ఇదంతా కూడా రచయిత గా తన పాఠకులని కలుస్తూ చేస్తూంటాడు.కొన్ని వేల మైళ్ళ దూరం ఆ రైలు ప్రయాణం..అరడజను పైగా ప్రామాణిక కాల మండలాలు...మధ్యలో కలిసే హిలాల్ లాంటి పాత్రలు.వాళ్ళతో అనుభవాలు..కొన్ని స్వగతాలు..!

 హిలాల్ అనే ఆవిడతో 500 ఏళ్ళ క్రితం పూర్వ జన్మలో కలిగిన పరిచయం.ప్రస్తుత ఈ జన్మలో ఈమె వయొలనిస్ట్.ఆవిడతో సంభాషణలు...అమలినశృంగారసన్నివేశాలు ..కొండొకచో వాటిని మించి కూడా..!

రచయిత కి జె అనబడే ఒక ఆధ్యాత్మక గురువు ఉన్నట్టు చెబుతాడు.అతడెవరనేదిపూర్తిగా ఎక్కడా చెప్పడు. ఒక రకంగా ఈ పుస్తకాన్ని అతని ఆటోబయోగ్రఫీ గా అనుకోవచ్చునేమో..!చాలా స్లో గా ఉంటుంది కధనమంతా.. మొత్తం మూడు భాగాలుగా విడదీశాడు దీన్నే..!

అయితే చెప్పే విధానంలో మనసుని జోల పుచ్చి నిద్రబుచ్చే టెక్నిక్ పావ్లో లో ఉంది.దాని కోసం ఆయన  వివిధ మతాలకి చెందిన కొన్ని అంశాలని బాగానే పరిశీలించివుండవచ్చు.ఎటువంటి జారత్వం లేకుండానే ఒక మనిషి ఇద్దరిని హృదయం లో కలిగిఉండటం పరిపాటి అంటాడు.ఒకరకంగా పుస్తమంతా అంతర్గత శోధనమే..!

ఈ పుస్తకాన్ని పోర్చుగీస్ లోనుంచి ఇంగ్లీష్ లోకి అనువదించిన Margaret Jull Costa  ని ఎంత అభినందించిన తక్కువే.సరళంగా,భావ యుక్తం గా చాలా బావుంది.తెలుగు లో నుంచి ఇంగ్లీష్ లోకి వచ్చే కొన్ని కధలు చదువుతుంటే ఇంత పాషాణపాకం గా ఎందుకు అనువదిస్తుంటారు..కేవలం వారి పాండితీ ప్రకర్ష చూపడానికేనా అనిపిస్తుంది.Click here

                       --Written by KVVS Murthy


  "పరాశక్తి " సమీక్ష


ఈ పుస్తకం మొదట  The Power Unknown to God: My experience during the awakening of Kundalini energy అనే పేరు తో రాయబడింది.ఆ పిమ్మట  "పరాశక్తి " అనే పేరు తో  తెలుగు లోనికి వచ్చింది.రాసిన వారు శ్రీనివాసులు గారని ఒక ఆర్మీ అధికారి.మొదట్లో ఏదో పేపర్ లో సమీక్ష చదివినప్పుడు ఆర్మీ మనిషి రాశారా అని మ్రాన్ పడ్డాను.ఇటీవల తలవని తలంపు గా ఒక బుక్ షాప్ లో కొన్నాను..చదువుదామని.విషయం ఎలా రాశారో చూద్దామనిపించి కొన్నాను.ఎందుకంటే చాలా లోతైనది,చెప్పడానికి ఎక్కడనుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలియకపోతే చదివేవారికి కూడా అయోమయంగా ఉంటుంది.


ఒకప్పుడు ఇలాంటి సాధనలు గురుంచి బాహాటంగా చెప్పేవారు కాదు,రకరకాల కారణాల వల్ల..!ఈ సమాచార యుగం లో కుండలిని సాధన కూడ చర్చించబడుతున్నది.మంచిది.అసలంటూ ఒక నిజమైన వజ్రం ఉన్నప్పుడే దానికి నకిలీలు కూడా బయలుదేరుతాయి,కారణాలు ఏవైనా..!అటువంటిదే ఈ కుండలిని ప్రక్రియ.భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక.

సాధనా మార్గం ఎన్నో మానసిక అనుభూతులను అందిస్తుంది.దానిలో అనేక రంగులు..ఎవరి అనుభవం వారికే స్వంతమైనది..భూమి మీద అసలు మనిషి పుట్టినది ఇలాంటి దారులు గుండా నడవడానికే...ఈ విశ్వం ఏమిటి,దీని నిజ స్వరూపం ఏమిటి..సకల ప్రశ్నలకి జవాబు దొరికే దారి.హేతువు అక్కడ నిలబడదు.భాష పూర్తిగా వర్ణింప జాలదు.ఆ అనుభవం పొందిన పిమ్మట ఈ సకల జీవితానుభవాల వెనుక కనీ కనబడకుండా ఉన్న రహస్య సంకేతాల సారమూ అర్ధమవుతుంది..!

చాలామంది ఈ జీవితం నుంచి  నిష్క్రమిస్తారు.ఈ అనుభవాలతర్వాత.చెప్పడం సులువు.సాధన రెండు వైపులా కత్తి వంటిది.లౌకిక పరమైన జ్ఞానం ఎందుకూ కొరగాదు.అసలు ఆ త్రాసులో పోల్చాలనుకోవడం కూడా వృధా.ఎవరకి ఎందాకా అర్ధం కావాలో అంతే అర్ధం అవుతాయి ఇవి.శ్రీనివాసులు గారు రాసిన అనుభవాలు కొత్త ద్వారాలు తెరుస్తాయి,కొంత మందికి ఎక్కడనో కనెక్ట్ అవుతాయి.

నామటికి నేను కొంత కాలం ఈ సాధన చేసిన పిమ్మట అనిపించిది ఏమంటే,కొన్ని బయటకి చెప్పలేని విషయాలు ఇందులో ఉన్నాయి.అవి దాని లోకి దిగితేనే తెలుస్తాయి.తర్కం జోలికి నేను పోదలచలేదు.ఒకప్పుడు ఆ యక్ష ప్రశ్నలతో అనేక మందిని విసిగించిన వాడినే నేను.దేనినైన అతి త్వరగా ఆకళింపు చేసుకోవడం,ఎదుటి మనిషి భావాలు అద్దం లో కనిపించినట్టు కనిపించడం,దూర దృశ్యాలు కనిపించడం,ఇంకా ఇలాంటివి అనేక అంశాలు వస్తుంటాయి.ఇది మాయా కాదు,మంత్రమూ కాదు..మనకి కనిపించే దాని వెనుక ఏదో ఒక లా లేదా ఒక అంత సూత్రం ఉంది.దాన్ని తెరిచేవే ఈ సాధనలు అన్నీనూ .


మరి ఈ పరాశక్తి పుస్తకం లో రచయిత తనవైన ప్రయాణ పద్ధతులు గురుంచి రాశారు. సాధన లోని రుచి తెలిసిన వారికి గౌరవం కలుగుతుంది..!లేదా పేజీలు తిప్పి అవతల పెట్టేస్తారు..ఈ లోకం లో ఎప్పుడు ఏది ఎవరికి ఎలా  లభించాలో అవి అలా లభిస్తుంటాయి.అలాగని పురుష ప్రయత్నం మానమమి కాదు..భాష తో వచ్చే తంటా ఇదే..మనం అనుకున్న దాన్ని కూడా ఒక్కోసారి అది సరిగా అందించదు.








ఎందుకని తెలుగువాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ భాషని చాలా జటిలంగా,కఠినంగా రాయాలని ప్రయత్నిస్తుంటారు..?


ఎందుకని తెలుగువాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ భాషని చాలా జటిలంగా,కఠినంగా రాయాలని ప్రయత్నిస్తుంటారు..?తాము రాసే ఇంగ్లీష్ రాతల్లో అవసరం కాకున్నా ఆడంబరమైన words ని phrases ని వాడి...ఇదిగో చూశావా నా తడాఖా అన్నట్టు ..ప్రవర్తిస్తుంటారు. తెలుగులు రాసే ఆంగ్ల వ్యాసాలు గాని,నడిపే ఆంగ్ల పత్రికలు గాని (న్యూస్ వెబ్ పోర్టల్స్ తో సహా) ,ఇంకా ఇతరత్రా ప్రక్రియల్లో గాని ఇంగ్లీష్ రాసే ఒరవడిలో తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం ,ఒక మూసదనం తో కూడిన ధోరణి కనిపిస్తుంది.


చాలామటుకు ఎదుటివాడు వెంటనే అర్ధం చేసుకోకుండా కొంత confusion ని మెయింటైన్ చేయాలని తమ ఆంగ్ల రాతల్లో ప్రయత్నిస్తుంటారు.ఎంత వారికైనా native flavour ని మిళితం చేయకుండా ఇంగ్లీష్ రాయలేరు.నిజం చెప్పాలంటే అది కొంత అందాన్నిస్తుంది. మన భారతీయ ఆంగ్ల రచయితలు R.K.Narayan లాంటివారు west లో కూడా బాగా పాపులర్ అవడానికి అదే కారణం.


సాదాసీదా మాటలతో చక్కటి శైలి లో ఎంతో అందంగా ఇంగ్లీష్ లో రాయవచ్చును.ఇప్పుడంతా అమెరికన్ల యుగమే కదా నడుస్తున్నది..ఇంటర్నెట్ లో కూడా ఎక్కువగా అమెరికన్ తరహా పదప్రయోగాలనే అన్నిటా ఉపయోగిస్తున్నారు.తెచ్చిపెట్టుకున్న పటాటోపాలు లేకుండా సూటిగా సాధ్యమైనంత భావవ్యక్తీకరణ యే లక్ష్యంగా సాగే అమెరికన్ తరహా ఆంగ్లమే ఈ రోజు మనకి అవసరం అని నా అభిప్రాయం.అలాగని ఇంగ్లీష్  మూల సూత్రాలు దెబ్బతీసేవిధంగా ఏమీవుండదు.


మనకి తెలియకుండానే అనేక విధాలయిన మీడియా ప్రభావాల వల్ల అమెరికన్ తరహా ఇంగ్లీష్ నే ఎక్కువగా వాడుతున్నాము,కాని రాయడం దగ్గరకి వచ్చేసరికి కొంతమంది తెలుగు కవులు అర్ధం కాని సంస్కృత పదబంధాలని మద్యలో ఇరికించడానికి ఎలా తాపత్రయపడుతుంటారో అలా ఏ మిల్టనో,బైరనో,కీట్సో ఎక్కడో సందర్భానుసారంగా వాడిన జటిలపదాలని ఇరికించడానికి చూస్తుంటారు.


నేను భారతదేశం లో ని ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడల్లా అక్కడి పట్టణాల్లో ఇలాంటి  విషయాలని పరిశీలిస్తుంటాను. ఎంతో వెనుకబడిందని చెప్పుకునే ఒడిషా లాంటి రాష్ట్రం లో కూడా మామూలు గ్రాడ్యుయేట్లకి కూడ చాలామందిలో మంచి ఇంగ్లీష్ భాషా సృజనాత్మకత ఉన్నదని గమనించాను. ఒరియాలో రాసిన విధం గానే ఆంగ్లం లో కూడా రాయడం కనిపించింది. బాలంగీర్,పూరి ,కటక్,తిగిరియా ,భుబనేశ్వర్ లో నాకు ఇలాంటివారు కొంతమంది వ్యక్తిగతం గా తెలుసు.ఒక సీతాకాంత్ మహాపాత్ర,ఒక మనోజ్ దాస్ లాంటి ఇండో ఆంగ్లికన్ రచయితలు అక్కడి నుంచి వచ్చారు అంటే అటువంటి అభినివేశమే కదా...!


కేవలం చదువులోనో ఇంటర్వ్యూ లోనో పాస్ మార్కులు పొందడానికి ఒక frame work  లో నేర్చుకున్న ఆంగ్లం సరిపోతుంది.అయితే సృజనాత్మక రచనలు చేయడానికి అంతకు భిన్నమైనది ఇంకొకటి కూడా కావాలి.Mainstream లో వస్తోన్న భాషాస్వరూపాన్ని పట్టుకోవాలి.అది కేవలం విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నంతమాత్రాన రాదు.దానికి నిరంతరం విస్తృతమైన సమకాలీన ఫిక్షన్ లేదా నాన్ ఫిక్షన్ ని చదువుతుండాలి.


ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు వారంతా ..పల్లెనుంచి పట్టణం దాకా ఇంకా మహా నగరం దాకా అంతా ఇంగ్లీష్ మీడియం లోనే కదా చదువుతున్నారు.కాని ఎందుకని ఇంగ్లీష్ భాషలో క్రియేటివ్ రైటర్స్ ని ..ఒక చేతన్ భగత్ నో ...లేదా పాతతరం లో అయితే  ఆర్కె నారాయణ్  లాంటి వారినో మనం సృష్టించుకోలేక పోయాము..?


నోటికి ఇంకా రాతకి పట్టుబడే సహజమైన ఇంగ్లీష్ structures కోసం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా గా ఇంగ్లీష్ నేర్చుకునే విధానం కంటే సీరియెస్ గా ఒక సిడ్నీ షెల్డన్ నవల తీసుకొని చదవడం ప్రారంభించమని నేను సలహా ఇస్తుంటాను.ఆ తరవాత షేక్స్పియర్ ని నెమ్మదిగా చదవండి.

ఒక వేపు కధ,ఇంకో వేపు భాషా స్వరూపం అలావోకగా ఆడుతూ పాడుతూ తెలుస్తుంది.

  పడికట్టు..మూస విధానం లో కాకుండా ఎంత చక్కగా...అందంగా ఇంగ్లీష్ లో వ్యక్తీకరణ చేయవచ్చునో pulp fiction ని చదివిన తర్వాతనే నాకు తెలిసింది. ఆ తరవాత బేకన్ లాంటి వాళ్ళని చదువుకున్నాను. Mario Puzo నాకైతే ఆరాధ్యప్రాయుడు.ముందు ఆయన God Father చదివాను.హీరో ఇటాలియన్ నేపధ్యాన్ని అతను అమెరికా కి వలస వెళ్ళిన తరువాత కూడా ..చివరికి అతను మరణించేవరకు కూడా...ఎలా అతని యొక్క కేరక్టర్ ని తీర్చిదిద్దుతాడంటే ..ఆ సినిమా కంటే కూడా అద్భుతం గా వుంటుంది.డాన్(Don clericuzio) ని చివరకి మనవాళ్ళు ఒక వీధి రౌడి గా చేశారు.


ఆ తర్వాత అతను రాసిన Fortunate Piligrim,Family,Fools Die లాంటివి వరసబెట్టి చదివాను.ఆ దాహార్తి ఇంకా తీరక అలా పెరిగిపోతూనే ఉంది.సిడ్నీ షెల్డన్,సుసాన్ ఇసాక్స్,హెరాల్డ్ రాబిన్స్,జాన్ గ్రీషం ఇలా వరసబెట్టి ఒక రెండు వందలపైనే చదివుంటాను.నేను కధా కోసమో..ఇంకోదాని కోసమో చదివా గాని నాకు వాటికి మించిన విషయాలనే అవి నాకు అందించాయి. బాగా పాపులర్ అయిన ఓ ఇంగ్లీష్ ఫోటో బ్లాగు(Click here for my English Blog) కూడ ఈరోజున నేను రాస్తున్నానంటే అదంతా ఇలాంటి పుస్తకాల పఠనం వల్ల కలిగిన తెలివిడేతప్ప నా కాలేజీ ఇంగ్లీష్ చదువుల వల్ల కాదని మనవిజేసుకొంటున్నాను.ఇంకోటి...నాలోని ఏకాంత పర్యాటకుడిని రెచ్చగొట్టి దేశమంత తిప్పించినది కూడా ఈ వ్యసనమే..! 








మనవాళ్ళు ఇంగ్లీష్ లోనుంచి అనువాదం చేసుకోవడంలో చూపించినంత ఉత్సాహం తెలుగు రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడంలో ఎందుకు చూపించరు..!
అనువాదం వల్లనే మన వాతావరణం లోని మనకే సొంతమైన కొన్ని అంశాలు ఇతర భాషలవాళ్ళకి బాగా చేరే అవకాశం ఉన్నది.ఎప్పుడో తప్ప పెద్దగా తెలుగు లోని వివిధ సాహిత్య ప్రక్రియలు ఇతర భాషల్లోకి ,ముఖ్యంగా ఆంగ్ల భాష లోకి వెళుతున్నట్లు కనిపించడంలేదు.

ఇంగ్లీష్ లోకి సీరియెస్ గా అనువాదం చేసేవాళ్ళు బహుతక్కువ.ముక్కలు ముక్కలుగా,పేరాగ్రాఫ్ లుగా ఇంగ్లీష్ లో రాసేవాళ్ళని చూసినపుడు అనిపిస్తుంది..వీళ్ళెందుకని ఇంతకంటే ఎక్కువ పరిధి ఉన్న ఆంగ్ల అనువాద ప్రక్రియలోకి రాకూడదూ అని.ఎందుకనో తెలుగు వాళ్ళలో ,ఇంగ్లీష్ బాగా వస్తుందని అనుకునేవాళ్ళ లో కూడా  ఒక తెలుగు కధనో,నవలనో అనువాదం చేయాలంటే బెరుకుగా ఫీలవుతారు.


చాలామంది ఇంగ్లీష్ ప్రొఫెసర్లు,లెక్చరర్లు  కూడా ఇందుకు మినహాయింపు కాదు.తెలుగువాడి ఆంగ్లప్రకటనా సామర్ధ్యం పై సాటి తెలుగువాడికే చాలా సందేహం.అందుకనేనేమో తెలుగువాళ్ళు ఒక ఇంగ్లీష్ పత్రిక పెట్టినా లేదా ఏ ఆత్మకధ లాంటిది రాసుకున్నా పక్కన బాసటగా ఏ తమిళునిదో,బెంగాలీదో,కనీసం ఏ మిశ్రా,చావ్లా లాంటి పేర్లు దానికి సపోర్ట్ గా ఉండవలసిందే.అప్పుడుగాని శంఖులో తీర్థం పోసినట్లుగా ఆ ఆంగ్లరచనని మనం ఆమోదిస్తాం.

తెలుగు వాడికి నగర సంస్కృతి లేకపోవడమే దానికి కారణం అని కొందరంటారు. నాకైతే అనిపిస్తుంది ఇంగ్లీష్ ఫిక్షన్ ని ,నాన్ ఫిక్షన్ ని చదివే  సంస్కృతి ని మనలో పెంపొందింపజేసుకోకపోవడమే అసలు కారణం..! EAMCET,IIT  లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని లక్షలు పోసి ఇంటర్మీడియెట్ బట్టీ చదువులు చదివిస్తాం..కాని ఇంగ్లీష్ లోని మంచి పుస్తకలని చదవడం లో అభిరుచిని గాని, పట్టుమని పది వాక్యాలని రాసే అభినివేశాన్ని గాని ఈ సో కాల్డ్ కార్పోరేట్  కాలేజీలు ఇవ్వవు.

మనం తెలుగు పుస్తకాల్ని ఎలా చదువుతామో ,అలాగే ఇంగ్లీష్ పుస్తకాల్ని కనీసం సమకాలీనమైనవాటిని చదివే ఒక సంస్కృతి ప్రతి చదువరిలోనూ రావాలి.తెలుగుని ప్రేమించడం అంటే ఇంగ్లీష్ ని ద్వేషించడం ,తిట్టడం అనే హిపోక్రసీ లో  జీవిస్తున్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తేనే ఇది సాధ్యం.

మనకి మించిన నగర సంస్కృతి కేరళలో మాత్రం ఏముంది.నగర సంస్కృతి అంటే కేవలం material luxuries అనే కోణం లోనే తీసుకోరాదు. అది మానసిక తలాల్లో జరిగే ఒక ముందు చూపుగా కూడా పరిగణించాలి.మీరు కేరళ వెళ్ళండి..మన మండల కేంద్రాల్లో కనిపించే కొన్ని ఖరీదైన బిల్డింగులు కూడా అక్కడి జిల్లా కేంద్రాల్లో కనిపించవు. అయితే ఒక చిన్న పెంకుటింటిలో ,పైన ఏ ఆచ్చాదన లేకుండా లుంగీ లో ఉండే ఒక మామూలు వ్యక్తి కూడా వైక్కం బషీర్ ని చదివినట్టే సిడ్నీ షెల్డన్ నీ చదువుతాడు.Alexia De Vere  పాత్రని ప్రస్తుత మహిళా రాజకీయవేత్తలతో పోల్చిచెప్పగలడు.అది ఎలా వచ్చింది...తమ మాతృ భాషలానే ఆంగ్ల రచనల్ని చదివే ఒక సంస్కృతి లోనుంచి..!

అనువాదం లక్ష్యం ఏమిటి..?ఒక ప్రాంత నేపధ్యాన్ని ఇంకొకరికి పరిచయం చేయడం.నూటికి నూరు శాతం "ఒరిజినల్ రచన" కి దగ్గరగా లేదని విమర్శించడం కూడా కూడని పని.అనువాదం చదివే పాఠకుడు ఒరిజినల్ నుంచి అనువాదం లోకి వచ్చే Gap ని అర్ధం చేసుకోగలడు.మరీ నలగని వాటిని  ఫుట్ నోట్స్ ని ఇచ్చి చాలా మేరకు  help చేయవచ్చు. ఓ మితృడు ఈ మధ్యన అన్నాడు...కొన్ని తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడం కష్టం అని.అవును మక్కీకి మక్కీగా ఇతర భాషలో పదాలు ఉండకపోవచ్చు.కాని మన భాషలోని పదాన్ని అలాగే ఉంచి దాని నేపధ్యాన్ని వివరిస్తే అర్ధం కాకపోవడమనేది ఉండదు.పైగా పఠితకి అది థ్రిల్ల్లింగ్ గా ఉంటుంది.

ఉదాహరణకి "ఒమెర్త"  అనే పేరుతో మేరియో ప్యూజో ఒక నవలరాశాడు.అది ఇటాలియన్ పదం.ఇంకా చెప్పాలంటే సిసిలీ పరిసరాల్లో మాఫియా అవసరాల్లో భాగంగా పుట్టిన పదం. ఆ నవల రాసేటప్పుడు దానికి సమానమైన ఆంగ్ల పదం లేదు. కాబట్టి దాని నేపధ్యం గూర్చి ముందర పేజీల్లోనే వివరణ ఇస్తాడు రచయిత.CODE OF SILENCE అని.ఎటువంటి పరిస్తితుల్లో కూడా తనకి గాని,తన కుటుంబ సభ్యులకు గాని హాని జరిగినా పోలీసులకి ఆ వ్యక్తి గురించిన వివరాలు ఇవ్వకుండా  ఉండటం దానిలో ఓ భాగం.అవసరమైతే నిష్కారణంగా జైలుకి వెళ్తారు తప్ప వెల్లడించరు.ఆ "ఒమెర్త"  ని అధిగమించినవాళ్ళు Family చేతిలో Death punishmint ని అనుభవించవలసిందే.ఇక్కడ Family అంటే కుటుంబం అని కాదు నేర సామ్రాజ్యం అని అర్ధం మాఫియా పరిభాషలో. మరి ఇవన్నీ ఎలా తెలిశాయి....దానికి తగిన వర్ణనలు,వివరాలు అదనంగా ఇవ్వబట్టే కదా..!ఈ రోజున ఒమెర్త అనే పదం ఇంగ్లీష్ భాషలో కలిసిపోయింది ఆ నవల పుణ్యాన.

ఇది తెలుగు కీ వర్తిస్తుంది.







స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించిన కొన్ని భావనలు



వేసవి కాలం వచ్చిందంటే కొన్ని కరపత్రాలు చూస్తుంటాం...స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించినవి.ఓ క్రాష్ కోర్స్ లాంటిది ఆఫర్ చేస్తున్నట్లుగా చూస్తుంటాం.వీటి వల్ల ఉపయోగం ఉంటుందా..మనసుండి నేర్చుకుంటే ఎంతో కొంత ఉంటుంది.లేకుండా ఎలా పోతుంది. అయితే fluent గా మాట్లాడలేకపోతున్నామని కొందరంటుంటారు.అదీ నిజమే.నూటికి నూరు పాళ్ళు నిజం.మరయితే ఈ fluency ని ఎలా సాధించాలి.ఇక్కడ కొద్దిగా మనం లోతుగా వెళదాం.

చాలామంది ఇంగ్లీష్ లో గడగడా మాట్లాడాలని అనుకునేవాళ్ళు విచిత్రంగా ఆ భాషలో మంచి జ్ఞానం ఉన్నవాళ్ళేనని నా సర్వే లో అనిపించింది.వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ బాగానే వచ్చు.చాలా పదాలకి అర్ధాలు కూడా తెలుసు.నా దృష్టిలో రమారమి 2000-2500 ఇంగ్లీష్ పదాలు వస్తే  They can speak it reasonably well. వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ పదసంపద(vocabulory) కూడా ఉంటుంది.మరయితే ఏమిటి పట్టి ఆపేది.అక్కడే ఉంది కీలకం.

ఆ గ్రామరే వీరిపాలిట గుదిబండై కూర్చుటుంది.తాము మాట్లాడే లేదా ఇతరులు మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు గ్రామర్ పరంగా కరెక్టేనా..ఏమైనా లొసుగులున్నాయా..వెంటనే తమ ప్రమేయం లేకుండా వారి మనసు దానిపై concentrate చేస్తుంది.భాషలో నుంచి తరవాత గ్రామర్ పుట్టింది తప్ప గ్రామర్ లోనుంచి భాష పుట్టలేదు.గ్రామర్ నియమాల్లో సైతం మార్పులొస్తున్నాయి.మీరు రోజు ఇంగ్లీష్ పేపర్లు,వార్తలు గమనిస్తుంటే ఇది మీకే తెలుస్తుంది.అలాగని గ్రామర్ అనవసరమని నేనడం లేదు.ముందు మాట్లాడడం మొదలెట్టండి.చచ్చినట్టు గ్రామర్ అదే వస్తుంది.నిజం చెప్పాలంటే ఇంకా బాగా అర్ధమవుతూ గ్రామర్ సునాయాసంగా నేర్చుకోగలరు.

హైస్కూల్ లోనూ,కాలేజీ లోనూ కావలసినన్ని గ్రామర్ పాయింట్లు నేర్చుకున్నారు.పాఠాలు చదివారు. ఒప్పజెప్పారు ఇంకా మంచి మార్కులు కూడా తెచ్చుకుని ఉంటారు.మరి ఇవన్నీ కలిసి ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడాలి అనేసరికల్లా పనికి రాకుండా పోతాయి. word ని word ని కూడబలుక్కుని మాట్లాడాలని ప్రయత్నించడం కంటే phrases ని గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు మాట్లాడటానికి ప్రయత్నించండి.చిన్నవైనా..పెద్దవైనా ఫరవాలేదు.దానివల్ల మన మూతి లేదా నోరు అందాం ..దానికి అనుగుణంగా తిరగడానికి అలవాటుపడుతుంది.అది చాలా ముఖ్యం.

ఇంగ్లీష్ ఏ తప్పులు లేకుండా అద్భుతంగా రాయగలిగిన వాళ్ళు చాలామంది మాట్లాడడం దగ్గరకి వచ్చేసరికి నోరు పెగలక ఇబ్బంది పడుతూ ఉంటారు.లోపల సరుకు ఉంటుంది.కాని బయటికి రావడం లో ఇబ్బంది మామూలుగా ఉండదు. దానితో చిరాకు లేచి ఇంగ్లీష్ శతృవులుగా మారినవాళ్ళు నాకు తెలుసు.

మాట్లాడేదానికి,రాసేదానికి ఎప్పుడూ భేదం ఉంటుంది.అది గమనించాలి.మాతృభాషలో కూడా అలానే ఉంటుంది.కాకపోతే మనం పట్టించుకోం."ఏ దారా" (Hey,come here)అంటాం మాట్లాడేటప్పుడు.మళ్ళీ రాసేటప్పుడు "ఏయ్ రారా" అనే రాస్తాం.అదే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం నూటికి నూరు పాళ్ళు వంకలు పెడతాం ఏ మాత్రం తప్పు దొర్లినా..! ఈ సూటి పోటి బనాయింపులు భరించలేక చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలనే కోరికనే చంపేసుకుంటారు. ఇలాంటి వారిలో ధనం తోనూ,చేసే ఉద్యోగం యొక్క హోదా తోనూ సంబంధం లేకుండా అన్ని రకాల ప్రజలున్నారు.

ఇంగ్లీష్ మీడియం లో చదివిన పిల్లలని చూడండి.. బాగా మాట్లాడతారు...కాని మీకు వచ్చిన గ్రామర్ లో వాళ్ళకి 20 శాతం కూడా రాదు.చాలా మంది పెద్దవాళ్ళలో బాగా మాటాడేవారిలో కూడా   చాలామందికి చాలా గ్రామర్ విషయాలు తెలియవు.నా మాట అసత్యమైతే మీరు పరిశీలించి చూడండి.

ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ లో తప్పులు లేకుండా రాయగలరేమో.కాని ఆ బలం తో కాన్వెంట్ పిల్లవానితో కూడా మాట్లాడలేరు.నోరు పెగలక ఆ ఇబ్బంది పడినవాడికే తెలుస్తుంది ఆ చిత్రహింస.కనక మాట్లాడేటప్పుడు గ్రామర్ ని మర్చిపోయి...భావావేశం లోనే మాట్లాడండి.తప్పులుంటే ఉండనివ్వండి.నిన్ను మించిన తోపులు ఎవరూ లేరిక్కడ అని మహేష్ బాబు ఎక్కడో అన్నట్టు ఆ లైన్ లో వెళ్ళండి ..!

Never mind,my good heavens,my pleasure,where have you been all these years,mind your words,please be seated,How are you buddy,Hell with your bloody argument,My sweet heart ఇట్లా word-cluster ని లేదా phrases లో మీ నోరు మాట్లాడటానికి శిక్షణ నివ్వాలి.దానివల్ల ఒక బెనిఫిట్ ఏమిటంటే tight lippedness అనే గుణాన్ని మీరు కోల్పోవడం గమనిస్తారు.ఈ పదగుచ్చాలని ఒక ఉదాహరణ గా మాత్రమే ఇచ్చాను.మీరు గమనించిన ఇతర వాటిల్ని కూడా రాసుకొని సాధన చేయండి. ఆ తరవాత ఆటోమేటిగ్గా వద్దంటే నోటికి అలవాటు అయిపోతాయి.మీకు జోక్ గా అనిపించవచ్చు గాని ఇంగ్లీష్ చందమామ లాంటి పుస్తకాలు,కధల పుస్తకాలు గట్టిగా అంటే బయటికి చదవటానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సాధ్యమైనంత దాకా ఒకే పదం ని ఉపయోగించకుండా phrases ని ఉపయోగించండి.వినడం వల్ల,చదవడం వల్ల భాష వచ్చేది నిజమే..కాని పదిమందిలో అలవోకగా మాట్లాడాలంటే ముందు నోటికి ఇంగ్లీష్ ని అలవాటు చేయాలి.కేవలం పదాల ద్వారా  కాదు అని గుర్తుపెట్టుకోవాలి.

అన్నట్టు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎందుకని ఆసక్తి చూపిస్తారందరు..మళ్ళీ ఓ వైపు తిట్టుకుంటూనే....?!ఈ నా వ్యాసం ఎంతవరకు ఆసక్తిగా ఉందో నాకు తెలీదు..ఒక ఫ్లో లో రాసుకుంటూ పోయాను,బాగుందని ఎవరికైనా అనిపిస్తే మరిన్ని నా అనుభవాల లోనివి కొన్ని రాయడానికి ప్రయత్నిస్తాను.




స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం)


గతం లో ఎక్కడాపాను...ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు,,ఓ వైపు తిట్టుకుంటూనే అనికదూ.!భారతదేశం లో మన ఒక్క రాష్ట్రమనే కాదు.....ఇంచుమించు  అన్ని ప్రాంతాల్లో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారని అనిపిస్తుంది ఆంగ్లం విషయంలో...!నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది.దాన్ని తీసివేయడం అంత సులువు కాదు.ఇంగ్లీష్ వచ్చినవారికి అన్ని విషయాల్లో ఎక్క్వ జ్ఞానం ఉంటుదని,వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారని ఇలా కొన్ని ఆధునిక మూఢభావాలు లోలోపల పేరుకుపోయాయి.అయితే దానికి కారణాలు లేకపోలేదు.

బ్రిటిష్ వారు మనల్ని పాలించడం వల్ల అది పాలకుల భాషగా మనదేశంలో గౌరవం పొందింది.కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగినపుడు కూడా గమనించాను.ఎంతవాళ్ళకి "హిందీ" లో రాజ్య వ్యవహారాలు నడిచినా ..ఇంగ్లీష్ విషయం లో వాళ్ళకి తెలియకుండానే ఒక గౌరవాన్ని ఇస్తారు.దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.

ఓసారి ఉత్తరాఖండ్ లో ఋషికేష్ పక్కన ఒక ఊరికెళ్ళాను.చాలామంది టూరిస్టులు భోజనాలు కానిస్తున్నారు.నా కప్పట్లో వచ్చిన స్పోకెన్ హింది స్వల్పం. సరే...పనులు నడుస్తాయి అది వేరే విషయం.నాకొచ్చిన బ్రోకెన్ హిందీ లోనే ఆర్డర్ ఇచ్చాను.ఎందుకనో దక్షిణాది వాళ్ళంటే ఉత్తరాది వాళ్ళకి కొంత చిన్న చూపే.వాళ్ళ రంగుని చూసో,వేషధారణ చూసో,మనవాళ్ళు కూడ ఇక్కడ దబాయించి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడరు.తెలివిలో గాని,బురిడీ కొట్టించడం లో గాని మన ముందు వాళ్ళు ఎందుకూ పనికిరారు.కొద్ది అనుభవం లో అది తెలిసిపోతుంది.ఇక తమిళ,మళయాళీల గారడీల ముందు చెప్పాలంటే దిగదుడుపే.అయితే ఒకటి వాళ్ళ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఉద్రేకస్వభావులు.

ఆ..వచ్చేద్దాం వెనక్కి...హోటల్ లోకి వెళ్ళి  సౌత్ ఇండియన్ తాలీ కి ఆర్డర్ ఇచ్చానుగదా.ఎంతకీ రాదు...ఓసారి ఓనర్ కి కూడా చెప్పిచూశా..!లాభం లేదు.అక్కడ మన తెలుగు నడవదు.మన హిందీ అంతంత మాత్రం.ఏదో బ్రోకెన్ హిందీ లో ఓ పరాయి రాష్ట్రం వ్యక్తి చెప్పాడుకదా అని అతని భావమేమో.నాకు కాలింది.ఇక లాభం లేదనుకొని అనుకున్నది అనుకున్నట్లుగా నా భావావేశాన్ని మొత్తం పది నిమిషాలు పాటు ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచికొట్టాను.మీరు నమ్మరు...ఒక్కసారిగా అతను నిర్ఘాంతపోయినంత స్థాయిలో ఇదైపోయి నా దగ్గరకి వచ్చి మరీ సర్వర్ చేత వడ్డింపజేసి ..మళ్ళి నేను వస్తున్నప్పుడు కూడా "టాటా" చెప్పి మరీ వీడ్కోలు చెప్పాడు. భారతదేశమా... నువ్వు ఇంతే మారవు..ఎక్కడైనా ఒక్కటే " అనిపించింది.

ఈ వెయిటేజీ ఇంగ్లీష్ కి అడుగడుగునా మనకి దేశంలో కనిపిస్తుంది.అలా జీర్ణించుకుపోయిందంతే..!అందుకే ఇంగ్లీష్ గడ గడా మాట్లాడాలని చాలామందికి తాపత్రయం.ఓ రకంగా మంచి వ్యసనమే ఇది.వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఆ రేంజ్ లో passion ఉన్నవారు ఆ భాషని నోటితో ఇట్టే అందిపుచ్చుకుంటారు.

-- తప్పో,ఒప్పో మాట్లాడుతూనే ఉండాలి.దాంతో పాటుగా చదవటం,వినడం శ్రద్దగా చేస్తుండాలి.ఒక నెల ప్రయత్నిస్తే వస్తుందా ..రెండు నెలలు ప్రయత్నిస్తే వస్తుందా అనుకొని caliculation వేసుకునేవాళ్ళకి ఎప్పటికి రాదు.దాని పై ఒక ప్రేమ తో సాధన చేస్తే దానిలోని తీపిదనం తెలుస్తుంది తప్ప లెక్కల మాదిరిగా చేస్తే పని కాదు.

--ఒక్కొక్క word ని కాకుండా word-cluster ల లో మాట్లాడటాడానికి నోటికి శిక్షణ నివ్వాలి అని చెప్పుకున్నాం గదా గతంలో..! ఉదా: నిన్న temple ని visit చేశారా..? అని కాకుండా Have you visited temple yesterday  అని ఒకే stroke లో వచ్చేలా ప్రాక్టీస్ చేయండి.ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి మీరు ఎన్నైనా సేకరించుకొని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుండాలి.ఇలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి మాకు అని మీరు అడగవచ్చు.ఆ..అక్కడికే వస్తున్నా..ఇది అర్ధం అర్ధం చేస్కుంటే మీకు చాలా అవగతమైనట్లే..!

మీరు మొదట్లో క్లిష్టమైన classics ని చదవటానికి ప్రయత్నించవద్దు.అంటే షేక్స్ పియర్ లాంటి ఉద్ధండుల  రచనల్ని చదవవద్దు.

-- సంభాషణలు ఉండే ఇంగ్లీష్ ఫిక్షన్ ని చదివితే చాలా మంచిది.News paper ని చదవవద్దని చెప్పను గాని దాని లక్ష్యం వేరు.మీరు composition రాయడానికో ఇంకా ఏదైనా written work చేయడానికో అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇంగ్లీష్ దైనందిన చర్య లో భాగంగా ఎలా మాట్లాడాలో నేర్పదు.ఎంత natural గా effort less గా మాట్లాడితే అంత fluency పెరుగుతున్నట్లు లెక్క.

--నా మటుకు నన్ను చెప్పమంటే Sidney sheldon రాసిన ఫిక్షన్ చదవమని చెప్తాను.దాని వల్ల కధా విషయం తెలియడం ఓ ఎత్తైతే మరో వైపు ఆ నవల ల్లోని పాత్రలు మాట్లాడే సంభాషణలు ..వర్ణనలు మీ మెదడు లో అప్రయత్నంగా రిజిస్టెర్ అవుతాయి.ఉదాహరణకి Sidney sheldon రాసిన MORNING,NOON& NIGHT  అనే నవల్లో 293 వ పేజిలో గల కొన్ని సంభాషణలు మీ కోసం ఇక్కడ ఇస్తాను.ఓ స్త్రీ,ఓ పురుషుని మధ్య జరిగే సన్నివేశమిది.

"Wait a minute...!We really have to talk.."

"My bus is leaving"

" There will be another bus "

" My suitcase is on it"

 Steve turned to a porter."This woman is about to have a baby.Get her suitcase out of there ..!quick..!"

Julia puzzled.

"Do you know what you're doing"

"No," Steve said.

ఎంత సింపుల్ గా,హాయిగా,భావయుక్తంగా,ఉన్నయో చూడండి ఈ సంభాషణలు.దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది..మీకు already ఇంగ్లీష్ వచ్చు.కాని fluency కోసమే గదా మీప్రయత్నం.బాగా గమనించండి...ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు మాట్లాడే భాషని మీరు బాగా గమనించండి...చాలా కృతకంగా...dry గా ఉంటుంది వారి శైలి.అది రాయడానికి బావుంటుంది..మాట్లాడం లో ఏదో ఆత్మ మిస్ అయినట్లుగ ఉంటుంది.

నేను నా అనుభవం లోనుంచి చెప్పే ఏకైక తిరుగులేని పట్టు ఏమిటంటే ఇంగ్లీష్ ఫిక్షన్ మాత్రమే దీనికి సహకరిస్తుంది.మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు...ప్రయిత్నించండి..మీకు నేను చెప్పని చాలా ఇతర విషయాలు కూడా పట్టుబడతాయి.ఇప్పుడు ఎందుకు చెప్పానో అప్పుడుగాని అర్ధం అవదు.

ఎవరైనా మీతో జోక్ చేస్తేనో ..ఇంకోటి చేస్తేనో ఇప్పుడైతే మీరేమంటారు. Don't be jovial అనో ఇంకోకటో ఒక stock లో ఉన్నవి మాత్రమే అంటున్నారా..Hey..stop fooling around here  అనో stop kidding  అనో ఇట్లా దైనందిన చర్యల్లో వాడుకలో ఉండే పదగుచ్చాలు అలవోకగా వచ్చేస్తాయి.ఏదైనా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది..?మీరు ఇప్పటిదాకా ఎన్నో విధాలా ప్రయిత్నించిఉండవచ్చు... చివరిగా నా ఈ విధానాన్ని చూసి,పనికిరాకపోతే చెప్పండి.

               ---K V V S Murthy


ఏ ప్రాంతపు ఇంగ్లీష్ ఉచ్చారణ బావుంటుంది..?


ఈ మాట మనం వింటూనే ఉంటాము కాని ఏదీ ఇదమిద్ధంగా నిర్ణయించుకోలేము.భారత దేశం లో ఎక్కడ ఉన్న వారైనా వారి యొక్క మాతృ భాష ప్రభావం వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీద తప్పనిసరిగా ఉంటుంది.కాకపోతే ఎవరిది వారికి బాగున్నట్లు అనిపిస్తుంది.అసలు అది ఒక తప్పు కూడా కాదు.నూటికి నూరు శాతం ఆ చలి దేశాల వారి ఉచ్చారణ రమ్మన్నా రాదు.ఆ స్వరం అలా సెట్ అవుతుంది...అక్కడ కొన్నాళ్ళు ఉంటే మారవచ్చునేమో..అయినా బ్రిటన్ లోనే ప్రాంతాలని అనుసరించి ఉచ్చారణ లో తేడాలున్నాయి.వెల్ష్,ఐరిష్,స్కాటిష్ ప్రాంతీయ తేడాలున్నాయి.సరే..ఇక అమెరికా,కెనడ,ఆస్ట్రేలియా దేశాల మధ్యన తేడాలున్నాయి.అది అత్యంత సహజం కూడా.

కొన్ని పదాల్ని చక్కగా పలుకుతూ కొన్నిటిని మనకి తెలియకుండానే మరోలా పలుకుతుంటాము.కొద్దిగా ఉచ్చారణ లో తప్పు దొర్లిందని ఎదుటి వారిని చిన్న చూపు చూడటం కూడదు.వారిని నొప్పించకుండానే అది సరిదిద్దటం చేయవచ్చు.బాగా ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉన్నవారు కూడా వారి మాతృ భాష ప్రభావం పడిన భాషనే నిస్సంకోచంగా మాట్లాడుతారు,ఇంగ్లీష్ లో రచనలు చేసే బెంగాలీ,ఒరియా,పంజాబీ,దక్షిణాత్యులు  కొంతమంది తో నాకు పరిచయం ఉన్నది. వెంటనే మాట్లాడేప్పుడు పోల్చుకోలేము గాని కొద్ది సేపు అనుభవం తో ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారో తెలిసిపోతుంది.కనుక ఇబ్బంది ఏమీ ఉండదు.

ఉదాహరణకి Zero అనేదాన్ని Seiro అని,Loan అనేదాన్ని Laan అని,Simply అనే పదాన్ని Zimply అని Temple  అనే పదాన్ని టెంబుళ్ అని ఇట్లా మళయాళీలు పలుకుతూంటారు.మరొకటండొయ్..రమ్య ని రెమ్య అని లక్ష్మి ని లెక్ష్మి అని సదరు సోదరులు పిలుస్తుంటారు.ఇక బెంగాల్ వాళ్ళు ...About ని Obout అని,Very ని Vehry అని ఇట్లా పలుకుతుంటారు.బిబేకానంద ,రబీంద్రనాధ్ ల విషయం మనకి తెలిసిందే.ఒవెల్ సౌండ్స్ ని మరీ ఒత్తి పలకడం గాని,తగ్గించినట్లు పలకడం గాని చేస్తుంటారు.

ఇక పంజాబీ వాళ్ళు sport చేస్తున్నా అని అంటే Support చేస్తున్నట్లుగా అనుకోవాలి.ఇట్లా చాలా ఉన్నాయి.అలాగని వీరంతా తక్కువ వాళ్ళేమీ కాదు.ఆంగ్ల భాష లో పెన్ను పెడితే అద్భుతంగా రాసుకుపోతారు.అదే మాతృ భాష గొప్ప తనం మరియు  ప్రత్యేకత  కాబట్టి తక్కువ గా చూడకూడదని చెప్తుంటాను. అంత దాకా ఎందుకు మన దైనందిన జీవితం లో ను కొన్ని పొరబాటు ఉచ్చారణ లు చేస్తుంటాము.Debris ని Debree అని పలకాలి,Dengue ని Den-gee అని,Monk ని Munk అని Pizza ని  Peet-za అని పలకాలి.అది మనకి తెలియదని కాదు లేగాని నోటికి సులువుగా ఉంటుందని కొన్ని అలా పలికేస్తుంటాము.

నేను చూసినంతలో బాగా ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ మాతృ భాష ప్రభావాన్ని తప్పుపట్టరు.ఎందుకంటే సర్వ సహజంగా అచేతనంగా జరిగేదని వారికి తెలుసు.చాలామంది నేటివ్ అమెరికన్లు గాని యూరపియనులు గాని మనం ఏ కొద్ది చక్కగా మాట్లాడినా అభినందిస్తారు.ఏవైనా తప్పు దొర్లినా మర్యాదకరమైన పద్ధతి లో పరోక్ష పద్ధతి లో చెపుతారు.మన వాళ్ళతో ఏమంటే బ్లంట్ గా ఇక నువు ఇంగ్లీష్ కి పనికి రావు పో అన్నట్లు అవమానించినట్లు చెపుతారు.అందుకే పాపం చాలామంది ప్రాక్టీస్ చేయాలన్నా ఇబ్బంది గా ఫీలవుతారు.అసలు ఇంగ్లీష్ అనేది ఈ రోజున ఏ ఒక్క దేశం వారిదో కాదు,అనేక అనేక తేడాలతో ప్రపంచం మొత్తం దీను.ఇన్ని భాషలున్న ఈ దేశం లో ప్రతి ఒక్కరు తమ భాషే సుపీరియర్ అనుకుంటూ ఇంకో భాషని ద్వేషించడం అర్ధం లేని విష్యం..ఒక కామన్ లాంగ్వేజ్ గా పోనీ హిందీనైనా దేశం మొత్తం మీద బలవంతం గా నైనా  రుద్దగలిగారా అదీ లేదు.అయినప్పుడు ఏకత్వం ఎలా వస్తుంది..బ్రిటిష్ వారి పుణ్యాన ఆ గేప్ ని ఇంగ్లీష్ తీర్చింది.




ఇంగ్లీష్ రచనలు అవి కధలు గాని,నవలలు గాని ఇంకేవైనా గాని సాధ్యమైనంత తరచుగా చదవడం


ఇంగ్లీష్ రచనలు అవి కధలు గాని,నవలలు గాని ఇంకేవైనా గాని సాధ్యమైనంత తరచుగా చదవడం అలవాటు చేసుకుంటే ఇంగ్లీష్ ని మరీ పట్టి పట్టి ఎవరి దగ్గరా నేర్చుకోనవసరం లేదు.కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు ..అన్ని వందల పేజీల నవలల్ని ఏం చదువుతాము ..అని..!.?వాళ్ళు అన్నదానిలోను సత్యం లేకపోలేదు.ఎందుకంటే ఓపిక తో అంత సమయం వెచ్చించి చదవడం ఎందుకు..ఎవరో రాసినా సమీక్ష లనో దేనినో చదివితే చాలాదా..లేదా పైపైన చదివితే చాలదా అని వారి అభిప్రాయం.

ఏది ఊరకనే రాదు.ఊరికినే వచ్చింది ఊరికినే పోతుంది.చివరి పేజీ దాకా చదవక పోతే ఒక రచయిత శైలీ విలాసం గాని,ఆ భాషలోని నిర్మాణ వ్యూహాలు గాని,చిన్న పదాలతోనే చక్కని భావస్పోరకమైన వాక్యాల్ని నిర్మించడం అనేది ఎలా తెలుస్తుంది.ప్రతి రచయితకి ఒక సంవిధానం ఉంటుంది.ప్రాంతీయ ప్రభావం ఇంగ్లీష్ లో రాసేప్పుడు ఎవరికైనా పడుతుంది.ఉదాహరణకి అమెరికన్ రచయితలైన ఓ.హెన్రీ కధల్ని గాని,అర్థర్ మిల్లర్ డ్రామాల్ని గాని,ఇంకా మార్క్ ట్వైన్ ని గాని ..ఇంకా ఈనాటి ఫిక్షన్ రారాజులు హెరాల్డ్ రాబిన్స్,సిడ్నీ షెల్డన్ లాంటి వాళ్ళు గాని వీళ్ళని చదివితే ఆ వాక్య విన్నాణం సూటిగా ,హాయి అయిన పదాలతో  ,జర్ మని జారి పోయే విధంగా సింపుల్ గా అనిపిస్తుంది.మరి అదే డికెన్స్ ని గాని,అగాథ క్రిష్టి ని గాని..ఈనాటి జెఫ్రీ అర్చర్ ని గాని చదవండి..అదీ ఇంగ్లీషే గాని ఒక ప్రౌఢత్వం ..ఒక orthodoxy కనిపిస్తుంది.ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వారు కాబట్టి.అంతమాత్రాన ఎవరిది గొప్ప అని అడగడానికి ఏం లేదు. మనని బ్రిటిష్ వాళ్ళు పాలించడం వల్ల ఎక్కువగా ఆ తరహాకి అలవాటయ్యాము.

ఇక అసలు ఇంగ్లీష్ రాకపోయినా దాదాపు ఇంగ్లీష్ రచయితలే అన్నంతగా ప్రసిద్ది పొందిన నేటి పోఅవ్లో కోయిలో(మాతృ భాష పోర్చ్ గీస్)  నుంచి నాటి టాల్స్ టాయ్ ,దోస్తొ విస్కి (రష్యన్లు)ఇంకా గుస్తావ్ ఫ్లాబర్,బాల్జాక్ ,అల్బర్ట్ కాము,సార్త్రె ,అలెక్జాండర్ డ్యూమస్ (ప్రెంచ్ ) ,ఫ్రాంజ్ కాఫ్క (జర్మన్) దాకా వారి రచనల్ని అన్నీ ఇంగ్లీష్ లోకి వస్తేనే మనం చదవగలిగాము,అనువదించగలిగాము..సంస్కృతి పరంగా చూస్తే ఆ భాషలు అన్నీ సామీప్యం గలవే.సాంఘిక విభేదాలు సైతం మనతో పోలిస్తే తక్కువ.కనుకనే వాటిని ఇంగ్లీష్ లోకి తెచ్చేప్పుడు వారి మూల భావాన్ని త్వరగా ఖచ్చితంగా ఆకళింపు చేసుకుంటారు.మన తెలుగు అనువాదకులు కేవలం మక్కీ కి మక్కీ కి అనువదించి పని అయిందనుకుంటే కాదు..వారి లోని వైవిధ్యాలకి కారణాల్ని చక్కగా వెదికి పట్టుకోపోతే వారి ఆత్మ దొరకదు.అది చాలా సూక్ష్మమైన పని.
ఈ మధ్య ఓ మిత్రుడు కలిసినపుడు మాటల్లో అన్నాడు.."ఫౌంటైన్ హెడ్ " బాగుంది..ఈ మద్యనే చదివాను అని.దానిలోని నచ్చిన నచ్చని అంశాలు కొంచెం కధ ని వినిపించవా అన్నప్పుడు ..ఆ ఎప్పుడో చదివాం..ఏం గుర్తు ఉంటుంది..అంటూ హీరో వ్యక్తిత్వం బాగా నచ్చింది అన్నాడు.ఆ మాట ఎక్కడో చోట వింటూ ఉండేదే..అంతకి మించి ఏమైనా చెబుతాడేమో అని చూశా..నా ఆశ అడి ఆశే అయింది.నిజంగా పూర్తిగా చదివిన వాడి చెప్పే తరహా ఏ వేరు గా ఉంటుంది.ఈ పైపైన టచ్ చేయడం అనేది దేనికి పనికి వచ్చేది..?

మనలో చాలా మందికి ఏమంటే..ఇప్పుడు దీన్ని చదివా ..నా కేమిటి ఇప్పుడు వెంటనే లాభం..అనే ధోరణి ఎక్కువ.ప్రయోజనం వెంటనే కనపడాలి.అందుకే సమయాన్ని వెచ్చించి చదవలేము.కూడగట్టుకుని రాసే ఇంగ్లీష్ వల్ల ఆ ఫ్లో అనేది కనిపించదు.లేకపోతే పరమ కృతకంగా పాషాణ పాకంగా రాయాలనుకుంటారు.విస్తారంగా చదవకపోవడం వల్ల కలిగే లక్షణాలవి.లక్షలు పోసి కార్పోరేట్ కాలేజీ లో చదివినా ఒక పుస్తకం ని ధైర్యం గా ఇంగ్లీష్ లో రాసి వదిలే పని చేయలేరు.వీళ్ళకి గ్రామర్ రాదా ..అసలు వీళ్ళకి వచ్చినంత గ్రామర్ ఎవరకీ రాకపోవచ్చు..కాని క్రియేటివ్ రచన కి గ్రామర్ ఒక్కటే కాదు కావలసింది.


ఒక ఫ్రేం లో బిగించినట్టు వాక్య నిర్మాణం అనేది విస్తార పఠనం లేకపోవడం వల్ల కలిగే ఓ అవస్థ.Hai,Dude,guys,Shit కేవలం ఇలాంటి మాటల దగ్గరనే యువతరం నిలిచిపోకూడదు.ఇంకా సీరియస్ గా విస్తారమైన పఠనం ని కొనసాగించాలి. తెలుగు లో ఎలా ధైర్యం గా రాయగలుగుతున్నారో వివిధ ప్రక్రియల్ని అలానే ఇంగ్లీష్ లోనూ రాయగలగాలి.మనలోని మంచి వాటిని ఇంకా ఇంగ్లీష్ లోకి తీసుకు వెళ్ళాలి.అది సామాన్యమైన పని కాదు.కృషి తోనే సాధ్యం.

ప్రపంచ రీతులకి సంబందించి,వ్యక్తీకరణకీ సంబందించీ ఇంగ్లీష్ భాష సాధించిన ప్రగతి ప్రత్యేకమైనది.మనం ఒడ్డుమీద నుంచుని దానిలో ఏముంది అనుకోకూడదు.తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తూ తెలుగు ప్రేమ కబుర్లు చెప్పేవారు మరో రకం. ఇది ప్రపంచీకరణ యుగం.దీనిలో పురోగమించాలన్నా దీని పనిముట్లు దీనివే.Click here


అనుకుంటారు.మరి ఈ రకం గా ఎందుకని తెలుగు లో ఉంది అంటే ..ఒకరకమైన హిపోక్రసీ ఏ..! అంతకంటే ఏమి లేదు. మీరు పావ్లో కొయిలో ఆంగ్ల అనువాదల్ని చదవండి..ఎంత సూటి గా ఎంత..ఎంత సరళ భాష లో ఉంటాయో.ఆయన పోర్చు గీస్ లో మాత్రమే రాస్తాడు.మిగతాదంతా అనువాదకులే.కాని మన ఇంగ్లీష్ అనువాదకులో ..మూల రచన కంటే పరమ కృతకంగా అనవసరమైన ఆడంబర పదాలతో గారడీ చేసి అసలు దాన్ని చెడగొడతారు.ఒక ఉదాహరణ చెబుతాను...నేను మనోజ్ దాస్ ఆంగ్లం లో రాసిన  Farewell to a Ghost, The General అనే కధల్ని ఇటీవల చదివాను.అదే రచయిత తన మాతృ భాష అయిన ఒరియా లో కొన్ని కధలు రాశాడు.రెండిటికి బేరీజు వేస్తే చదువరికి అర్ధం అవడమే  ధ్యేంగా ఉంది. మరి ఎందుకని ఇంగ్లీష్ అనువాదం కి వచ్చేసరికి జటిలంగా చేయాలని భావిస్తారు.అదే అర్ధం కానిది.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ..ముంబాయి నుంచి అటు ఈశాన్య రాష్ట్రాల దాకా  తెలుగుల భావ జగతి తెలియాలంటే ఆంగ్లమే సరైన సాధ్యం...అంతకు మించి ఎల్లలు దాటాలన్నా దాని వల్లనే సాధ్యం.ప్రతి రాష్ట్రానికి అయిదు లేదా పది కాపీలే అమ్ముడు పోనివ్వండి కాని దాని విలువ వేరు.దాని విస్తరణ వేరు. ఏముంది చేతన్ భగత్ నవల్స్ చదవండి... అంత కన్నా లక్ష రెట్లు మిన్నగా రాసేవారు మన లోనూ ఉన్నారు. కాని మనం ఒక హిప్నాటైజ్ కాబడిన స్థితి లో ఉన్నాము.అదే సమస్య.ఎంత సేపు మన చూపు మన పరిధి లోనే.ఆంగ్ల విస్తరణకి..దానికి ఉన్న మార్గాలు అన్వేషించడం లో కూడా ఒక అలసత్వమే.కొంతమంది ప్రముఖ రచయితల్ని పబ్లిషర్స్ ని కలిసినపుడు కూడా ఎందుకనో ఓ విముఖత నిర్లిప్తత అగుపించింది.ఇకనైనా పొరలు చించుకొని బయట కి వద్దాము. Click here




ఒక వేపు గుడ్డిగా ఇంగ్లీష్ భాషని ద్వేషిస్తూ మరో వేపు ...


ఈ మధ్యనే ఒక దిన పత్రిక లో మన రాష్ట్రం లోని చాలామంది ఇంజనీరింగ్ విధ్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాల విషయమై ఒక కధనం ప్రచురించింది.కాలేజీ నుంచి బయటకి వస్తున్న చాలా మంది సరైన ఆంగ్లం ని మాట్లాడలేకపోతున్నారని ..ఇంకా రాత విషయమూ అంతంత మాత్రమేనని.దానికి ఒకటని కాదు అనేక కారణాలు ఉన్నాయి.ఒక వేపు గుడ్డిగా ఇంగ్లీష్ భాషని ద్వేషిస్తూ మరో వేపు దాని లో ప్రావీణ్యం కావాలంటే ఎలా వస్తుంది.మన మేధావులు  పత్రికలు తెలుగు మీద ప్రేమ ముసుగు లో ఒక హిపోక్రసీ ని పెంచి పోషిస్తుంటాయి.అక్కడక్కడ ముక్కలు ముక్కలు గా కొన్ని పద ప్రయోగాలు ప్రశ్నకి సమాధానం టైపు వాక్యాలు ఇవి బట్టీ పడితే చాలు భాష పట్టుబడినట్లే అని కొంత మంది భావిస్తుంటారు.అక్కడే వస్తుంది చిక్కు.పేకేజీ ల లెక్కన లక్షలు చెల్లిస్తే చాలు కార్పోరేట్ కాలేజీ వాళ్ళు ఫలానా సీటు గేరంటీ అన్నట్టు గా ఇంగ్లీష్ ని ఆ విధానం లో నేర్చుకోవడం కష్టం.

అమెరికా బ్రిటన్ వాళ్ళ కరెన్సీ అయితే కావాలి గాని ఆ భాష ని అభిమానం తో నేర్చుకుందాము..అనే ధ్యాస మన కెక్కడిది.గ్రామర్ నేర్చుకుంటే ఆంగ్లం వచ్చేస్తుందనుకోవడం భ్రమ.అసలిప్పుడు గ్రామర్ రూల్స్ కూడా అవసరాన్ని బట్టి మారిపోతున్నాయి.స్థానిక ఉచ్చారణా ప్రభావాన్ని తప్పు అనుకోవడానికి లేదు.చలి దేశాల్లోని ఆ Nasal sounds గాని అవీ అచ్చుగుద్దినట్లు ఉంటేనే రైటనుకునే భావం నుంచి బయటబడాలి.ఆ లెక్కకొస్తే జర్మన్స్ గాని ,ఫ్రెంచ్ వాళ్ళు గాని ఇతర కొన్ని యూరపు దేశాల వాళ్ళు ఇంగ్లీష్ భాష లోని శబ్దాల్ని వాళ్ళ యాస లోనే పలుకుతారు.అది తప్పిదం గా  నో నేరం గానో పరిగణించబడదు.

ఏ భాషని నేర్చుకోవాలన్నా దాన్ని ముందు ప్రేమించడం నేర్చుకోవాలి.అప్పుడే అది పట్టుబడుతుంది.కేవలం అకడెమిక్ గానే నేర్చుకోవాలి అనుకుంటే జరగని పని.నేనిప్పుడు ఇంత ఖర్చుపెట్టి  నేర్చుకున్నా ..నా కిప్పుడు ఏమిటి అనుకునే వారికి భాష ఎందుకు పట్టుబడుతుంది.నేనెప్పుడూ చెబుతుంటా ..అతి సహజంగా ..ఆడుతూ పాడుతూ ..కృత్రిమత్వం లేని ఆంగ్ల భాష ని నేర్చుకోవాలంటే పాపులర్ ఆంగ్ల నవలల్ని ఇంకా ఆ తరగతి సాహిత్యాన్ని అనురక్తి చదవండి అని. ఎంత సులువైన పదాలతో ఎంత చక్కా గా భావ వ్యక్తీకరణ చేయవచ్చునో అనుభవం ద్వారా పట్టుబడుతుంది.

దానికి పెద్దగా డబ్బులు ఖర్చు చేయనవసరం లేదు.రోజూ కొంత సమయం కేటాయిస్తే చాలు.కాని పేకేజీ ల పద్దతి లో ఉన్నట్టుండి జరగాలంటే కుదరదు.అలా చదివిన వారి వాతావరణం లో  ఉన్నా ఇంగ్లీష్ సునాయాసం గా పట్టుబడుతుంది.నేను కొంత కాలం కేరళ లోను కర్నటక లోను తమిళనాడు లోను  కొన్ని ఊళ్ళ లో తిరిగాను.మొత్తం దక్షిణాది లో ఇంగ్లీష్ ని ఒక పోష్ వ్యవహారంగా రిచ్నెస్ కి సంబందించిందిగా భావించేది మన తెలుగు రాష్ట్రాల లోనే.ఇంగ్లీష్ కి సంబందించి జనరల్ గా సాహిత్యాన్ని చదివేది కూడా మన వారి లో తక్కువ.అందుకే అభినివేశం అంటారే అలాంటి ది ఉండదు...తెలుగు వాళ్ళు ఒక ఇంగ్లీష్ పత్రిక ప్రారంభించినా పరాయి రాష్ట్రం వారు దానిలో చేయి వేస్తేనే తులసి తీర్ధం పోసినట్లుగా లెక్క.కనీసం ఒరిస్సా లో చూసినా మనలాంటి పెద్ద కార్పోరేట్ కాలేజీ లు లేకపోయినా ఎందుకనో ఆంగ్లం విషయం లో డొక్కశుద్ది ఉంది. అనగూడదు గాని ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా,అధ్యాపకులుగా  పనిచేసేవాళ్ళ లోకూడా  జీతం రాళ్ళ కోసం పనిచేయడమే తప్ప ఆంగ్ల అభినివేశం గాని రచనలు చేయడం గాని తక్కువే.ఒక వేళ చేసినా పరమ అకడమిక్ గా ఉంటాయి.ఇంకా చెప్పాలని ఉంది గాని మరెప్పుడైనా చూద్దాము.Click here  



తెలుగు భాషాభివృద్దికి ఇంగ్లీష్ ఎంతమాత్రం ఆటంకం కాదు..మన వాళ్ళ హిపోక్రసీ మాత్రమే ఆటంకం..!

అబ్బా..ఈ కాన్వెంట్ లు అవీ వచ్చినాక తెలుగు భ్రష్టు పట్టిందంటాడు ఒకాయన..!మమ్మీ డాడీ  అని పిలిచి ఎందుకు తెలుగు దనాన్ని,అమ్మ దనాన్ని దూరం చేసుకుంటారు అంటాడు ఇంకో ఆయన కొద్దిగా సెంట్ మెంట్ చిలకరిస్తూ ..! మళ్ళీ విచిత్రంగా ఇలా కవుర్లు చెప్పే వీరి సంతానం అంతా చక్కగా ఇంగ్లీష్ కాన్వెంట్లోనే చదువుతుంటారు.ఏమిటీ ద్వంద్వ విధానం.అందుకే వీరి పలుకుల్లో బలం ఉండదు.వాదనలో పస ఉండదు.ఎంత దుర్మార్గుడైనా సొంత భాషని కావాలని విస్మరించడు.ఒక్కో కాలం ఒక్కో అవసరాన్ని సృష్టిస్తుంది.అప్పుడు ఏది దేన్ని ఆపలేదు.

నిజంగా ఓ ఆర్గుమెంట్ కోసమే అనుకుందాం....పబ్లిక్ ఇంకా ప్రైవేట్ సెక్టార్ లోని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని అన్నిటిని ఎత్తివేసి తెలుగు మీడియం స్కూళ్ళనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవచ్చుగా ఈ పెద్దలు....ఉద్యమ కారులు అంతా కలిసి..!అది వీరి వల్ల కాదు..!చేయలేరు ఎందుకంటే బంగారు బాతు గుడ్ల బిజినెస్ గదా అది.జనాలు తెలివి లేని వారు కాదు...తమ ఉపాధికి ఏది పనికొస్తుంది...తమని పోటీ ప్రపంచం లో ఏది ముందు ఉంచుతుంది అది వారికి తెలుసు. కనుకనే ఎన్ని గోలలు చెలరేగుతున్నా ఇంగ్లీష్ కి ఏమీ కాదు..వర్ధిల్లుతుంది దాని అవసరం ఉన్నంత కాలం.

ఎటొచ్చి ఆంగ్లం నేర్చుకోవడం లో ఫేయిల్ అయిన వారు..నేర్చుకోవడానికి బద్ధకించేవారు....దానిలో కృషి చేసి రాణించే ఓపిక లేని వారు చెప్పే కబుర్లు ఇవి.ఏ భావావేశానికి లోనవకుండా చూస్తే తెలుగు సాహిత్య రంగానికి ఇంగ్లీష్ వల్ల ఒనగూరిన మేలు చాలా గొప్పది.కందుకూరి వీరేశలింగం గారి నుంచి..గురజాడ వారి వద్ద నుంచి ..ఇంకా విశ్వనాధ ..శ్రీ శ్రీ ల దాకా  ..ఇంకా ఎందరెందరో ..ఎవరైతే కాలానికి ముందు నిలిచారో సాహితీ ప్రక్రియల్లోగాని,జ్ఞానం లో గాని,తెలుగు ని పరిపుష్టం చేశారో అలాంటి మహానుభావులంతా ఇంగ్లీష్ లో కూడా వారి మాతృ భాషలో కలిగి ఉన్నంత పట్టు కలిగినవారే.అలాంటి వారెవరూ ఎందుకని ఇంగ్లీష్ కి వ్యతిరేకంగా ఉద్యమం నడపలేదు..ఎందుకంటే ప్రపంచానుభవం లో ఇంగ్లీష్ కున్న స్థానం విశిష్టమైనది.అనేక ప్రాంతాల కి పాకి అనేక ఒరవడుల్ని ఇముడ్చుకున్న భాష అది.నన్ను అడిగితే ఎవరైతే ఎవరైతే ఇంగ్లీష్ భాషలో పట్టు కలిగి ఉంటారో ..వారికి ఉన్నంత తెలుగు భాషాభిమానం మరెవరికీ ఉండదు.అది ఎలాంటిది అంటే గుప్పున అవసరానికి ఎగిసి ఆరిపోయే అభిమానం కాదు.నా భాష స్థానం ఏమిటి..ఇంగ్లీష్ ఏమిటి..దాని లోనుంచి మనం ఏమి తీసుకోవచ్చును..మళ్ళీ మన భాషలోని లోటు ఏమిటి..ఇలా సాగుతుందది ..  కనుక నే తెలుగు సాహితీ ఉద్ధండులందరూ ఇంగ్లీష్ భాషలోనూ ఉద్ద్ధండులు...!అలాంటి వారివల్లనే ఒక్కో జర్క్ వచ్చి మనం కొన్ని పదుల సంవత్సరాలు ముందుకు తోయబడుతుంటాము.అది వారి మేధా విశేషం ద్వారా వచ్చినట్టిదే..గురజాడ కావచ్చును..విశ్వనాధ కావచ్చును..!అది కేవలం మాతృ భాష అని మాత్రమే బిగదీసుకుంటే వచ్చేది కాదు.విశ్వనాధ వారి వచనం పై ఆంగ్ల భాష యొక్క ప్రభావం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే నాకైతే ఆశ్చర్యం కలిగింది.ఎప్పుడైనా దానిమీద రాస్తాను.నాకు బాగా నచ్చిన అంశాల్లో అది ఒకటి.

మళ్ళి చెబుతున్నాను.ఇంగ్లీష్ భాషని వచ్చీరాని వారు మాత్రమే తెలుగు ని అవమానించేది.కావాలంటే ఈ రోజునుంచి గమనించండి.కాబట్టి ఆంగ్లం తెలుగు కి అడ్డు అనే వాదాన్ని కట్టిపెట్టండి.ముందు ఒక భాషని ప్రేమిస్తేనే దాన్ని నేర్చుకోగలం.దాని లోని అందాన్ని,వ్యక్తీకరణ కౌశలాన్ని ఆస్వాదించకుండా దేన్నీ మనం నేర్చుకోలేం.అసలు ఈ ఇంగ్లీష్ ద్వేషులు పోనీ తెలుగునైనా చిత్తశుద్ధి తో ప్రేమిస్తారా అదీ కనబడదు...సంస్కృతం నుంచి మాటల్ని అనువాదం చేసుకొని వాటినే అచ్చతెనుగు లా భావిస్తూమురిసిపోతుంటారు.వీరికి పొద్దు అనే మాట తెలుగు మాట లా కనబడదు కేవలం ఉదయం ,ప్రభాతము ఇలాంటివి అచ్చ తెలుగులా అనిపిస్తుంటాయి.Click here